iDreamPost
android-app
ios-app

చరిత్ర సృష్టించిన అమెరికా ఆటగాడు.. వరల్డ్ కప్ హిస్టరీలో ఫస్ట్ ప్లేయర్​గా..!

  • Published Jun 02, 2024 | 3:14 PM Updated Updated Jun 02, 2024 | 3:14 PM

టీ20 వరల్డ్ కప్-2024 తొలి మ్యాచే అదిరిపోయింది. ఆతిథ్య అమెరికా-కెనడా మధ్య జరిగిన ఈ మ్యాచ్​ పలు సంచలనాలకు వేదికగా నిలిచింది.

టీ20 వరల్డ్ కప్-2024 తొలి మ్యాచే అదిరిపోయింది. ఆతిథ్య అమెరికా-కెనడా మధ్య జరిగిన ఈ మ్యాచ్​ పలు సంచలనాలకు వేదికగా నిలిచింది.

  • Published Jun 02, 2024 | 3:14 PMUpdated Jun 02, 2024 | 3:14 PM
చరిత్ర సృష్టించిన అమెరికా ఆటగాడు.. వరల్డ్ కప్ హిస్టరీలో ఫస్ట్ ప్లేయర్​గా..!

టీ20 వరల్డ్ కప్-2024కు ఆతిథ్యం ఇస్తున్న అమెరికాను చాలా మంది లైట్ తీసుకున్నారు. క్రికెట్​లో పసికూన కావడంతో మెగా టోర్నీలో ఆ జట్టు ఏం చేయలేదని తక్కువ అంచనా వేశారు. అయితే భారత్, వెస్టిండీస్ సంతతి ప్లేయర్లతో నిండిన యూఎస్​ఏ సత్తా ఏంటో ఇప్పుడు బయటపడింది. టాలెంటెడ్ క్రికెటర్స్​తో ఉన్న ఆ టీమ్ మెగా టోర్నీకి కిక్ స్టార్ట్ ఇచ్చింది. ఫస్ట్ మ్యాచ్​లో కెనడాను చిత్తుగా ఓడించింది. ఈ రెండు టీమ్స్ మధ్య జరిగిన టోర్నమెంట్ తొలి మ్యాచ్​లో అగ్రరాజ్యం 7 వికెట్ల తేడాతో గెలిచింది. కెనడా సంధించిన 197 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 14 బంతులు ఉండగానే ఛేదించింది యూఎస్​ఏ. దీంతో ఆ దేశ క్రికెట్ హిస్టరీలో ఈ రోజు ఎప్పటికీ గుర్తుండిపోయేలా నిలిచింది.

కెనడా సంధించిన టార్గెట్​ను అందుకునేందుకు బరిలోకి దిగిన యూఎస్​ఏను.. ఆండ్రీస్ గౌస్ (46 బంతుల్లో 65), ఆరోన్ జోన్స్ (40 బంతుల్లో 94) విజయతీరాలకు చేర్చారు. ముఖ్యంగా జోన్స్ భారీ షాట్లు బాదుతూ కెనడా బౌలర్లకు చుక్కులు చూపించాడు. ఏకంగా 10 సిక్సులు బాది ప్రత్యర్థులకు నరకాన్ని పరిచయం చేశాడు. ఈ ఇన్నింగ్స్​తో అతడు పలు రికార్డులు సృష్టించాడు. టీ20 వరల్డ్ కప్ హిస్టరీలో సక్సెస్​ఫుల్ రన్ ఛేజ్​లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన నాన్ ఓపెనర్​గా జోన్స్ అరుదైన ఘనత సాధించాడు. ఇంతకుముందు ఎవరికీ ఇది సాధ్యం కాలేదు.

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రపంచ కప్​లో ఛేజింగ్​లో ఎన్నోమార్లు జట్టును గెలిపించాడు. అయితే సక్సెస్​ఫుల్ రన్ ఛేజ్​లో మాత్రం ఇంత స్కోరు బాదలేదు. ఈ రికార్డుతో పాటు టీ20 ప్రపంచ కప్ మ్యాచుల్లో అత్యధిక సిక్సులు బాదిన ఆటగాళ్లలో రెండో స్థానంలో నిలిచాడు జోన్స్. ఫస్ట్ ప్లేస్​లో క్రిస్ గేల్ (11 సిక్సులు) ఉండగా.. జోన్స్ (10 సిక్సులు) రెండో స్థానంలో నిలిచాడు. ఇలా ఒక్క ఇన్నింగ్స్​తో అందరి ఫోకస్​ను తన వైపునకు తిప్పుకున్నాడీ యూఎస్​ఏ ప్లేయర్. ఇక, కెనడాను చిత్తు చేసిన జోష్​లో ఉన్న అమెరికా.. నెక్స్ట్ మ్యాచ్​లో పాకిస్థాన్​ను ఢీకొట్టనుంది. మరి.. యూఎస్ ప్లేయర్ జోన్స్ ఇన్నింగ్స్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.