వన్డే వరల్డ్ కప్ చరిత్రలోనే ఫస్ట్‌ టైమ్‌! తొలి భారత బౌలర్‌గా బుమ్రా

వన్డే ప్రపంచ కప్ 2023లో అరుదైన రికార్డులు నమోదవుతున్నాయి. టీమిండియా బౌలర్లు, బ్యాటర్లు కళ్లు చెదిరే ఆటతీరుతో నయా రికార్డులను నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ భారత బౌలర్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఏకంగా వన్డే ప్రపంచకప్ చరిత్రలో మొట్ట మొదటి సారి ఆ ఘనత సాధించిన బౌలర్ గా హిస్టరీ క్రియేట్ చేశాడు. కాగా ఆ బౌలర్ సాధించిన ఘనతకు నిన్న భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరిగిన మ్యాచ్ వేదికైంది. ఇంతకీ ఆ బౌలర్ ఎవరూ? సాధించిన ఘనత ఏంటి? ఆ వివరాలు మీకోసం..

వన్డే వరల్డ్ కప్ లో భాగంగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య హోరా హోరిగి సాగిన మ్యాచ్ లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో కంగారులను మట్టికరిపించిన విషయం తెలిసిందే. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా ఆరంభంలోనే పీకల్లోతు కష్టాల్లో పడింది. భారత స్పిన్నర్ల ధాటికి కంగారుల టాప్ ఆర్డర్ కుప్పకూలింది. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో ఆస్ట్రేలియా 199 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఛేదనలో తడబడింది. ఆదిలోనే మూడు వికెట్లు పడగొట్టిన కంగారులు భారత్ కు ఊహించని షాక్ ఇచ్చారు. ఆ తర్వాత లెజెండరీ ప్లేయర్ కోహ్లీ, కేఎల్ రాహుల్ చక్కటి ఆటతీరుతో భారత్ విజయతీరాలవైపు నడిపించి గెలిపించారు.

కాగా ఈ మ్యాచ్ లో భారత్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. వన్డే ప్రపంచ కప్ చరిత్రలో ఆస్రేలియా ఓపెనర్ ను డకౌట్ చేసిన తొలి భారత బౌలర్ గా నయా రికార్డు నెలకొల్పాడు. ఆసిస్ ఓపెనర్ మిచెల్ మార్ష్ ను ఔట్ చేసిన బుమ్రా ఈ ఘనతను సాధించాడు. కాగా ఐసీసీ టోర్నీల్లో భారత్, ఆస్ట్రేలియా తలపడిన మ్యాచ్ లలో ఇప్పటి వరకు ఏ భారత బౌలర్ కూడా ఆసిస్ ఓపెనర్ ను డకౌట్ చేసిన సందర్భాలు లేవు. ఈ నేపథ్యంలోనే నిన్న జరిగిన మ్యాచ్ లో మార్షన్ డకౌట్ చేసిన బుమ్రా వన్డే ప్రపంచ కప్ చరిత్రలో భారత మొదటి బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. బుమ్రా సాధించిన ఈ ఘనతపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments