తన ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా.. వరల్డ్ కప్ బరిలోకి దిగాడు బెన్ స్టోక్స్. ఓ వైపు అనారోగ్యం బాధిస్తున్నప్పటికీ మందులు వాడుతూనే జట్టుకు సేవలు అందిస్తున్నాడు. అందుకు సంబంధించిన ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తన ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా.. వరల్డ్ కప్ బరిలోకి దిగాడు బెన్ స్టోక్స్. ఓ వైపు అనారోగ్యం బాధిస్తున్నప్పటికీ మందులు వాడుతూనే జట్టుకు సేవలు అందిస్తున్నాడు. అందుకు సంబంధించిన ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వరల్డ్ కప్.. క్రికెట్ ఆడే ప్రతి ఒక్క ప్లేయర్ తన కెరీర్ లో ఒక్కసారైనా ప్రపంచ కప్ ను ముద్దాడాలనుకుంటాడు. దానికి కోసం ఆహర్నిశలు శ్రమిస్తూనే ఉంటాడు. ఈ క్రమంలో కొందరి ఆటగాళ్లకు గాయాల రూపంలో, అనారోగ్యాల రూపంలో ఎదురుదెబ్బలు తగులుతూ ఉంటాయి. అయితే వాటన్నింటిని ఎదుర్కొని నిలిచినవాడే విజేతగా నిలిచి.. తన జట్టును జగజ్జేతగా నిలుపుతాడు. 2011 వరల్డ్ కప్ లో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్, మాజీ ప్లేయర్ యువరాజ్ సింగ్.. క్యాన్సర్ ను కూడా లెక్కచేయకుండా.. మెుక్కవోని దీక్షతో తన జట్టుకు ప్రపంచ కప్ అందించాడు. ప్రస్తుతం ఇదే పట్టుదలతో తన ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా.. వరల్డ్ కప్ బరిలోకి దిగాడు బెన్ స్టోక్స్. ఓ వైపు అనారోగ్యం బాధిస్తున్నప్పటికీ మందులు వాడుతూనే జట్టుకు సేవలు అందిస్తున్నాడు. అందుకు సంబంధించిన ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బెన్ స్టోక్స్.. గత వరల్డ్ కప్ లో అద్భుతంగా రాణించి ఇంగ్లాండ్ జట్టును జగజ్జేతగా నిలిపిన హీరో. ఆ తర్వాత కూడా సారథిగా పగ్గాలు చేపట్టి ఇంగ్లాండ్ క్రికెట్ కు సరికొత్త నిర్వచనంగా మారాడు. బజ్ బాల్ స్ట్రాటజీతో వరుసగా విజయాలు సాధించి.. ప్రపంచ క్రికెట్లో ఓ సంచలనం సృష్టించాడు. అయితే అన్ని మ్యాచ్ ల్లో ఈ బజ్ బాల్ స్ట్రాటజీ వర్కౌట్ కాలేదనేది అందరికి తెలిసిన విషయమే. ఇదిలా ఉండగా.. గత కొన్ని సంవత్సరాలుగా స్టోక్స్ పలు అనారోగ్య సమస్యల బారిన పడుతూ.. తన కెరీర్ ను నెట్టుకొస్తున్నాడు. గతంలో తీవ్ర మానసిక ఒత్తిడి కారణంగా స్టోక్స్ కొన్ని నెలలు ఆటకు దూరమైన సంగతి తెలిసిందే. అదీకాక అతడు ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నాడు. ఇదే బాధతో వరల్డ్ కప్ బరిలోకి దిగాడు. ప్రాక్టీస్ లో మందులు వాడుతూనే కఠోరంగా శ్రమిస్తున్నాడు. తాజాగా వరల్డ్ కప్ లో భాగంగా గురువారం ఇంగ్లాండ్-శ్రీలంక జట్లు తలపడుతున్న విషయం తెలిసిందే.
ఈ మ్యాచ్ కు ముందు స్టోక్స్ గ్రౌండ్ లో తీవ్రంగా శ్రమించాడు. ఈ క్రమంలో తనకు ఉన్న ఆస్తమా వ్యాధికి ఇన్ హెల్లర్ వాడుతూ కనిపించాడు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. స్టోక్స్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు సగటు క్రికెట్ ప్రేమికులు. అనారోగ్యం కంటే.. దేశమే ముఖ్యమని భావించడం గొప్ప విషయమని కితాబిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఎప్పటి నుంచో స్టోక్స్ ఈ వ్యాధితో బాధపడుతున్నాడు. అయినప్పటికీ దేశం కోసం మరో వరల్డ్ కప్ సాధించాలనే పట్టుదలతో తన ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా.. బరిలోకి దిగాడు. ఈ విషయం తెలిసిన అభిమానులు స్టోక్స్ నీకు హ్యాట్సాఫ్ అంటూ.. సలామ్ కొడుతున్నారు.
ఇక తాజాగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో ఇంగ్లాండ్ టీమ్ ఘోరంగా విఫలమైంది. కేవలం 156 పరుగులకే ఆలౌట్ అయ్యింది. జట్టులో స్టోక్స్ (43) మినహా మరే ప్లేయర్ రాణించలేదు. లంక బౌలర్లు సమష్టిగా రాణించడంతో.. ఇంగ్లాండ్ బ్యాటర్లు తోకముడిచారు. బెయిర్ స్టో(30), డేవిడ్ మలన్(28) పరుగులు చేశారు. లంక బౌలర్లలో లాహిరు కుమార 3, మాథ్యూస్ 2, కసున్ రజిత 2 వికెట్లు తీశారు. మరి దేశం కోసం ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా బరిలోకి దిగుతున్న బెన్ స్టోక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Ben Stokes was using an inhaler during England’s practice session at the Chinnaswamy Stadium. pic.twitter.com/iqR7OfPxRR
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 26, 2023