iDreamPost
android-app
ios-app

Virat Kohli: కోహ్లీ 82*.. నా కెరీర్ లో ఇలాంటి అద్భుత ఇన్నింగ్స్ చూడలేదు: షాహీన్ అఫ్రిదీ

  • Published Aug 21, 2024 | 9:29 AM Updated Updated Aug 21, 2024 | 9:29 AM

విరాట్ కోహ్లీ తమపై ఆడిన ఆ ఇన్నింగ్స్ ను తన కెరీర్ లో ఇంతవరకు చూడలేదని పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిదీ అన్నాడు.

విరాట్ కోహ్లీ తమపై ఆడిన ఆ ఇన్నింగ్స్ ను తన కెరీర్ లో ఇంతవరకు చూడలేదని పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిదీ అన్నాడు.

Virat Kohli: కోహ్లీ 82*.. నా కెరీర్ లో ఇలాంటి అద్భుత ఇన్నింగ్స్ చూడలేదు: షాహీన్ అఫ్రిదీ

ప్రపంచ క్రికెట్ లో ఎన్నో అత్యుత్తమైన ఇన్నింగ్స్ లు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కో ఇన్నింగ్స్ అంటే ఇష్టం. ఇక అలాంటి బ్యాటింగ్ ను తమ కెరీర్ లో చూడలేదని సదరు ఆటగాడి బ్యాటింగ్ పై ప్రశంసలు కురిపిస్తుంటారు ఇతర ఆటగాళ్లు. తాజాగా విరాట్ కోహ్లీ తమపై ఆడిన సూపర్ ఇన్నింగ్స్ గురించి మరోసారి గుర్తుచేసుకున్నాడు పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిదీ. నా కెరీర్ లో ఇంతకంటే అద్భుతమైన బ్యాటింగ్ ను చూడలేదని ప్రశంసలు కురిపించాడు.

విరాట్ కోహ్లీ.. ప్రపంచ క్రికెట్ లో ఓ దిగ్గజ ఆటగాడిగా తిరుగులేని గుర్తింపును దక్కించుకున్నాడు. తన బ్యాట్ తో టన్నుల కొద్ది పరుగులు, వద్దల కొద్ది రికార్డులు క్రియేట్ చేస్తూ.. ప్రపంచ క్రికెట్ ను ఏలుతున్న రారాజు. ఇక కోహ్లీ కెరీర్ లో ఎన్నో చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ లు ఉన్నాయి. కానీ వాటన్నింటిలో ప్రత్యేకమైంది మాత్రం 2022 టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ పై ఆడిన 82* పరుగుల ఇన్నింగ్స్. కాగా.. కోహ్లీ తమపై ఆడిన ఈ బ్యాటింగ్ గురించి మరోసారి గుర్తు చేసుకున్నాడు ఆ జట్టు స్టార్ బౌలర్ షాహీన్ షా అఫ్రిదీ.

shaheen afridi intersting comments about kohli innings

స్టార్ స్పోర్ట్స్ తో షాహీన్ మాట్లాడుతూ..”విరాట్ కోహ్లీ మాపై ఆడిన 82* పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ను నా కెరీర్ లో ఇంతవరకు చూడలేదు. ఓడిపోయే మ్యాచ్ ను అతడు గెలిపించిన తీరు అమోఘం, అద్భుతం” అంటూ ఆ మ్యాచ్ లో కోహ్లీ బ్యాటింగ్ పై మరోసారి ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం షాహీన్ కామెంట్స్ వైరల్ గా మారాయి. కాగా.. ఆ మ్యాచ్ లో పాకిస్థాన్ నిర్దేశించిన 160 పరుగుల టార్గెట్ ను ఛేదించే క్రమంలో భారత్ 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. దాంతో అందరూ టీమిండియా ఓడిపోతుందని భావించారు. కానీ అనూహ్య రీతిలో చెలరేగిన కోహ్లీ ఒంటిచేత్తో మ్యాచ్ ను గెలిపించాడు. ఈ మ్యాచ్ లో 53 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 4 సిక్సులతో 82 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కోహ్లీ కెరీర్ లోనే ఇదో స్పెషల్ ఇన్నింగ్స్ గా నిలిచిపోయింది.