iDreamPost
android-app
ios-app

క్రికెట్ లవర్స్ కు గుడ్ న్యూస్.. దశాబ్ద కాలం తర్వాత మెగా టోర్నీ!

  • Published Apr 02, 2024 | 9:41 PM Updated Updated Apr 02, 2024 | 9:41 PM

ఐపీఎల్ జాతరను ఎంజాయ్ చేస్తున్న క్రికెట్ లవర్స్ ను అలరించడానికి 10 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ స్టార్ లీగ్ రాబోతోంది. మరి ఆ మెగా టోర్నీ ఏది? పూర్తి వివరాల్లోకి వెళితే..

ఐపీఎల్ జాతరను ఎంజాయ్ చేస్తున్న క్రికెట్ లవర్స్ ను అలరించడానికి 10 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ స్టార్ లీగ్ రాబోతోంది. మరి ఆ మెగా టోర్నీ ఏది? పూర్తి వివరాల్లోకి వెళితే..

క్రికెట్ లవర్స్ కు గుడ్ న్యూస్.. దశాబ్ద కాలం తర్వాత మెగా టోర్నీ!

క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగించడానికి మరో లీగ్ సిద్ధం కాబోతోంది. ఇప్పటికే ఐపీఎల్ జాతరను ఎంజాయ్ చేస్తున్న క్రికెట్ లవర్స్ ను అలరించడానికి 10 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ స్టార్ లీగ్ రాబోతోంది. ఇందుకు సంబంధించి బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డులు చర్చలు జరుపుతున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరి దశాబ్ద కాలం తర్వాత ప్రారంభం కావడానికి సిద్దంగా ఉన్న ఆ మెగా టోర్నీ ఏది? పూర్తి వివరాలు..

ఛాంపియన్స్ లీగ్ టీ20.. సరిగ్గా 10 సంవత్సరాల క్రితం ఈ మెగాటోర్నీ చివరి సారిగా జరిగింది. మెుత్తం 6 సార్లు నిర్వహించిన ఈ లీగ్ లో రెండుసార్లు చెన్నై సూపర్ కింగ్స్, రెండుసార్లు ముంబై ఇండియన్స్ ఛాంపియన్స్ గా నిలవగా.. న్యూ సౌత్ వేల్స్, సిడ్నీ సిక్సర్లు టీమ్స్ ఒక్కోసారి విజేతగా నిలిచాయి. అయితే అభిమానుల నుంచి పెద్దగా ఆదరణ దక్కకపోవడంతో.. ఈ లీగ్ ను నిలిపివేశారు. కాగా.. ఛాంపియన్స్ లీగ్ టీ20ని తిరిగి నిర్వహించే అవకాశం కనిపిస్తున్నాయి. ఈ మేరకు బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ బోర్డుల మధ్య సమావేశాలు జరుగుతున్నాయని క్రికెట్ విక్టోరియా సీఈవో నిక్ కమిన్స్ తెలిపాడు. దీంతో ఈ లీగ్ పై ఆశలు రేకెత్తాయి.

ఇదిలా ఉండగా.. క్రికెట్ ఆదరణ ఉన్న దేశాల్లో ఓ డొమెస్టిక్ లీగ్ నిర్వహించుకుంటారు. అందులో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన టీమ్స్ ఈ లీగ్ కు అర్హత సాధిస్తాయి. 2009లో ప్రారంభమై 2014 వరకు మెుత్తం ఆరుసార్లు ఈ లీగ్ ను నిర్వహించారు. చివరి సారిగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కోల్ కత్తా నైట్ రైడర్స్ ను ఓడించి ఛాంపియన్ గా నిలిచింది. దశాబ్ద కాలం తర్వాత మళ్లీ ఈ లీగ్ కు మహర్ధశ పట్టనుంది. ఈ మెగా టోర్నీ ప్రారంభం అయితే క్రికెట్ ప్రేమికులకు పండగే.

ఇదికూడా చదవండి: Virat Kohli: టీ20 వరల్డ్ కప్ 2024 కోహ్లీ ఆడటం పక్కా! ఇదిగో ప్రూఫ్