iDreamPost
android-app
ios-app

టీమిండియాలోకి వచ్చేసిన కాటేరమ్మ కొడుకు! ఆస్ట్రేలియానే కాదు.. ఎవడొస్తారో రండి!

BCCI- Team India Final Squad For T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ 2024 ఫీవర్ స్టార్ అయిపోయింది. టీమిండియా కూడా తుది జట్టును ప్రకటించింది. జట్టులోకి ఆ ప్లేయర్ రావడంతో ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషీగా ఉన్నారు.

BCCI- Team India Final Squad For T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ 2024 ఫీవర్ స్టార్ అయిపోయింది. టీమిండియా కూడా తుది జట్టును ప్రకటించింది. జట్టులోకి ఆ ప్లేయర్ రావడంతో ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషీగా ఉన్నారు.

టీమిండియాలోకి వచ్చేసిన కాటేరమ్మ కొడుకు! ఆస్ట్రేలియానే కాదు.. ఎవడొస్తారో రండి!

అంతా ఐపీఎల్ 2024 సీజన్ ఫీవర్లో ఉన్నారు. కానీ, అందరి మైండ్ లో మాత్రం వచ్చే టీ20 వరల్డ్ కప్ 2024 మీదే ఆశలు, ధ్యాస ఉన్నాయి. వాటిని సజీవం చేస్తూ తాజాగా బీసీసీఐ వరల్డ్ కప్ కోసం టీమిండియా తుది జట్టును ప్రకటించింది. మొత్తం 15 మంది సభ్యులతో అదిరిపోయే ఒక స్క్వాడ్ ని బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టులో ఉన్న ఆటగాళ్ల పేర్లు చదువుతుంటో టీమిండియా ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఎందుకంటే కరెక్ట్ సమయంలో కరెక్ట్ ఆటగాడు ఒకటు టీమ్ లో వచ్చి పడ్డాడు. అతడిని జట్టులో చూడగానే అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. అతడిని కాటేరమ్మ కొడుకుతో పోలుస్తూ ప్రత్యర్థులకు సవాళ్లు విసురుతున్నారు.

టీమిండియా టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ చూసిన తర్వాత అభిమానులు ఆనంద పడుతుంటే.. ప్రత్యర్థులు మాత్రం వణికిపోతున్నారు. అయితే అందరూ ఎప్పటినుంచో ఆడుతున్న వాళ్లే కదా.. కొత్తగా కంగారు దేనికి అనుకోకండి. ఐపీఎల్ 2024 పుణ్యమా అని టీమిండియా ఆటగాళ్లు మంచి ఫామ్ లో ఉన్నారు. ముఖ్యంగా ఒకడు మాత్రం మంచి స్వింగ్ లోకి వచ్చాడు. ప్రత్యర్థి బౌలర్ ఎవరైనా కొడితే బంతి బౌండరీలో పడుతోంది. అది కూడా బ్యాటుకు తగిలితే అది సిక్సర్ గా మారుతోంది. ఇలాంటి సమయంలో అలాంటి వాడి పేరును జట్టులో చేర్చి బీసీసీఐ మంచి పని చేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అతని ముందు ఏ ట్రావిస్ హెడ్, ఏ జేక్ ఫ్రేజర్, మరే మార్కరమ్ లు పనికిరారు.

ప్రభాస్ సలార్ సినిమాలో ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంది. అందులో ఒక సీన్లో కాటేరమ్మ రాలేదు.. కొడుకుని పంపింది అంటారు. ఆ సీన్ చూస్తే ఆడియన్స్ కి గూస్ బంప్స్ వస్తాయి. ఇప్పుడు టీమిండియాలో ఇతని పేరు చూసినా కూడా ఫ్యాన్స్ అదే ఫీల్ వస్తోంది. ముఖ్యంగా టీ20 వరల్డ్ కప్ మీద ఆశలు రెట్టింపు అయ్యాయి. అతను మరెవలో కాదు.. శివమ్ దూబె. ప్రస్తుతం విదేశీ బౌలర్లకు శివమ్ దూబె పేరు వింటేనే ప్యాంట్లు తడిసిపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే నిల్చున్న చోటు నుంచి ఎంతటి తోపు బౌలర్ ని అయినా అలవోకగా సిక్సర్ కొట్టేస్తున్నాడు. క్రీజులోకి వచ్చింది మొదలు.. ఉన్నంతసేపు బౌలర్లను ఊచకోత కోస్తున్నాడు. హేమా హేమీ బౌలర్లు అని చెప్పుకునే వారికి కూడా చెమటలు పట్టిస్తున్నాడు.

ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచుల్లో బ్యాటుతో శివమ్ దూబె మినీ యుద్ధమే చేశాడు. నిజానికి అతను ఆడుతుంటే చూసే వారికి శివ తాండవం లాగానే కనిపిస్తుంది. ఎక్కడ బాల్ వేసినా దానిని బౌండరికీ పంపడమే అతని లక్ష్యం. డిఫెన్స్ చేయడం, సింగిల్స్ తీయడం లాంటివి అస్సలు పెట్టుకోవడం లేదు. ఇలాంటి టైమ్ లో శివమ్ దూబేకి ఫైనల్స్ స్క్వాడ్ లో ఛాన్స్ ఇచ్చి సరైన నిర్ణయం తీసుకున్నారు అంటూ అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అలాగే ఈ కాటేరమ్మ కొడుకును చూపించి ఆస్ట్రేలియా లాంటి జట్లకు టీమిండియా ఫ్యాన్స్ సవాళ్లు విసురుతున్నారు. మా వాడికి కాలుక్యులేషన్స్, మానిప్యులేషన్స్ ఏం ఉండవు.. కొడితే సిక్సర్ అంతే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బంతులు లెక్కలు కాదు.. బౌండరీలు మాత్రమే లెక్కేసుకుంటాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. జట్టులో శివమ్ దూబేకి ఛాన్స్ దక్కడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి