iDreamPost
android-app
ios-app

Rohit Sharma: రోహిత్ శర్మ వారసుడు ఎవరు? ఎటూ తేల్చుకోలేకపోతున్న BCCI!

  • Published Jul 16, 2024 | 8:21 PM Updated Updated Jul 16, 2024 | 8:21 PM

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటికే టీ20 క్రికెట్​కు గుడ్​బై చెప్పేశాడు. మిగిలిన రెండు ఫార్మాట్లలోనూ అతడు ఎప్పటిదాకా కొనసాగుతాడనే విషయంపై క్లారిటీ లేదు. దీంతో అతడి వారసుడు ఎవరనేది చర్చనీయాంశంగా మారింది.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటికే టీ20 క్రికెట్​కు గుడ్​బై చెప్పేశాడు. మిగిలిన రెండు ఫార్మాట్లలోనూ అతడు ఎప్పటిదాకా కొనసాగుతాడనే విషయంపై క్లారిటీ లేదు. దీంతో అతడి వారసుడు ఎవరనేది చర్చనీయాంశంగా మారింది.

  • Published Jul 16, 2024 | 8:21 PMUpdated Jul 16, 2024 | 8:21 PM
Rohit Sharma: రోహిత్ శర్మ వారసుడు ఎవరు? ఎటూ తేల్చుకోలేకపోతున్న BCCI!

టీ20 వరల్డ్ కప్-2024 గెలుపు సంబురాలు ఇంకా కొనసాగుతున్నాయి. మెగా ట్రోఫీతో స్వదేశానికి తిరిగొచ్చిన భారత ఆటగాళ్లు విక్టరీ పరేడ్​లో పాల్గొన్నారు. ఆ తర్వాత కూడా తమ సొంత రాష్ట్రాలతో పాటు ఇతర చోట్ల విన్నింగ్ సెలబ్రేషన్స్​లో పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు వాళ్లు రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే టీమిండియాకు నెక్స్ట్ టైట్ షెడ్యూల్ ఉంది. పొట్టి కప్పు ముగిసిన కొద్ది రోజులకే జింబాబ్వేతో 5 టీ20లు ఆడింది భారత్. ఇంకొన్ని రోజుల్లో శ్రీలంక టూర్​కు వెళ్లనుంది మెన్ ఇన్ బ్లూ. వరుస విజయాలు అందుకోవడం, సీనియర్లు-జూనియర్లతో కూడిన టీమ్ బలంగా ఉండటంతో టీమిండియాకు ఢోకా లేదని అంతా అంటున్నారు. అయితే పైకి అంతా బాగానే కనిపిస్తున్నా.. భారత క్రికెట్​ను ఓ విషయం ఇబ్బంది పెడుతోందనేది మాత్రం చాలా మందికి తెలియదు.

కెప్టెన్సీ.. టీమిండియాను ఇప్పుడు వేధిస్తున్న సమస్య ఇది. అదేంటి రోహిత్ శర్మ రూపంలో సమర్థవంతమైన సారథి ఉన్నాడని అనుకోవచ్చు. అవును, హిట్​మ్యాన్ ఉన్నాడు. కానీ ఎంతకాలం కొనసాగుతాడో గ్యారెంటీ లేదు. టీ20 ప్రపంచ కప్-2024తో అతడు పొట్టి ఫార్మాట్​కు గుడ్​బై చెప్పేశాడు. వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత 50 ఓవర్ల ఫార్మాట్​కూ అతడు రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 37 ఏళ్ల రోహిత్ క్రికెట్​లో ఎక్కువ కాలం కంటిన్యూ అవ్వాలంటే టెస్టులు, వన్డేల్లో ఒక ఫార్మాట్​ను వదులుకోక తప్పని పరిస్థితి. కాబట్టి అతడు లిమిటెడ్ ఓవర్స్​ క్రికెట్ మరింత కాలం ఆడతాడని చెప్పలేం. టెస్టులు తక్కువ జరుగుతాయి కాబట్టి అక్కడే కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయని ఎక్స్​పర్ట్స్ అంటున్నారు.

రోహిత్ టీ20లకు గుడ్​బై చెప్పడం, వన్డేల్లో ఎంతకాలం ఉంటాడో క్లారిటీ లేదు. కాబట్టి అతడి వారసుడు ఎవరనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. హిట్​మ్యాన్ ఎక్కువ కాలం సారథిగా ఉండడని తెలిసినప్పుడు కెప్టెన్సీ కోసం ఒకర్ని ముందే రెడీ చేయాల్సింది. కానీ హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, శుబ్​మన్ గిల్, కేఎల్ రాహుల్ అంటూ చాలా మందిని ఈ రోల్ కోసం ప్రయోగించిన బీసీసీఐ.. ఓ కన్​క్లూజన్​కు మాత్రం రాలేకపోయింది. త్వరలో జరగనున్న లంక సిరీస్​లో వన్డేల్లో ఒకవేళ రోహిత్ ఆడకపోతే ఎవర్ని కెప్టెన్​గా చేయాలనే దానిపై స్పష్టత లేదు. అదే టైమ్​లో టీ20లకు ఎవర్ని సారథిగా నియమిస్తారో కూడా చెప్పడం లేదు. పొట్టి ఫార్మాట్​కు ఓ పర్మినెంట్ కెప్టెన్​ను ఎంపిక చేయాలి. అలాగే వన్డేల్లో ఒకర్ని వైస్ కెప్టెన్​ను చేసి రోహిత్ వారసుడిగా తయారు చేయాలి. కొత్త కోచ్ గంభీర్ రాకతో అయినా కెప్టెన్సీ విషయంలో క్లారిటీ రాకపోతే భారత క్రికెట్​కు నష్టం తప్పదని ఎక్స్​పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. మరి.. ఈ విషయంలో బీసీసీఐ వ్యవహరిస్తున్న తీరుపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.