iDreamPost
android-app
ios-app

టీ20 వరల్డ్‌ కప్‌ కోచ్‌గా సెహ్వాగ్‌? సరైనోడు దిగుతున్నాడు!

  • Published Nov 29, 2023 | 1:29 PM Updated Updated Nov 29, 2023 | 1:29 PM

వన్డే వరల్డ్‌ కప్‌ 2023తో టీమిండియా హెడ్‌ కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ పదవీ కాలం ముగియడంతో.. టీమిండియాకు కొత్త కోచ్‌గా ఎవరొస్తారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ కెప్టెన్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ పేరు బలంగా వినిపిస్తోంది. మరి అందులో నిజమెంతో ఇప్పుడు తెలుసుకుందాం..

వన్డే వరల్డ్‌ కప్‌ 2023తో టీమిండియా హెడ్‌ కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ పదవీ కాలం ముగియడంతో.. టీమిండియాకు కొత్త కోచ్‌గా ఎవరొస్తారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ కెప్టెన్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ పేరు బలంగా వినిపిస్తోంది. మరి అందులో నిజమెంతో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Nov 29, 2023 | 1:29 PMUpdated Nov 29, 2023 | 1:29 PM
టీ20 వరల్డ్‌ కప్‌ కోచ్‌గా సెహ్వాగ్‌? సరైనోడు దిగుతున్నాడు!

వన్డే వరల్డ్‌ కప్‌ 2023 ఫైనల్లో ఓటమి తర్వాత.. ఇప్పుడిప్పుడే ఇండియన్‌ క్రికెట్‌ కోలుకుంటోంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత యువ జట్టు మంచి ప్రదర్శన కనబరుస్తుండటం, సీనియర్‌ ఆటగాళ్లకు రెస్ట్‌ ఇవ్వడం, సమయం గడిచిపోతుండటంతో.. భారత క్రికెట్‌ అభిమానులతో పాటు, ఆటగాళ్ల కూడా ఆ ఓటమి బాధ నుంచి బయటపడుతున్నారు. ఆ వరల్డ్‌ కప్‌ను మర్చిపోయి.. భవిష్యత్తులో రాబోతున్న కప్పులపై ఫోకస్‌ పెట్టేందుకు రెడీ అవుతున్నారు. వచ్చే ఏడాది జులైలో టీ20 వరల్డ్‌ కప్‌ 2024 జరగనున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీకి మరో ఆరు నెలల సమయం మాత్రమే ఉండటంతో.. బీసీసీఐ సైతం పూర్తి ఫోకస్‌ దానిపైనే పెట్టింది.

అయితే.. వన్డే వరల్డ్‌ కప్‌తో టీమిండియా హెడ్‌ కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ పదవీ కాలం ముగిసిపోయిన విషయం తెలిసిందే. నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ డైరెక్టర్‌గా ఉన్న టీమిండియా మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ను తాత్కాలిక కోచ్‌గా పెట్టుకుని పనికాసనిస్తోంది బీసీసీఐ. కానీ, టీ20 వరల్డ్‌ కప్‌ను దృష్టిలో ఉంచుకుని.. పర్మినెంట్‌ హెడ్‌ కోచ్‌ను నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ద్రవిడ్‌ పదవీ కాలం ముగియడంతో.. భారత టీ20 జట్టు కోసం హెడ్‌ కోచ్‌గా పనిచేయాల్సిందిగా టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆశిష్‌ నెహ్రాను ఇప్పటికే బీసీసీఐ సంప్రదించినట్లు సమాచారం. కానీ, నెహ్రా అందుకు నో చెప్పడంతో.. రాహుల్‌ ద్రవిడ్‌నే మరో ఏడాది పాటు హెడ్‌ కోచ్‌గా కొనసాగించాలని బీసీసీఐ భావిస్తోంది.

మరి అందుకు ద్రవిడ్‌ ఒప్పుకుంటాడా? లేదా అన్నది అనుమానమే. ఒక వేళ ద్రవిడ్‌ కూడా హెడ్‌ కోచ్‌గా మరి కొంత కాలం కొనసాగేందుకు నో చెబితే.. బీసీసీఐ వద్ద ఇంకో సూపర్‌ ఆప్షన్‌ ఉన్నట్లు సమాచారం. టీమిండియా మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ను భారత టీ20 జట్టుకు కోచ్‌గా నియమించే ఆలోచనలో కూడా బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తుంది. గతంలో ఒక సారి సెహ్వాగ్‌ టీమిండియా హెడ్‌ కోచ్‌ పదవీ కోసం అప్లైయ్‌ చేసిన విషయం తెలిసిందే. సో.. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని.. టీ20 క్రికెట్‌కు సెహ్వాగ్‌ బ్యాటింగ్‌ స్టైల్‌ కానీ, అతని ఆలోచన విధానం కానీ సరిగ్గా సరిపోతుందని భావిస్తున్న బీసీసీఐ.. సెహ్వాగ్‌ను కోచ్‌గా నియమించాలని చూస్తోంది. అదే జరిగితే.. టీమిండియాకు సరైనోడు దొరికినట్టే. సెహ్వాగ్‌ ఎంత అగ్రెసివ్‌ బ్యాటింగ్‌ చేస్తాడో అందరికీ తెలిసిందే. జట్టు కూడా అలానే ఆడాలని సెహ్వాగ్‌ కోరుకుంటాడు.

ఇక సెహ్వాగ్‌ చేతిలో టీమ్‌ను పెడితే.. అగ్రెసివ్‌ క్రికెట్‌కు టీమిండియా బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారిపోవడం ఖాయం. టీ20 క్రికెట్‌కు ఎలాంటి దూకుడైతే కావాలో.. సెహ్వాగ్‌ జట్టులో అలాంటి దూకుడు నింపుతాడని క్రికెట్‌ అభిమానులు కూడా భావిస్తున్నారు. ద్రవిడ్‌ కోచింగ్‌లో కప్పు గెలవకపోయినా.. కోచ్‌గా ద్రవిడ్‌పై ఎలాంటి విమర్శలు లేవు. కానీ, కప్పు దాహం తీరాలంటే మాత్రం టీమిండియా సెహ్వాగ్‌ లాంటి కోచ్‌ అయితేనే కరెక్ట్‌ అని ఫ్యాన్స్‌ కూడా భావిస్తున్నారు. 2007లో జరిగిన మొట్టమొదటి టీ20 వరల్డ్‌ కప్‌ను టీమిండియానే గెలిచిన విషయం తెలిసిందే. ఆ వరల్డ్‌ కప్‌ విన్నింగ్‌ టీమ్‌లో సెహ్వాగ్‌ సభ్యుడిగా ఉన్నాడు. ఒక వేళ సెహ్వాగ్‌ను టీ20 టీమ్‌కు కోచ్‌గా నియమిస్తే.. ఆటగాడిగా, కోచ్‌గా వరల్డ్‌ కప్‌ గెలిచే అవకాశం సెహ్వాగ్‌ను వస్తోంది. మరి సెహ్వాగ్‌ను టీ20 జట్టుకు కోచ్‌ నియమించే ఆలోచనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.