Nidhan
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటికే టీ20 క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. మిగిలిన రెండు ఫార్మాట్లలోనూ అతడు ఎప్పటిదాకా కొనసాగుతాడనే విషయంపై క్లారిటీ లేదు. దీంతో అతడి వారసుడు ఎవరనేది చర్చనీయాంశంగా మారింది.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటికే టీ20 క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. మిగిలిన రెండు ఫార్మాట్లలోనూ అతడు ఎప్పటిదాకా కొనసాగుతాడనే విషయంపై క్లారిటీ లేదు. దీంతో అతడి వారసుడు ఎవరనేది చర్చనీయాంశంగా మారింది.
Nidhan
టీ20 వరల్డ్ కప్-2024 గెలుపు సంబురాలు ఇంకా కొనసాగుతున్నాయి. మెగా ట్రోఫీతో స్వదేశానికి తిరిగొచ్చిన భారత ఆటగాళ్లు విక్టరీ పరేడ్‌లో పాల్గొన్నారు. ఆ తర్వాత కూడా తమ సొంత రాష్ట్రాలతో పాటు ఇతర చోట్ల విన్నింగ్ సెలబ్రేషన్స్‌లో పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు వాళ్లు రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే టీమిండియాకు నెక్స్ట్ టైట్ షెడ్యూల్ ఉంది. పొట్టి కప్పు ముగిసిన కొద్ది రోజులకే జింబాబ్వేతో 5 టీ20లు ఆడింది భారత్. ఇంకొన్ని రోజుల్లో శ్రీలంక టూర్‌కు వెళ్లనుంది మెన్ ఇన్ బ్లూ. వరుస విజయాలు అందుకోవడం, సీనియర్లు-జూనియర్లతో కూడిన టీమ్ బలంగా ఉండటంతో టీమిండియాకు ఢోకా లేదని అంతా అంటున్నారు. అయితే పైకి అంతా బాగానే కనిపిస్తున్నా.. భారత క్రికెట్‌ను ఓ విషయం ఇబ్బంది పెడుతోందనేది మాత్రం చాలా మందికి తెలియదు.
కెప్టెన్సీ.. టీమిండియాను ఇప్పుడు వేధిస్తున్న సమస్య ఇది. అదేంటి రోహిత్ శర్మ రూపంలో సమర్థవంతమైన సారథి ఉన్నాడని అనుకోవచ్చు. అవును, హిట్‌మ్యాన్ ఉన్నాడు. కానీ ఎంతకాలం కొనసాగుతాడో గ్యారెంటీ లేదు. టీ20 ప్రపంచ కప్-2024తో అతడు పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత 50 ఓవర్ల ఫార్మాట్‌కూ అతడు రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 37 ఏళ్ల రోహిత్ క్రికెట్లో ఎక్కువ కాలం కంటిన్యూ అవ్వాలంటే టెస్టులు, వన్డేల్లో ఒక ఫార్మాట్‌ను వదులుకోక తప్పని పరిస్థితి. కాబట్టి అతడు లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్ మరింత కాలం ఆడతాడని చెప్పలేం. టెస్టులు తక్కువ జరుగుతాయి కాబట్టి అక్కడే కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయని ఎక్స్పర్ట్స్ అంటున్నారు.
రోహిత్ టీ20లకు గుడ్‌బై చెప్పడం, వన్డేల్లో ఎంతకాలం ఉంటాడో క్లారిటీ లేదు. కాబట్టి అతడి వారసుడు ఎవరనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. హిట్‌మ్యాన్ ఎక్కువ కాలం సారథిగా ఉండడని తెలిసినప్పుడు కెప్టెన్సీ కోసం ఒకర్ని ముందే రెడీ చేయాల్సింది. కానీ హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, శుబ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ అంటూ చాలా మందిని ఈ రోల్ కోసం ప్రయోగించిన బీసీసీఐ.. ఓ కన్‌క్లూజన్‌కు మాత్రం రాలేకపోయింది. త్వరలో జరగనున్న లంక సిరీస్‌లో వన్డేల్లో ఒకవేళ రోహిత్ ఆడకపోతే ఎవర్ని కెప్టెన్‌గా చేయాలనే దానిపై స్పష్టత లేదు. అదే టైమ్‌లో టీ20లకు ఎవర్ని సారథిగా నియమిస్తారో కూడా చెప్పడం లేదు. పొట్టి ఫార్మాట్‌కు ఓ పర్మినెంట్ కెప్టెన్‌ను ఎంపిక చేయాలి. అలాగే వన్డేల్లో ఒకర్ని వైస్ కెప్టెన్‌ను చేసి రోహిత్ వారసుడిగా తయారు చేయాలి. కొత్త కోచ్ గంభీర్ రాకతో అయినా కెప్టెన్సీ విషయంలో క్లారిటీ రాకపోతే భారత క్రికెట్‌కు నష్టం తప్పదని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. మరి.. ఈ విషయంలో బీసీసీఐ వ్యవహరిస్తున్న తీరుపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.