iDreamPost

World Cup: కివీస్‌ను వణికిస్తున్న నెదర్లాండ్స్‌! మతిపోగొడుతున్న లెక్కలు

  • Author Soma Sekhar Published - 03:47 PM, Mon - 9 October 23
  • Author Soma Sekhar Published - 03:47 PM, Mon - 9 October 23
World Cup: కివీస్‌ను వణికిస్తున్న నెదర్లాండ్స్‌! మతిపోగొడుతున్న లెక్కలు

వరల్డ్ కప్ లో చిన్న దేశమైన నెదర్లాండ్స్ చిచ్చర పిడుగులా చెలరేగుతోంది. మ్యాచ్ లు గెలవకున్నా.. ప్రత్యర్థికి మాత్రం ముచ్చెమటలు పట్టిస్తోంది. ఇటు బౌలింగ్ లో అంటు బ్యాటింగ్ లో సత్తా చాటుతూ.. క్రికెట్ అభిమానుల ప్రశంసలు అందుకుంటోంది. మెున్న పాక్ తో జరిగిన మ్యాచ్ లో పాక్ టాపార్డర్ ను తక్కువ స్కోర్ కే పెవిలియన్ కు పంపి ఔరా అనిపించారు డచ్ బౌలర్లు. అదే జోరును తాజాగా జరుగుతున్న మ్యాచ్ లో చూపిస్తున్నారు. డచ్ బౌలర్ల దెబ్బకు కివీస్ తొలి మూడు ఓవర్లలో చేసిన పరుగులు సున్నా(0). డచ్ బౌలర్లు ఆర్యన్ దత్, రయాన్ క్లైన్ కివీస్ బ్యాటర్లకు ఆదిలోనే చుక్కలు చూపించారు.

వరల్డ్ కప్ లో భాగంగా హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్-నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. తొలుత టాస్ నెగ్గిన డచ్ టీమ్ బౌలింగ్ ను ఎంచుకుంది. అయితే తమ కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ.. నిప్పులు చెరిగే బంతులతో కివీస్ బ్యాటర్లను ఓ ఆటాడుకున్నారు నెదర్లాండ్స్ బౌలర్లు ఆర్యన్ దత్, రయాన్ క్లైన్. వీరి దెబ్బకు కివీస్ ఓపెనర్లు పరుగులు చేయడం అటుంచి.. వికెట్ కాపాడుకోవడానికే తంటాలు పడ్డారు. ముఖ్యంగా ఆర్యన్ దత్ తన రెండు ఓవర్లను మెయిడెన్ వేయడం విశేషం. తర్వాత రయాన్ క్లైన్ కూడా తన తొలి ఓవర్ లో పరుగులేమీ ఇవ్వలేదు. దీంతో కివీస్ తొలి మూడు ఓవర్లలో పరుగుల ఖాతా తెరవలేదు.

అయితే నాలుగో ఓవర్ నుంచి కివీస్ బ్యాటర్లు పుంజుకున్నారు. డచ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగుతూ.. స్కోర్ బోర్డును నెమ్మదిగా పరిగెత్తిస్తున్నారు. ఈ క్రమంలోనే గత మ్యాచ్ సెంచరీ హీరో కాన్వే(32) తక్కువ స్కోర్ కే పెవిలియన్ చేరాడు. విల్ యంగ్ తో కలిసిన రచిన్ రవీంద్ర ఇన్నింగ్స్ ను చక్కదిద్దే పనిలో పడ్డారు. ప్రస్తుతం కివీస్ 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 102 పరుగులు చేసింది. క్రీజ్ లో విల్ యంగ్(50), రచిన్ రవీంద్ర(14) పరుగులతో ఉన్నారు. మరి డచ్ బౌలర్లు వేసిన తొలి మూడు ఓవర్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి