Somesekhar
ఈనెల 16వ తారీఖున ఐపీఎల్ ఫ్రాంచైజీలతో బీసీసీఐ భేటీ కానుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మరి బీసీసీఐ ఏం నిర్ణయం తీసుకోబోతోంది? పూర్తి వివరాల్లోకి వెళితే..
ఈనెల 16వ తారీఖున ఐపీఎల్ ఫ్రాంచైజీలతో బీసీసీఐ భేటీ కానుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మరి బీసీసీఐ ఏం నిర్ణయం తీసుకోబోతోంది? పూర్తి వివరాల్లోకి వెళితే..
Somesekhar
ఐపీఎల్ 2024 సీజన్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తూ దూసుకెళ్తోంది. ఎప్పటిలాగే బ్యాటర్లు, బౌలర్లు ఢీ అంటే ఢీ అంటూ దూకుడు చూపిస్తున్నారు. ఇక బీసీసీఐ సైతం ఐపీఎల్ ప్రారంభం నుంచి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగానే టోర్నీలో మార్పులు, చేర్పులు చేస్తూ వచ్చింది. ఇటీవలే హైట్ నో బాల్ కు సంబంధించి రూల్ లో మార్పులు చేస్తున్నట్లు తెలిసిందే. తాజాగా ఎప్పటి నుంచో వస్తున్న డిమాండ్ పై ఈనెల 16వ తారీఖున ఐపీఎల్ ఫ్రాంచైజీలతో బీసీసీఐ భేటీ కానుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మరి బీసీసీఐ ఏం నిర్ణయం తీసుకోబోతోంది? పూర్తి వివరాల్లోకి వెళితే..
ఐపీఎల్ 17వ ఎడిషన్ అభిమానులను అలరిస్తూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో బీసీసీఐ ఓ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈనెల 16న అహ్మదాబాద్ లో ఐపీఎల్ ఫ్రాంచైజీల ఓనర్లతో బీసీసీఐ అనధికార సమావేశం నిర్వహించనుంది. ఈ భేటీలో మెగా వేలంలో ఫ్రాంచైజీలు చేసే ఖర్చు మెుత్తం పెంచే విషయం గురించి, ఆటగాళ్లను అంటిపెట్టుకునే విధానం గురించి చర్చించనున్నారు. బీసీసీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ..”ఐపీఎల్ ఫ్రాంచైజీల యజమానులతో బీసీసీఐ అనధికార మీటింగ్ నిర్వహించనుంది. అయితే ఈ భేటీకి ఎలాంటి అజెండా లేదు. ఈ ఎడిషన్ రెండో నెలలో అడుగుపెట్టిన సందర్భంగా ఫ్రాంచైజీలను కలిసేందుకు ఇదే మంచి సమయం” అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ మీటింగ్ లో ప్రధానంగా ఈ ఏడాది జరిగే ప్లేయర్ల మెగా వేలం గురించే చర్చ జరగనుంది.
ఇప్పటి వరకు ఆటగాళ్ల కొనుగోలుకు ఒక్కో ఫ్రాంచైజీ గరిష్టంగా రూ. 100 కోట్లు ఖర్చు చేస్తున్నాయి. ఈ పరిమితి పెంచే విషయం గురించి, ఒక్కో ఫ్రాంచైజీ నలుగురు ప్లేయర్లను అంటిపెట్టుకునే విధానం అమల్లో ఉంది. దీనిపై కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్లేయర్లపై పెట్టే ఖర్చు పెంచితే.. ఆటగాళ్లపై కోట్ల వర్షం కురవడం ఖాయం. కాగా.. ప్రతి మూడేళ్లకు ఒకసారి మెగా వేలం జరుగుతుందన్న విషయం తెలిసిందే. 2022లో ఈ మెగా వేలం జరగ్గా, 2025 సీజన్ కు ముందు మరోసారి ఈ వేలం జరగనుంది. మరి ఈ సమావేశంలో బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంటుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదికూడా చదవండి: పాండ్యా మరీ ఇంత సెల్ఫిషా? మ్యాచ్లో ఇది ఎవరూ గమనించలేదు!