iDreamPost
android-app
ios-app

Brian Lara: 400 కొట్టే సత్తా ఆ టీమిండియా బ్యాటర్​ కే ఉంది! లారా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

  • Author Soma Sekhar Published - 03:29 PM, Wed - 6 December 23

వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారా తాను నెలకొల్పిన 400*( 501* ఫస్ట్ క్లాస్ రికార్డు) పరుగులు ఆల్ టైమ్ గ్రేట్ రికార్డులను బద్దలు కొట్టే సత్తా ఆ టీమిండియా బ్యాటర్ కే ఉందని చెప్పుకొచ్చాడు.

వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారా తాను నెలకొల్పిన 400*( 501* ఫస్ట్ క్లాస్ రికార్డు) పరుగులు ఆల్ టైమ్ గ్రేట్ రికార్డులను బద్దలు కొట్టే సత్తా ఆ టీమిండియా బ్యాటర్ కే ఉందని చెప్పుకొచ్చాడు.

  • Author Soma Sekhar Published - 03:29 PM, Wed - 6 December 23
Brian Lara: 400 కొట్టే సత్తా ఆ టీమిండియా బ్యాటర్​ కే ఉంది! లారా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

క్రికెట్ చరిత్రలో ఎన్నో రికార్డులు ఉన్నాయి. కానీ.. అందులో ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని రికార్డులు పదులు సంఖ్యలో మాత్రమే ఉంటాయి. అందులో ఒకటి వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ బ్రియన్ లారా నెలకొల్పిన 400 పరుగుల రికార్డు ఒకటి. టెస్టుల్లో లారా నెలకొల్పిన ఈ తిరుగులేని హిస్టారికల్ రికార్డును ఇప్పటి వరకు ఎవ్వరూ కూడా బద్దలు కొట్టలేదు. ఈ క్రమంలోనే తన రికార్డును బద్దలు కొట్టే సత్తా ఉన్న ఏకైక బ్యాటర్ ఆ టీమిండియా ప్లేయరే అని చెప్పుకొచ్చాడు. అతడే ఈ ఘనతను సాధించగలడని లారా చెప్పుకొచ్చాడు. మరి వెస్టిండీస్ దిగ్గజం నెలకొల్పిన అసాధారణ రికార్డును బద్దలు కొట్టే ఆ భారత ఆటగాడు ఎవరో ఇప్పుడు చూద్దాం.

బ్రియన్ లారా.. వెస్టిండీస్ క్రికెట్ చరిత్రలోనే కాక, ప్రపంచ క్రికెట్ హిస్టరీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. తనదైన బ్యాటింగ్ తో వరల్డ్ క్లాస్ బౌలర్లుగా పేరుగాంచిన మహామహులకు తన బ్యాటింగ్ పవర్ చూపించాడు. ఇక 2004లో ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టు మ్యాచ్ లో ఏకంగా 400 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు లారా. ఇప్పటి వరకు ఈ ప్రపంచ రికార్డును ఏ ఆటగాడూ బద్దలు కొట్టలేకపోయాడు. ఇదిలా ఉండగా తాజాగా తన రికార్డును భవిష్యత్ లో బ్రేక్ చేసే సత్తా ఉన్న ఆటగాడు ఇతడే అంటూ టీమిండియా యువ బ్యాటర్ పేరు చెప్పుకొచ్చాడు లారా. నేను ఇంగ్లాండ్ పై సాధించిన 400 పరుగుల రికార్డును బద్దలు కొట్టే మెునగాడు టీమిండియా యువ సంచలనం శుబ్ మన్ గిల్ అని పేర్కొన్నాడు లారా.

ఇక ఈ యుగంలో శుబ్ మన్ గిల్ మోస్ట్ టాలెంటెడ్ ప్లేయర్ అంటూ కితాబిచ్చాడు విండీస్ దిగ్గజ ప్లేయర్. ఈ రికార్డుతో పాటుగా తాను ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో నెలకొల్పిన 501* పరుగుల రికార్డును కూడా అతడు బ్రేక్ చేస్తాడని పేర్కొన్నాడు. కాగా.. ఇప్పటికే కేవలం 24 ఏళ్లకే వన్డేల్లో నంబర్ వన్ స్థానాన్ని అధిరోహించి ఘనతకెక్కాడు గిల్. దీంతో పాటుగా పలు అరుదైన రికార్డులను కూడా తన పేరిట లిఖించుకున్నాడు. ఇటీవలే స్పోర్ట్స్ లీడర్ ఆఫ్ ది ఇయర్ లాంటి ప్రెస్టీజియస్ అవార్డును అందకున్నాడు. మరి లారా చెప్పినట్లుగా అతడి రికార్డు బ్రేక్ చేసే మెునగాడు శుబ్ మన్ గిల్ అని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.