సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో చెలరేగాడు టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్. తనను వరల్డ్ కప్ కు ఎంపిక చేయలేదన్న కోపమో.. లేదా ఇంకేదైనా కారణమో తెలీదు కానీ.. ఈ మ్యాచ్ లో కర్ణాటక బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో చెలరేగాడు టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్. తనను వరల్డ్ కప్ కు ఎంపిక చేయలేదన్న కోపమో.. లేదా ఇంకేదైనా కారణమో తెలీదు కానీ.. ఈ మ్యాచ్ లో కర్ణాటక బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.
వరల్డ్ కప్ 2023లో టీమిండియా సీనియర్ బౌలర్ అయిన భువనేశ్వర్ కుమార్ ను పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో అతడు దేశవాళీ టోర్నీ అయిన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఉత్తరప్రదేశ్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. కాగా తాజాగా టోర్నీలో భాగంగా బుధవారం కర్ణాటక-ఉత్తరప్రదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో కేవలం 9 బంతుల్లోనే 5 వికెట్లు కూల్చి.. జట్టుకు అద్భుతమైన విజయం అందించాడు. దీంతో ఇలాంటి బౌలర్ నా వరల్డ్ కప్ లోకి తీసుకోకుండా ఉన్నది అంటూ కామెంట్స్ చేస్తున్నారు సగటు క్రికెట్ ప్రేమికులు. ఈ మ్యాచ్ కు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో చెలరేగాడు టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్. తనను వరల్డ్ కప్ కు ఎంపిక చేయలేదన్న కోపమో.. లేదా ఇంకేదైనా కారణమో తెలీదు కానీ.. ఈ మ్యాచ్ లో కర్ణాటక బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. టోర్నీలో భాగంగా తాజాగా ఉత్తరప్రదేశ్-కర్ణాటక జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోర్ సాధించింది. జట్టులో గోస్వామి 77 పరుగులతో చెలరేగాడు. అనంతరం 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కర్ణాటక జట్టును కాకవికలం చేశాడు భువనేశ్వర్ కుమార్. తన అనుభవాన్నంతా ఉపయోగించి.. ఓడిపోవాల్సిన మ్యాచ్ ను ఒంటి చేత్తో గెలిపించాడు. ఒకానొక దశలో కర్ణాటక టీమ్ 12 ఓవర్లలో 113/5 తో ఉంది. చేతిలో ఇంకా 5 వికెట్లు, 8 ఓవర్లు ఉండటంతో.. యూపీ విజయంపై ఆశలు వదులుకుంది.
ఈ సమయంలో భువీ బౌలింగ్ కు వచ్చి.. మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ప్రత్యర్థి చివరి 5 వికెట్లను భువీనే తీయడం విశేషం. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ గా పేరుగాంచిన భువీ.. తన పేరుకు తగ్గట్లుగానే రాణించాడు. 17వ ఓవర్లో 4 బంతుల వ్యవధిలోనే 3 వికెట్లు తీశాడు. ఆ తర్వాత 19వ ఓవర్లో మిగతా రెండు వికెట్లు తీసి మ్యాచ్ ను ముగించాడు. దీంతో కర్ణాటక జట్టు 156 రన్స్ కే ఆలౌట్ అయ్యింది. ఈ 5 వికెట్లను భువీ కేవలం 9 బంతుల్లో పడగొట్టడం విశేషం. ఇక ఈ గణాంకాలు చూసిన క్రికెట్ ప్రేమికులు భువీని ప్రపంచ కప్ లోకి తీసుకోకుండా తప్పు చేశారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి ఆటగాడిని ఎలా మరిచారు? అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి భువీ అద్భుత బౌలింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Bhuvneshwar Kumar took five wickets in just nine balls in the death overs against strong Karnataka in a must-win game for Uttar Pradesh.🤯👏 pic.twitter.com/GyMClHrxQv
— CricTracker (@Cricketracker) October 25, 2023