iDreamPost
android-app
ios-app

Cameron Green: ఆస్ట్రేలియా క్రికెటర్ గ్రీన్ కి ప్రాణాంతక వ్యాధి! ఇంతటి విషాదమా?

  • Published Dec 14, 2023 | 1:19 PM Updated Updated Dec 18, 2023 | 1:02 PM

ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ కామెరున్‌ గ్రీన్‌ ఓ ప్రాణాంత వ్యాధితో బాధపడుతున్న సంచలన విషయం వెలుగుచూసింది. ఇంతకీ గ్రీన్‌కు ఆ వ్యాధి ఎప్పటి నుంచి ఉంది.. అంత ఇబ్బంది పడుతూ.. అంతర్జాతీయ క్రికెట్‌లో స్టార్‌లా ఎలా మారాడు ఇప్పుడు చూద్దాం..

ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్‌ కామెరున్‌ గ్రీన్‌ ఓ ప్రాణాంత వ్యాధితో బాధపడుతున్న సంచలన విషయం వెలుగుచూసింది. ఇంతకీ గ్రీన్‌కు ఆ వ్యాధి ఎప్పటి నుంచి ఉంది.. అంత ఇబ్బంది పడుతూ.. అంతర్జాతీయ క్రికెట్‌లో స్టార్‌లా ఎలా మారాడు ఇప్పుడు చూద్దాం..

  • Published Dec 14, 2023 | 1:19 PMUpdated Dec 18, 2023 | 1:02 PM
Cameron Green: ఆస్ట్రేలియా క్రికెటర్ గ్రీన్ కి ప్రాణాంతక వ్యాధి! ఇంతటి విషాదమా?

ఆస్ట్రేలియా యువ స్టార్‌ క్రికెటర్‌ కామెరున్‌ గ్రీన్‌కు సంబంధించిన ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. తన సంచలన ఆటతో అంతర్జాతీయంగా అతి తక్కువ టైమ్‌లో మంచి గుర్తింపు పొందిన గ్రీన్‌ ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నాడనే విషయం ప్రపంచానికి తెలిసిందే. అయితే.. ఇది ఇప్పుడు వచ్చిన వ్యాధి కాదు.. పుట్టుకతో ఉన్నట్లు స్వయంగా గ్రీన్‌ వెల్లడించి క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేశాడు. తాను చిన్నతనం నుంచే కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నానని తెలిపాడు. ఈ వ్యాధిలో మొత్తం ఐదు స్టేజ్‌లో ఉంటాయని.. ప్రస్తుతం తాను రెండో దశలో ఉన్నానని గ్రీన్‌ పేర్కొన్నాడు. అయితే.. చిన్నతనంలో తన తల్లిదండ్రుల తనను కంటికి రెప్పలే చూసుకోవడం వల్లే ఇప్పుడు క్రికెటర్‌గా ఎదిగానని గ్రీన్‌ చెబుతూ.. భావోద్వేగానికి లోనయ్యాడు.

చిన్న వయసులోనే తనకు కిడ్నీ వ్యాధి ఉన్నట్లు వైద్యులు గుర్తించారని.. ట్రీట్‌మెంట్‌ కోసం ప్రతి వారం తనన వాళ్ల అమ్మ ఆస్పత్రికి తీసుకెళ్తు ఉండేది. అలా గ్రీన్‌ను ఎంతో జాగ్రత్తగా చూసుకోవడం, వ్యాధిని ఆరంభ దశలో గుర్తించి మంచి వైద్యం అందించడంతో గ్రీన్‌ పెద్దగా ఇబ్బంది పడకుండా అందరి పిల్లల్లానే పెరిగాడని వాళ్ల అమ్మ కూడా పేర్కొంది. గ్రీన్‌కు కిడ్నీ సమస్య ఉందన్న విషయం తెలిసిన తర్వాత.. కిడ్నీకి బలవర్ధకమైన ఆహారం ఇస్తున్నట్లు తెలిపారు. నిజానికి ఆ వ్యాధి గురించి ఆరంభంలో చాలా భయపడ్డామని.. గ్రీన్‌కు 12 ఏళ్ల వయసు ఉన్న సమయంలో చనిపోతాడని కూడా భావించామని.. దేవుడి దయవల్ల ప్రమాదం నుంచి బయటపడి.. ఈ రోజు ఇంటర్నేషనల్‌ క్రికెటర్‌గా ఎదిగాడని గ్రీన్‌ తల్లిదండ్రుల తెలిపారు.

Australian cricketer Green has a fatal disease

గ్రీన్‌ ఆస్ట్రేలియా తరఫున 2020లో ఇండియాతోనే ఓవల్‌లో జరిగిన వన్డే మ్యాచ్‌తో అరంగేట్రం చేశాడు. ఆరంభం నుంచి అద్భుత ప్రదర్శన కనబరుస్తూ.. ఆల్‌రౌండర్‌గా ఆస్ట్రేలియా టీమ్‌లో తన స్థానాన్ని పర్మినెంట్‌ చేసుకున్నాడు. ఇక ఐపీఎల్‌లోనూ మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ ఫ్రాంచైజ్‌ ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్న విషయం తెలిసిందే. గ్రీన్‌ను ముంబై ఇండియన్స్‌ భారీ ధర పెట్టి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.  అయితే రాబోయే ఐపీఎల్‌ 2024లో గ్రీన్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు ఆడనున్నాడు. ఐపీఎల్‌ విషయం పక్కనపెడితే.. కిడ్నీ వ్యాధి లాంటి ప్రాణాంత వ్యాధితో బాధపడుతూ.. అప్పుడప్పుడు ఆటలో ఆ కిడ్నీ సమస్యతో క్రామ్స్‌కు గురవుతూ.. ఇబ్బంది పడుతూనే మంచి ప్లేయర్‌గా ఎదుగుతున్న గ్రీన్‌ జీవితం ఎంతో మంది యువ క్రికెటర్లకు స్ఫూర్తి దాయకం. ప్రస్తుతం గ్రీన్‌ కిడ్నీ వ్యాధి కోసం చికిత్స తీసుకుంటూనే ఉన్నాడు. మరి గ్రీన్‌ లైఫ్‌లో ఇంత విషాదం ఉండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.