iDreamPost
android-app
ios-app

Virat Kohli: ఆ రికార్డు అసాధ్యం.. విరాట్ కోహ్లీకి అంతసీన్ లేదు.. లారా షాకింగ్ కామెంట్స్!

  • Author Soma Sekhar Published - 06:07 PM, Thu - 7 December 23

విరాట్ కోహ్లీ ఓ రికార్డు మాత్రం సాధించలేడని, అతడికి అంత సీన్ లేదని లాజిక్ తో ఆలోచిస్తే.. అర్దమవుతుందని షాకింగ్ కామెంట్స్ చేశాడు వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారా

విరాట్ కోహ్లీ ఓ రికార్డు మాత్రం సాధించలేడని, అతడికి అంత సీన్ లేదని లాజిక్ తో ఆలోచిస్తే.. అర్దమవుతుందని షాకింగ్ కామెంట్స్ చేశాడు వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారా

  • Author Soma Sekhar Published - 06:07 PM, Thu - 7 December 23
Virat Kohli: ఆ రికార్డు అసాధ్యం.. విరాట్ కోహ్లీకి అంతసీన్ లేదు.. లారా షాకింగ్ కామెంట్స్!

విరాట్ కోహ్లీ.. టీమిండియా రన్ మెషిన్ గా ఎన్నో వరల్డ్ రికార్డులను బద్దలు కొడుతూ క్రికెట్ ప్రపంచంలో ముందుకు సాగుతున్నాడు. ఎవ్వరికీ సాధ్యం కాదనుకున్న సచిన్ 50 వన్డే సెంచరీల రికార్డును సైతం బ్రేక్ చేశాడు కింగ్ విరాట్. అయితే ఓ రికార్డు మాత్రం విరాట్ కోహ్లీ సాధించలేడని, అతడికి అంత సీన్ లేదని లాజిక్ తో ఆలోచిస్తే.. అర్దమవుతుందని షాకింగ్ కామెంట్స్ చేశాడు వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారా. మరి లారా చెప్పిన ఆ రికార్డు ఏది? నిజంగానే విరాట్ కోహ్లీ ఆ ఘనత సాధించలేడా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియన్ లారా. ఇప్పటికే కోహ్లీ ఎన్నో రికార్డులు సాధించినప్పటికీ.. ఆ రికార్డును బద్దలు కొట్టడం అసాధ్యమని, అది అంత ఈజీ కాదని చెప్పుకొచ్చాడు లారా. ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్రియన్ లారా సచిన్ సాధించిన వంద సెంచరీల రికార్డు గురించి మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీపై షాకింగ్ కామెంట్స్ చేశాడు.

లారా మాట్లాడుతూ..”విరాట్ కోహ్లీ ఇప్పటికే 80 శతకాలు సాధించాడు. అతడి వయసు ఇప్పుడు 35 సంవత్సరాలు. సచిన్ శత శతకాల రికార్డు బద్దలు కొట్టాలంటే ఇంకా 20 సెంచరీలు చేయాలి. అంటే అతడు ఏడాదికి 5 సెంచరీలు చేయాలి. దీనికి 4 సంవత్సరాల టైమ్ పడుతుంది. అప్పటికే విరాట్ ఏజ్ 39కి చేరుతుంది. ఈ ఏజ్ లో అది చాలా కష్టం” అంటూ లారా పేర్కొన్నాడు. అయితే సచిన్ ఈ వరల్డ్ రికార్డును ఎవరూ సాధించలేరని మాత్రం చెప్పలేనని విండీస్ దిగ్గజం తెలిపాడు. సచిన్ 100 సెంచరీల రికార్డును విరాట్ కోహ్లీ బద్దలు కొడతాడని చాలా మంది లాజిక్ లేకుండా మాట్లాడుతున్నారని లారా అభిప్రాయపడ్డాడు.

ఇక చాలా మంది ప్లేయర్లు తమ కెరీర్ లోనే 20 సెంచరీల రికార్డును అందుకోలేరని అలాంటి ఈ ఏజ్ లో ఈ ఘనతను బద్దలు కొట్టడం అంత ఈజీ కాదని చెప్పుకొచ్చాడు ఈ దిగ్గజ ప్లేయర్. ఇదిలా ఉండగా.. 463 వన్డేల్లో సచిన్ 49 సెంచరీలు సాధించగా.. కోహ్లీ కేవలం 292 మ్యాచ్ ల్లోనే 50 సెంచరీలు సాధించి అందరిని షాక్ కు గురిచేశాడు. కాగా.. సౌతాఫ్రికా పర్యటనలో టీ20లకు, వన్డేలకు కోహ్లీ విశ్రాంతి తీసుకున్నాడు. దీంతో భవిష్యత్ లో కోహ్లీ తక్కువ వన్డేలు ఆడాల్సిన పరిస్థితి వస్తే.. లారా చెప్పినట్లుగా సచిన్ వరల్డ్ రికార్డును బద్దలు కొట్టడం కష్టమనే చెప్పాలి. మరి ఈ విషయంలో లారా చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను తెలియజేయండి.