iDreamPost
android-app
ios-app

IPL 2024: ఢిల్లీతో మ్యాచ్.. ఇషాన్ కిషన్ కు షాకిచ్చిన BCCI! ఇది ఊహించలేదు!

  • Published Apr 28, 2024 | 4:16 PM Updated Updated Apr 28, 2024 | 4:16 PM

ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కు ఊహించని షాకిచ్చింది బీసీసీఐ. ఆ వివరాల్లోకి వెళితే..

ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కు ఊహించని షాకిచ్చింది బీసీసీఐ. ఆ వివరాల్లోకి వెళితే..

IPL 2024: ఢిల్లీతో మ్యాచ్.. ఇషాన్ కిషన్ కు షాకిచ్చిన BCCI! ఇది ఊహించలేదు!

IPL 2024లో ముంబై ఇండియన్స్ కథ దాదాపు ముగిసినట్లే. ఢిల్లీతో నిన్న జరిగిన మ్యాచ్ లో పోరాడి ఓడిపోయింది ఎంఐ టీమ్. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 257 పరుగుల భారీ స్కోర్ చేయగా.. అనంతరం 258 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై 247 పరుగులకే పరిమితమై, 10 రన్స్ తో ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్ లో ముంబై వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కు ఊహించని షాకిచ్చింది బీసీసీఐ. ఆ వివరాల్లోకి వెళితే..

ఈ ఐపీఎల్ సీజన్ లో వరుస పరాజయాలతో సతమతమవుతోంది ముంబై ఇండియన్స్. ఇక నిన్న ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో కూడా తన పరాజయాల పరంపరను కొనసాగించింది. ఈ మ్యాచ్ తో ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుని డీలా పడ్డ ముంబైకి ఊహించని షాకిచ్చింది బీసీసీఐ. ఆ జట్టు ఓపెనర్ కమ్ స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కు భారీ జరిమానా విధించింది. మ్యాచ్ ఫీజులో 10 శాతం కోతపెట్టింది. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధన 2.2 ను ఉల్లంఘించినందుకు అతడిపై చర్యలు తీసుకుంది. కాగా.. ఇది లెవల్ 1 అఫెన్స్. దీనిని ఇషాన్ కూడా అంగీకరించాడు.

అయితే ఇషాన్ కిషన్ ఏం తప్పు చేశాడని మాత్రం బీసీసీఐ వెల్లడించలేదు. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.2 ఉల్లంఘన అంటే.. వికెట్లను కోపంతో తన్నడం, ఉద్దేశపూర్వకంగా డ్రెస్సింగ్ రూమ్ తలుపులను, ఇతర వస్తువులను పగలగొట్టడం, బౌండరీ దగ్గర ఏర్పాటు చేసిన ప్రకటన బోర్డులను తన్నడం వంటిని ఈ ఉల్లంఘన కిందకు వస్తాయి. అయితే ఇషాన్ కిషన్ ఇందులో ఏం చేశాడు? అన్నది మాత్రం బీసీసీఐ వెల్లడించలేదు. అసలు ఈ జరిమానాను ఎవ్వరూ ఊహించలేదు కూడా. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.