Somesekhar
త్వరలోనే బీసీసీఐ మహ్మద్ షమీతో భేటీ కానుందట. పలు కీలక విషయాలు అతడితో చర్చించనున్నట్లు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే..
త్వరలోనే బీసీసీఐ మహ్మద్ షమీతో భేటీ కానుందట. పలు కీలక విషయాలు అతడితో చర్చించనున్నట్లు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే..
Somesekhar
మహ్మద్ షమీ.. వరల్డ్ కప్ 2023లో అద్భుతమైన పదర్శన కనబర్చాడు. ఈ మెగాటోర్నీలోకి లేట్ గా వచ్చినా.. లీడింగ్ వికెట్ టేకర్ గా నిలిచి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇక తాజాగా భారత ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మకమైన అర్జున అవార్డును అందుకున్నాడు. అయితే గాయం కారణంగా సౌతాఫ్రికాతో జరిగిన లాంగ్ టూర్ కు షమీ దూరం అయ్యాడు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న షమీ.. ఇంగ్లాండ్ తో జరగబోయే 5 టెస్టుల సిరీస్ లో తొలి రెండు టెస్టులకు దూరం కానున్నాడని సమాచారం. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. త్వరలోనే బీసీసీఐ మహ్మద్ షమీతో భేటీ కానుందట. పలు కీలక విషయాలు అతడితో చర్చించనున్నట్లు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే..
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ ప్రస్తుతం గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. గాయం నుంచి కోలుకుని ఇంగ్లాండ్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ కు అందుబాటులోకి రావాలని చూస్తున్నాడు. ఈ క్రమంలోనే షమీతో త్వరలోనే బీసీసీఐ పెద్దలు సమావేశం కానున్నారని తెలుస్తోంది. అతడితో పలు కీలక విషయాలు చర్చించనున్నట్లు క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే గత కొంతకాలంగా షమీ వన్డేలు, టెస్టుల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలలాగే 2022 టీ20 వరల్డ్ కప్ తర్వాత మళ్లీ ఇంతవరకు టీ20ల్లో ఆడలేదు షమీ. కాగా.. జూన్ లో టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అతడి నిర్ణయాన్ని తెలుసుకోవాలని బీసీసీఐ భావిస్తోంది. అందుకోసమే అతడితో సమావేశం కావాలనుకుంటుంది. షమీ భవిష్యత్ ప్లాన్స్ ఏంటి? టీ20 కెరీర్ పై అతడి ఆలోచనలు ఎలా ఉన్నాయి? అన్న విషయాలపై క్లారిటీ తీసుకోవాలని మేనేజ్ మెంట్ భావిస్తోంది.
ఇదిలా ఉండగా.. తాను మాత్రం నెక్ట్స్ పొట్టి వరల్డ్ కప్ కు అందుబాటులో ఉంటానని షమీ ప్రకటించాడు. టీ20ల గురించి బీసీసీఐ చర్చించినప్పుడు.. వారి ప్లాన్స్ లో నేను ఉంటానో, లేనో తెలీదు. కానీ నేను సెలెక్షన్ కు అందుబాటులో ఉంటానని చెప్పుకొచ్చాడు షమీ. బీసీసీఐ కూడా సౌతాఫ్రికా పర్యటనలోనే అతడితో చర్చించాల్సిందని పేర్కొంది. కానీ షమీ ఆ టూర్ కు వెళ్లకపోవడంతో కుదరలేదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. మరి టీ20 ప్రపంచ కప్ కు షమీని జట్టులోకి తీసుకుంటారా? లేదా? అన్నది తెలియాలంటే సమావేశం ముగిసే వరకు ఆగాల్సిందే. ఇక ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.