Jay Shah: భారత్ చేతుల్లోకి ప్రపంచ క్రికెట్.. ICC ఛైర్మన్ గా జై షా? 

ఐసీసీ ఛైర్మన్ రేసులో బీసీసీఐ సెక్రటరీ జై షా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఛైర్మన్ గా కొనసాగుతున్న గ్రెగ్ బార్ క్లే తర్వాత ఐసీసీ పగ్గాలను జై షా చేపట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

ఐసీసీ ఛైర్మన్ రేసులో బీసీసీఐ సెక్రటరీ జై షా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఛైర్మన్ గా కొనసాగుతున్న గ్రెగ్ బార్ క్లే తర్వాత ఐసీసీ పగ్గాలను జై షా చేపట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

ప్రపంచ క్రికెట్ భారత్ చేతుల్లోకి రాబోతోంది. ఐసీసీ ఛైర్మన్ రేసులో బీసీసీఐ సెక్రటరీ జై షా ముందు వరుసలో ఉన్నట్లు క్రీడా వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఇప్పటికే బీసీసీఐ సెక్రటరీగా ఉంటూ.. బీసీసీఐ షాడో ప్రెసిడెంట్ గా చెలమణి అవుతున్నాడు అన్న అపవాదు కూడా జై షాపై ఉంది. ఈ నేపథ్యంలో ఐసీసీ ఛైర్మన్ రేసులో జై షా ఉన్నాడు అనే వార్త క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఐసీసీ ఛైర్మన్ రేసులో బీసీసీఐ సెక్రటరీ జై షా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఛైర్మన్ గా కొనసాగుతున్న గ్రెగ్ బార్ క్లే పదవీ కాలం నవంబర్ 30తో ముగుస్తుంది. అయితే మరోసారి అతడు ఛైర్మన్ గా నిలబడే ఛాన్స్ ఉనప్పటికీ.. అతడు తాను పోటీ చేయనని తేల్చి చెప్పాడు. దాంతో ఇప్పుడు ఈ పదవి కోసం జై షా పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. పైగా ఐసీసీ ఛైర్మన్ కావాలన్న కోరిక జై షాకు కూడా ఉంది. కాగా.. ఈ విషయంపై ఆగస్ట్ 27న స్పష్టత రానుంది. ఎందుకంటే? ఐసీసీ ఛైర్మన్ పదవి కోసం నామినేషన్లు వేసేందుకు అదే ఆఖరి రోజు.

ఇదిలా ఉండగా.. ఐసీసీ ఛైర్మన్ గా మూడు పర్యాయాలు ఎన్నిక కావొచ్చు. ఇక న్యూజిలాండ్ కు చెందిన బార్ క్లే ఇప్పటికే రెండేళ్లు పూర్తి చేసుకున్నాడు. మరోసారి అతడికి అవకాశం ఉంది. కానీ అతడు పోటీ చేయనని చెప్పాడు. దాంతో ఈ రేసులోకి దూసుకొచ్చాడు బీసీసీఐ సెక్రటరీ జై షా. ఇక ఇతడు ఛైర్మన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం జై షా ఐసీసీలో ఆర్థిక, వాణిజ్య వ్యవహారాల ఉప సంఘం అధిపతిగా ఉన్నాడు. పైగా ఇతడి పట్ల ఓటు హక్కు ఉన్న చాలా దేశాల సానుకూలంగా ఉన్నాయి. అయితే ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న జై షా పదవీ కాలం మరో సంవత్సరం మాత్రమే ఉంది. ఆ తర్వాత రూల్స్ ప్రకారం మూడేళ్లు బీసీసీఐకి సంబంధించిన ఎలాంటి పదవుల్లో ఉండరాదు. ఈ క్రమంలోనే అతడు ఐసీసీ ఛైర్మన్ గా ఎన్నిక కావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. జై షా గనక ఐసీసీ ఛైర్మన్ అయితే.. ఈ పదవి చేపట్టిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డుల్లోకి ఎక్కుతాడు.

Show comments