iDreamPost
android-app
ios-app

Shreyas Iyer, Ishan Kishan: ఊహించని షాకిచ్చిన BCCI.. హీరోలను కాస్త జీరోలు చేసింది!

  • Published Jan 10, 2024 | 5:22 PM Updated Updated Jan 10, 2024 | 5:22 PM

టీమిండియా యువ క్రికెటర్లకు గట్టి హెచ్చరిక జారీ చేసేలా.. భారత క్రికెట్‌ బోర్డు గట్టి షాకిచ్చింది. అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌ లాంటి ఫ్యూచర్‌ స్టార్లను పక్కనపెట్టి మరీ కఠిన నిర్ణయం తీసుకుంది. అయితే.. ఇది యువ క్రికెటర్లు ఎలా గుణపాఠం అవుతుందో? అయ్యర్‌, ఇషాన్‌ ఎలా కళ్ల తెరవాలో ఇప్పుడు చూద్దాం..

టీమిండియా యువ క్రికెటర్లకు గట్టి హెచ్చరిక జారీ చేసేలా.. భారత క్రికెట్‌ బోర్డు గట్టి షాకిచ్చింది. అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌ లాంటి ఫ్యూచర్‌ స్టార్లను పక్కనపెట్టి మరీ కఠిన నిర్ణయం తీసుకుంది. అయితే.. ఇది యువ క్రికెటర్లు ఎలా గుణపాఠం అవుతుందో? అయ్యర్‌, ఇషాన్‌ ఎలా కళ్ల తెరవాలో ఇప్పుడు చూద్దాం..

  • Published Jan 10, 2024 | 5:22 PMUpdated Jan 10, 2024 | 5:22 PM
Shreyas Iyer, Ishan Kishan: ఊహించని షాకిచ్చిన BCCI.. హీరోలను కాస్త జీరోలు చేసింది!

బీసీసీఐ కేవలం డబ్బు గురించే ఆలోచిస్తుంది.. ఆటగాళ్లకు ఉన్న స్టార్‌డమ్‌ను బట్టి విలువ ఇస్తుందనే విమర్శలు చాలా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో అవి నిజమనిపించేలా కూడా బీసీసీఐ చేసే పనులుంటాయి. కానీ, ఈ సారి బీసీసీఐ చేసిన పని యువ క్రికెటర్లతో పాటు స్టార్‌ క్రికెటర్లు గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేసింది. ఎంత స్టార్‌ క్రికెటర్లు అయినా.. వరల్డ్‌ కప్‌ లాంటి టోర్నీల్లో అదరగొట్టినా.. ఐపీఎల్‌లో లాంటి మెగా లీగ్‌లో ఒక టీమ్‌కు కెప్టెన్‌గా ఉన్నా.. కోట్లకు కోట్లు భారీ ధర పలికినా.. రూల్స్‌ దాటి క్రమశిక్షణ లేకుండా హద్దు మీరితే మాత్రం.. ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది. అందుకు.. తాజాగా ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టే ఉదాహరణ.

ఈ నెల 11 నుంచి 17 వరకు ఆఫ్ఘనిస్థాన్‌తో టీమిండియా మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ ఏడాది టీ20 వరల్డ్‌ కప్‌ 2024 జరగనున్న నేపథ్యంలో ఈ సిరీస్‌ను బీసీసీఐ సీరియస్‌గానే తీసుకుంది. అందుకే చాలా కాలంగా టీ20 మ్యాచ్‌లకు దూరంగా ఉన్న రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ లాంటి బిగ్‌ స్టార్లను కూడా ఈ సిరీస్‌కు ఎంపిక చేసింది. వారిద్దరి రాకతో ఇండియన్‌ క్రికెట్‌ అభిమానులంతా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. రోహిత్‌-కోహ్లీ టీ20లు ఆడుతున్నారంటే.. రాబోయే టీ20 వరల్డ్‌ కప్‌లో కూడా వారిద్దరు ఉంటారని అంతా ఫిక్స్‌ అయ్యారు. వారిద్దరు ఉండటంతో హ్యాపీ అయిన ఫ్యాన్స్‌.. అదే టీమ్‌లో కేఎల్‌ రాహుల్‌, ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌ లాంటి స్టార్‌ క్రికెటర్లు లేకపోవడంతో ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

