SNP
SNP
మనదేశంలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా శనివారం ఇండియా-పాకిస్థాన్ మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ జరిగింది. అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో టీమిండియా వన్‌సైడెట్‌గా అద్భుతమైన విజయం సాధించిందిన సంగతి తెలిసిందే. అయితే.. టీమిండియా విజయం సాధించడంపై సంతోషం వ్యక్తం చేస్తూ.. కరీంనగర్ బీజేపీ నేతలు, కార్యకర్తలు నగరంలోని టవర్ సర్కిల్ నుంచి ర్యాలీ నిర్వహించారు. అలాగే టపాసులు కాల్చి తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తుకున్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కూడా పాల్గొని.. టీమిండియా విజయంపై స్పందిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆయన మాట్లాడుతూ.. ‘పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించడం ఎంతో సంతోషంగా ఉంది, అయితే కొంతమంది ముర్ఖులు పాకిస్థాన్ ఓడిపోవడంపై బాధపడిపోతున్నారు.’ అంటూ వ్యాఖ్యానించారు. అలాగే హైదరాబాద్‌లోని కొంతమంది షాపింగ్ మాల్స్‌లో పాకిస్థాన్ జెండాలను విక్రయిస్తున్నారు. అలా విక్రయించడమే కాకుండా.. అమ్మకాల పేరిట పాక్ జాతీయ జెండాలను ప్రదర్శిస్తున్నారు మండిపడ్డారు. ఇలాంటి పనులు చేయడం సరికాదని, వెంటనే ఆ షాపింగ్ మాల్‌పై చర్యలు తీసుకుని మూసివేయాలని డిమాండ్ చేశారు. అలాగే పాక్ ఓటమికి బాధపడినా, వారి విజయంపై సంబురాలు చేసుకున్నా.. వారి వీపులు సాపు చేస్తామని హెచ్చరించారు.
అయితే.. ఇండియా-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా భారత్-పాక్ ఇరుదేశాల క్రికెట్ అభిమానులైతే.. దీన్నో మ్యాచ్‌లా కాకుండా మినీ యుద్ధంలా భావిస్తారు. శనివారం ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా ఉన్న నరేంద్ర మోదీ స్టేడియం సైతం.. భారత్-పాక్ మ్యాచ్ సందర్భంగా నిండిపోయింది. దాదాపు ఒక లక్షా పది వేల మంది వరకు ప్రేక్షకులు హాజరైనట్లు సమాచారం. ఇంత ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించడంతో సగటు భారత క్రికెట్ అభిమాని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. నిన్నటి విజయంతో టీమిండియా పాక్‌పై తమ తిరుగులేని రికార్డును మరింత మెరుగుపర్చుకుంది. వన్డే వరల్డ్ కప్స్‌లో ఇప్పటి వరకు పాక్ ఇండియాపై గెలవలేదు. 8కి 8 సార్లు టీమిండియానే విజయం సాధించింది. మరి భారత విజయంతో పాటు ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
VIDEO | BJP MP Bandi Sanjay, along with party workers, bursts firecrackers in Hyderabad to celebrate India’s 7-wicket victory against Pakistan in a World Cup match at Ahmedabad.#INDvsPAK #WorldCup2023 #IndiaVsPakistan pic.twitter.com/6IjDbn2ZCu
— Press Trust of India (@PTI_News) October 14, 2023
ఇదీ చదవండి: IND vs PAK: అంపైర్‌కు కండలు చూపించిన రోహిత్! ఎందుకలా చేశాడు?