టీమిండియా చీఫ్ సెలక్టర్ రేసులో మరోసారి అజిత్ అగార్కర్ పేరు వినిపిస్తోంది. త్వరలోనే ఈ పదివిని అగార్కర్ కు అప్పజెప్పేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు తెలుస్తోంది. గత రెండుసార్లు కూడా అజిత్ అగార్కర్ పేరు వినిపించింది. కానీ, అగార్కర్ పదవిని చేపట్టేందుకు సుముఖత చూపించలేదు. ఈసారి అజిత్ అగార్కర్ మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. పదవిని చేపట్టేందుకు సిద్ధంగానే ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై బీసీసీఐ అధికారిక ప్రకటనను విడుదల చేయలేదు.
జులై మొదటివారంలో చీఫ్ సెలక్టర్ విషయంలో అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇటీవల ప్రముఖ న్యూస్ ఛానల్ నిర్వహించన స్టింగ్ ఆపరేషన్ లో అప్పటి చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ కీలక సమాచారం లీక్ చేస్తూ దొరికిపోయారు. ఆ ఘటనతో రాజీనామా చేశారు. అప్పటి పరిస్థితుల దృష్ట్యా ప్యానల్ లోని సభ్యుడైన శివ్ సుదంర్ ను తాత్కాలిక చీఫ్ సెలక్టర్ గా నియమించారు. త్వరలోనే ఆసియాకప్, వన్డే ప్రపంచకప్ వంటి మెగా ఈవెంట్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే చీఫ్ సెలక్టర్ కోసం బీసీసీఐ కసరత్తు ప్రారంభించింది.
ఇప్పటికే పదివి కోసం దరఖాస్తులు ఆహ్వీనించింది. జులై 1 నుంచి ఇంటర్వ్యూలు కూడా జరగనున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అంతా క్రికెట్ గురించే చర్చ జరుగుతోంది. ఎందుకంటే అక్టోబర్ 5 నుంచి వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈసారి వరల్డ్ కప్ కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుండటంతో మరింత ఆసక్తిగా మారింది. ఎందుకంటే స్వదేశంలో టోర్నీ కావడంతో ఈసారి వరల్డ్ కప్ మనదే అంటూ ప్రచారం కూడా చేస్తున్నారు. కాకపోతే రౌండ్ రాబిన్ స్టైల్ లో వరల్డ్ కప్ జరగనుండటంతో కొందరు మాత్రం మనకి అంతగా కలిసి రాదంటూ కామెంట్ చేస్తున్నారు.