iDreamPost
android-app
ios-app

BCCI: భారత క్రికెట్ కు శుభపరిణామం.. BCCI కీలక నిర్ణయం! ఇక నుంచి..

  • Published Apr 25, 2024 | 12:56 PM Updated Updated Apr 25, 2024 | 12:56 PM

బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. ఈ డెసిషన్ భారత క్రికెట్ కు శుభపరిణామ అవుతుంది. ఇంతకీ బీసీసీఐ తీసుకోబోయే ఆ నిర్ణయం ఏంటి?

బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. ఈ డెసిషన్ భారత క్రికెట్ కు శుభపరిణామ అవుతుంది. ఇంతకీ బీసీసీఐ తీసుకోబోయే ఆ నిర్ణయం ఏంటి?

BCCI: భారత క్రికెట్ కు శుభపరిణామం.. BCCI కీలక నిర్ణయం! ఇక నుంచి..

టీమిండియాకు ఆడాలనేది ఎంతో మంది వర్ధమాన క్రికెటర్ల కల. అయితే వారి డ్రీమ్ ను సాధించే క్రమంలో ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొవాల్సి వస్తుంది. అందులో ప్రధానమైనంది డబ్బు. ఎంతో మంది టాలెంటెడ్ ప్లేయర్లు ఆర్థికంగా బలంగా లేకపోవడంతో.. తమ కెరీర్ ను మధ్యలోనే ఆపేస్తున్నారు. ఇక ఇప్పటి వరకు డొమెస్టిక్ క్రికెట్ ఆడినా.. ఆదాయం మాత్రం అంతంత మాత్రంగానే వస్తుండటం, ప్లేయర్ల పాలిట శాపంగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. ఈ డెసిషన్ భారత క్రికెట్ కు శుభపరిణామ అవుతుంది. ఇంతకీ బీసీసీఐ తీసుకోబోయే ఆ నిర్ణయం ఏంటి? పూర్తి వివరాల్లోకి వెళితే..

డొమెస్టిక్ క్రికెట్ ఆడే ప్లేయర్ల కోసం బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ గనక ఈ డెసిషన్ తీసుకుంటే.. టీమిండియా క్రికెట్ కు మంచి రోజులు వచ్చినట్లే. ఇంతకీ ఆ నిర్ణయం ఏంటంటే? రంజీ లాంటి డొమెస్టిక్ క్రికెట్ ఆడే ఆటగాళ్ల జీతాలను పెంచబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రణాళికలను రచిస్తున్నట్లు సమాచారం. ప్లేయర్లు సంవత్సరానికి 10 రంజీ మ్యాచ్ లు ఆడితే.. వారికి రూ. కోటి వరకు జీతం అందేలా చూడాలని భావిస్తోంది. ఇది వారి భవిష్యత్ కు ఉపయోగపడుతుందని, అలాగే డొమెస్టిక్ క్రికెట్ ను ఎంకరేజ్ చేసినట్లుగా ఉంటుందని బీసీసీఐ ప్లాన్.

కాగా.. ప్రస్తుతం బీసీసీఐ రంజీ మ్యాచ్ ఆడే ప్లేయర్లకు ఒక్క రోజుకు రూ. 40 వేల నుంచి 60 వేలు ఇస్తోంది. అంటే ఒక్క మ్యాచ్ కు దాదాపు 2 నుంచి 3 లక్షలు అన్నమాట. అయితే ఈ మెుత్తాన్ని భారీగా పెంచనుంది. 10 రంజీ మ్యాచ్ లు ఆడితే.. రూ. కోటి రూపాయాలు ప్లేయర్ కు వచ్చే విధంగా జీతాలు పెంచనుంది. బీసీసీఐ తీసుకోబోయే ఈ నిర్ణయం భారత క్రికెట్ కు మంచి చేస్తుందని క్రీడా నిపుణులు భావిస్తున్నారు. ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొనే ప్లేయర్లకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి బీసీసీఐ తీసుకునే ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.