Bhuvneshwar Kumar Gives Shock To Selectors: సెలక్టర్లకు దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చిన భువీ! ఇప్పుడు చెప్పండి వాట్ టు డూ..

Bhuvneshwar Kumar: సెలక్టర్లకు దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చిన భువీ! ఇప్పుడు చెప్పండి వాట్ టు డూ..

టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ టాలెంట్ గురించి స్పెషల్​గా చెప్పనక్కర్లేదు. బాల్​ను రెండు వైపులా స్వింగ్​ చేయడంలో ఈ వెటరన్ స్పీడ్​స్టర్ దిట్ట. అయితే తనకు తరచూ మొండిచెయ్యి చూపుతున్న సెలక్టర్లకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు భువీ.

టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ టాలెంట్ గురించి స్పెషల్​గా చెప్పనక్కర్లేదు. బాల్​ను రెండు వైపులా స్వింగ్​ చేయడంలో ఈ వెటరన్ స్పీడ్​స్టర్ దిట్ట. అయితే తనకు తరచూ మొండిచెయ్యి చూపుతున్న సెలక్టర్లకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు భువీ.

క్రికెట్​లో ఎప్పటికప్పుడు కొత్త ప్లేయర్లు పుట్టుకొస్తుంటారు. తమ పెర్ఫార్మెన్స్​లతో దుమ్మురేపి సెలక్టర్ల దృష్టిని ఆకర్షిస్తారు. కంటిన్యూస్​గా పెర్ఫార్మ్ చేస్తే నేషనల్ టీమ్​లోనూ చోటు దక్కించుకుంటారు. అయితే అలా వచ్చి ఇలా వెళ్లే క్రికెటర్లు చాలా మంది ఉంటారు. కానీ టీమ్​లో ప్లేస్ ఫిక్స్ చేసుకొని.. స్టార్లుగా మారేవారి సంఖ్య మాత్రం తక్కువే. అందులోనూ కెరీర్​ను సుదీర్ఘ కాలం మలచుకునే ఫాస్ట్ బౌలర్లు చాలా అరుదు. అలాంటి రేర్ పేసర్స్​లో ఒకడు భువనేశ్వర్ కుమార్. గత పదేళ్లుగా టీమిండియా తరఫున ఆడుతూ ఎన్నో మ్యాజికల్ స్పెల్స్​తో కోట్లాది మంది అభిమానాన్ని చూరగొన్నాడీ బౌలర్. బాల్​ను ఇరువైపులా స్వింగ్ చేస్తూ బ్యాటర్లకు పీడకలగా మారాడు భువీ. అలాంటోడ్ని చాన్నాళ్లుగా టీమ్​కు దూరంగా ఉంచుతున్నారు. అయితే తన పెర్ఫార్మెన్స్​తో సెలక్టర్లకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు భువీ. రంజీ ట్రోఫీ-2024లో సంచలన ప్రదర్శనతో షాక్​కు గురిచేశాడు.

రంజీ ట్రోఫీ-2024లో భాగంగా బెంగాల్​తో జరుగుతున్న మ్యాచ్​లో భువనేశ్వర్ చెలరేగిపోయాడు. ఉత్తర్​ప్రదేశ్​ తరఫున ఆడుతున్న భువీ ఏకంగా 8 వికెట్లు తీశాడు. బెంగాల్ బ్యాటర్లను వణికించాడు. ఈ ఇన్నింగ్స్​లో ఇద్దరు బ్యాటర్లను క్లీన్ బౌల్డ్ చేసిన భువీ.. మరో ముగ్గుర్ని వికెట్ల ముందు ఎల్బీడబ్ల్యూగా దొరకబుచ్చుకున్నాడు. అతడి దెబ్బకు బాల్​ను టచ్ చేసేందుకు కూడా అపోజిషన్ టీమ్ బ్యాట్స్​మన్ భయపడ్డారు. మొత్తంగా 22 ఓవర్లు వేసిన భువనేశ్వర్ 41 పరుగులు ఇచ్చి 8 వికెట్లు తీశాడు. అందులో 5 మెయిడిన్లు ఉన్నాయి. దీంతో అతడ్ని వెంటనే భారత జట్టులోకి తీసుకోవాలని సోషల్ మీడియాలో నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. ముకేష్ కుమార్, అర్ష్​దీప్ సింగ్, అవేశ్ ఖాన్ అంటూ యంగ్​స్టర్స్​ వెంట పడుతున్నారని భువీ ముందు వాళ్లు ఏమాత్రం పనికిరారని కామెంట్స్ చేస్తున్నారు. ఎక్స్​పీరియెన్స్​తో పాటు ఫామ్​లో ఉన్న వెటరన్ పేసర్​ను టీమ్​లోకి తీసుకోవాలని కోరుతున్నారు.

ఒక్క మ్యాచ్​తో సెలక్టర్లకు భువీ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడని నెటిజన్స్ చెబుతున్నారు. ఇకనైనా సెలక్టర్లు కళ్లు తెరవాలని సీరియస్ అవుతున్నారు. ఇక, గాయం కారణంగా కొన్నాళ్లు జట్టుకు దూరమయ్యాడు భువీ. ఆ తర్వాత కమ్​బ్యాక్ ఇచ్చినా సరిగ్గా రాణించకపోవడంతో టీమ్​కు దూరమయ్యాడు. మళ్లీ బాగా పెర్ఫార్మ్ చేస్తున్నా సెలక్టర్లు కరుణించడం లేదు. తాజాగా 8 వికెట్లు తీయడంతో అభిమానులు భువీ ఈజ్ బ్యాక్ అని అంటున్నారు. అతడ్ని టీ20 వరల్డ్ కప్-2024లో ఆడించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం టీమ్​లో ఉన్న అర్ష్​దీప్, ముకేష్ కలసి ఏకంగా 22 నో బాల్స్ వేశారని గుర్తుచేస్తున్నారు నెటిజన్స్. అదే భువీ మాత్రం తన టీ20 కెరీర్​లో ఇప్పటిదాకా ఒక్క నో బాల్ కూడా వేయలేదని చెబుతున్నారు. ఇప్పుడు చెప్పండి వాట్ టు డూ అని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో సెలక్టర్లు ఈ సీనియర్ బౌలర్​ను పరిగణనలోకి తీసుకుంటారా? లేదా యంగ్​స్టర్స్​ వైపే మొగ్గుచూపుతారా? అనేది ఆసక్తికరంగా మారింది. మరి.. ఒకే ఒక్క పెర్ఫార్మెన్స్​తో సెలక్టర్లకు భువీ స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో విధ్వంసం సృష్టిస్తున్న ముంబై ఇండియన్స్‌!

Show comments