వారికి విశ్రాంతి ఇచ్చి ఉంటారులే అనుకుని సర్దిచెప్పుకున్నారు. కానీ, తాజాగా వస్తున్న వార్తలు సగటు క్రికెట్‌ అభిమానిని షాక్‌కు గురిచేస్తున్నాయి. కేఎల్‌ రాహుల్‌ విషయం పక్కనపెడితే.. శ్రేయస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌లను కావాలనే పక్కనపెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. వారిద్దరు రూల్స్‌ను అతిక్రమించి క్రమశిక్షణ తప్పారని.. అందుకే వారిని బీసీసీఐ టీమ్‌ నుంచి తీసేసిందని.. క్రమశిక్షణా చర్యల్లో భాగంగానే వారిని ఆఫ్ఘాన్‌తో టీ20 సిరీస్‌కు పక్కనపెట్టినట్లు సమాచారం. బీసీసీఐ అనుమతి లేకుండా దుబాయ్‌లో పార్టీ, కౌన్‌బనేగా కరోడ్‌ పతి లాంటి షోలో ఇషాన్‌ పాల్గొనడం అతని కొంపముంచింది. ఇక శ్రేయస్‌ ఏం చేశాడో ఇంకా తెలియలేదు కానీ, అతనిపై కూడా వేటు వేసినట్లు తెలుస్తుంది.

ఇలా ఇద్దరు యువ ఆటగాళ్లపై బీసీసీఐ చాలా కఠినంగానే వ్యవహరించింది. టీమిండియా భవిష్యత్తు స్టార్లుగా చెప్పుకుంటున్న వీరిద్దరి విషయంలో బీసీసీఐ ఇంత కఠినంగా ఉంటుందని ఎవరూ ఊహించి ఉండరు. పైగా ఇద్దరూ సూపర్‌ ఫామ్‌లో ఉన్నారు. అయినా కూడా బీసీసీఐ వాళ్లు చేసిన తప్పులను లైట్‌ తీసుకోకుండా గట్టి షాక్‌ ఇచ్చింది. ఈ టీ20 సిరీస్‌ తర్వాత టీ20 వరల్డ్‌ కప్‌ వరకు ఎలాంటి టీ20 సిరీస్‌ లేదు. కేవలం ఐపీఎల్ మాత్రమే ఉంది. అందులో కనుక ఇషాన్‌, అయ్యర్‌ విఫలం అయితే.. వరల్డ్‌ కప్‌ టీమ్‌లో కూడా వారికి చోటు కష్టమే. ఎందుకంటే.. ఇప్పటికే జట్టులో ప్లేస్‌ కోసం చాలా మంది యువ క్రికెటర్లు పోటీ పడుతూ అద్భుతంగా రాణిస్తున్నారు. పైగా రోహిత్‌, కోహ్లీ సీనియర్లతో పాటు రిషభ్‌ పంత్‌ లాంటి స్టార్‌ కూడా కోలుకుని జట్టులోకి వస్తే.. టీమ్‌ మరింత టైట్‌ అయిపోతుంది. ఇలాంటి టఫ్‌ సిచ్యూవేషన్స్‌లో శ్రేయస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌ పిచ్చి పిచ్చి పిల్ల వేషాలు వేస్తే కెరీర్‌ ఖతం అయ్యే ప్రమాదం ఉంది. మరి అయ్యర్‌, ఇషాన్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటూ అఫ్ఘాన్‌తో సిరీస్‌కు ఎంపిక చేయకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.