విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కు ఇది బ్యాడ్ న్యూసనే చెప్పాలి. టీ20 వరల్డ్ కప్ 2024 మెగాటోర్నీకి కోహ్లీ దూరం కానున్నాడని తెలుస్తోంది.
విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కు ఇది బ్యాడ్ న్యూసనే చెప్పాలి. టీ20 వరల్డ్ కప్ 2024 మెగాటోర్నీకి కోహ్లీ దూరం కానున్నాడని తెలుస్తోంది.
టీ20 వరల్డ్ కప్ 2024.. ప్రస్తుతం టీమిండియా ముందున్న గోల్. ఈ పొట్టి కప్ ను సాధించి.. వరల్డ్ కప్ ఓటమి బాధలో ఉన్న భారత అభిమానులను కొంతలో కొంత సంతోష పరచాలి. అందులో భాగంగానే ఇప్పటి నుంచే బీసీసీఐ ప్రణాళికలను రూపోందిస్తూ.. ముందుకు సాగుతోంది. యువ ఆటగాళ్లకు జట్టులో చోటు కల్పించి వారి సత్తాను పరీక్షిస్తోంది. ఇదిలా ఉండగా కోహ్లీ ఫ్యాన్స్ కు ఓ బ్యాడ్ న్యూస్ ఇవ్వడానికి బీసీసీఐ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే టీ20 వరల్డ్ కప్ 2024 కు కోహ్లీని పక్కన పెట్టనున్నట్లు సమాచారం. ఈ వార్తకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
టీ20 ప్రపంచ కప్ 2024కు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే? గతేడాది జరిగిన పొట్టి ప్రపంచ కప్ తర్వాత ఇప్పటి వరకు విరాట్ ఒక్కటంటే ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. దీంతో అతడిని ఈ ఫార్మాట్ నుంచి పూర్తిగా పక్కన పెట్టే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు తాజాగా ముంబైలో జరిగిన మీటింగ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ లతో పాటుగా సెలెక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్ టీ20 వరల్డ్ కప్ కోసం టీమ్ ను సిద్దం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అందులో భాగంగా పొట్టి వరల్డ్ కప్ కు కెప్టెన్ గా రోహిత్ నే కొనసాగించాలని ముందునుంచి బీసీసీఐ భావిస్తూనే ఉంది. అందుకు హిట్ మ్యాన్ కూడా అంగీకరించినట్లు సమాచారం.
ఈ క్రమంలోనే అతడితో పాటుగా స్పీడ్ స్టర్ బుమ్రా కూడా ఈ మెగాటోర్నీలో ఆడేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. విరాట్ కోహ్లీ టీ20 కెరీర్ పై కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే వచ్చే పొట్టి ప్రపంచ కప్ కు విరాట్ కోహ్లీ దూరం కానున్నాడన్న న్యూస్ గట్టిగా వినిపిస్తున్నాయి. అతడి స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగే ఆటగాడిని తీసుకోవాలని బీసీసీఐ భావిస్తోంది. అందులో భాగంగా 3వ స్థానానికి యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ పేరును పరిశీలిస్తున్నారట. అయితే విరాట్ ఐపీఎల్ లో చూపిన ప్రతిభ ఆధారంగా కూడా జట్టులో ప్లేస్ ఉంటుందా? ఉండదా? అన్న విషయాన్ని సెలెక్టర్లు పరిగణంలోకి తీసుకుంటారని బీసీసీఐ అధికారి ఒకరు ప్రముఖ పత్రికతో చెప్పుకొచ్చారు. ఇక ఈ విషయం బయటకి పొక్కడంతో విరాట్ ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరి వచ్చే టీ20 వరల్డ్ కప్ కు విరాట్ కోహ్లీ దూరం కానున్నాడన్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
According to Media Reports, BCCI top officials soon meet Virat Kohli to discuss his future in T20Is
📷: BCCI#Cricket #TeamIndia #IndianCricketTeam #CricketIndia #T20WorldCup #T20WC2024 #T20Cricket #ViratKohli #IshanKishan #T20WC pic.twitter.com/IWJebfk7G0
— SportsTiger (@The_SportsTiger) December 7, 2023