MI vs GT: ఒక్క ఓటమితో పాండ్యాకు భారీ నష్టం! రోహిత్‌ వారసుడు ఫిక్స్‌ !

Hardik Pandya, MI vs GT, IPL 2024: గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఓడిపోవడం హార్దిక్‌ పాండ్యాకు గట్టి ఎదురుదెబ్బ కానుంది. ఇది కేవలం ఒక మ్యాచే కావొచ్చు కానీ.. పాండ్యా కెరీర్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. అది ఎలాగో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..

Hardik Pandya, MI vs GT, IPL 2024: గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఓడిపోవడం హార్దిక్‌ పాండ్యాకు గట్టి ఎదురుదెబ్బ కానుంది. ఇది కేవలం ఒక మ్యాచే కావొచ్చు కానీ.. పాండ్యా కెరీర్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. అది ఎలాగో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..

ఐపీఎల్‌ 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైంది. ఆదివారం అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్‌ స్టేడియంలో గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలిచే పొజిషన్‌లోకి వచ్చి మరీ ముంబై ఓటమి పాలైంది. అయితే.. ఈ ఓటమితో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యాకు తీవ్ర నష్టమే జరిగిందని క్రికెట్‌ నిపుణులు అంటున్నారు. అదేంటంటే.. ఐపీఎల్‌ 2022, 2023 సీజన్స్‌లో హార్ధిక్ పాండ్యా గుజరాత్‌ టైటాన్స్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. తొలి సీజన్‌లోనే గుజరాత్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు, తర్వాత సీజన్‌లో గుజరాత్‌ రన్నరప్‌గా నిలిచింది. దీంతో పాండ్యా కెప్టెన్సీపై సర్వత్రా ప్రశంసల వర్షం కురిసింది. టీమిండియాకు భవిష్యత్తు కెప్టెన్‌ పాండ్యానే అనే టాక్‌ కూడా వినిపించింది.

అలాగే 2022 టీ20 వరల్డ్‌ కప్‌ తర్వాత.. వన్డే వరల్డ్‌ కప్‌ 2023 కోసం రోహిత్‌ శర్మ పూర్తిగా వన్డేలకే పరిమితం అయి, టీ20లకు దూరంగా ఉన్న సమయంలో పాండ్యానే టీ20ల్లో టీమిండియాను లీడ్‌ చేశాడు. మంచి సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్‌గా కూడా పేరుతెచ్చుకున్నాడు. ఒకానొక సందర్భంలో టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో పాండ్యానే టీమిండియా కెప్టెన్‌గా ఉంటాడనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. కానీ, వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌ కప్‌కు టీమిండియా రోహిత్‌ కెప్టెన్సీలోనే వెళ్తుందని ఇప్పటికే బీసీసీఐ కార్యదర్శి జైషా ప్రకటించారు. అయినా కూడా రోహిత్‌ శర్మ తర్వాత అతని వారుసుడిగా టీమిండియా పగ్గాలు చేపడతాడనే అంచనాలు, అభిప్రాయాలు ఇప్పటికీ ఉన్నాయి. అందుకు కారణం ఐపీఎల్‌ 2022, 2023 సీజన్స్‌లో పాండ్యా సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్‌గా ఉండటమే.

కానీ, ఐపీఎల్‌ 2024 తొలి సీజన్‌లో తన పాత ఫ్రాంచైజ్‌తోనే జరిగిన మ్యాచ్‌లో పాండ్యా కెప్టెన్‌గా విఫలం అయ్యాడు. రాంగ్‌ డిసిషన్స్‌తో గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబైని ఓడిపోయేలా చేశాడు. దీంతో.. గత రెండు సీజన్స్‌లో గుజరాత్‌ టైటాన్స్‌లో పాండ్యా చేసింది ఏం లేదని, అంతా కోచ్‌ ఆశిష్‌ నెహ్రా వెనుకుండి నడిపించడంతోనే గుజరాత్‌ కప్పు కొట్టిందని క్రికెట్‌ అభిమానులు భావిస్తున్నారు. పాండ్యా ఆ టీమ్‌ నుంచి వచ్చేసినా.. శుబ్‌మన్‌ గిల్‌ లాంటి యంగ్‌ ప్లేయర్‌, గతంలో కెప్టెన్సీ చేసిన అనుభవం లేని అతన్ని కెప్టెన్‌గా చేసి.. పాండ్యా కెప్టెన్సీలో ఉన్న పటిష్టమైన ముంబైని ఓడించడంతో ఈ అభిప్రాయాలను వ్యక్తం అవుతున్నాయి. అలాగే గిల్‌ కూడా టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలిచాడు.

కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లో విజయంతో పాటు, మంచి మార్కుల కొట్టేశాడు. అద్భుతమైన ఫీల్డ్‌ సెట్‌, బౌలింగ్‌ మార్పులతో గిల్‌కు కెప్టెన్‌గా వందకు వంద మార్కులు వేశారు క్రికెట్‌ పండితులు. పైగా టీమిండియాలో కీ ‍ప్లేయర్‌గా ఎదిగిన గిల్‌.. మూడు ఫార్మాట్లు ఆడే సత్తా ఉన్న ప్లేయర్‌. పైగా యువకుడు.. అతనికి చాలా భవిష్యత్తు ఉంది. టెస్టులు ఆడకుండా, వన్డేలు, టీ20లు మాత్రమే ఆడే పాండ్యా, ఎప్పుడు గాయపడతాడో అతనికే తెలియదు. అలాంటి ప్లేయర్‌ను నమ్మకునే కంటే.. గిల్‌ను మరింత సానబెట్టి రోహిత్‌ శర్మ వారసుడిగా.. టీమిండియా పగ్గాలు అప్పగించాలని బీసీసీఐ కూడా భావిస్తున్నట్లు సమాచారం. ఆదివారం గుజరాత్‌ వర్సెస్‌ ముంబై మధ్య జరిగిన మ్యాచ్‌ కూడా బీసీసీఐ ఆలోచనకు బలం చేకూర్చేలా జరిగింది. అందుకే.. ఒక్క ఓటమి పాండ్యా కెప్టెన్సీ కెరీర్‌పై దెబ్బ కొట్టిందని క్రికెట్‌ అభిమానులు, పండితులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments