Somesekhar
Cheating case against MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనిపై చీటింగ్ కేసు నమోదు అయ్యింది. ధోని రూ. 15 కోట్లు మోసం చేశాడు అంటూ ఓ వ్యక్తి బీసీసీఐకి ఫిర్యాదు చేశాడు.
Cheating case against MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనిపై చీటింగ్ కేసు నమోదు అయ్యింది. ధోని రూ. 15 కోట్లు మోసం చేశాడు అంటూ ఓ వ్యక్తి బీసీసీఐకి ఫిర్యాదు చేశాడు.
Somesekhar
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని గురించి క్రికెట్ ఫ్యాన్స్ కు ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. భారత్ కు అందని ద్రాక్షగా ఉన్న వన్డే వరల్డ్ కప్ ను సుదీర్ఘ కాలం తర్వాత అందించిన ఘనుడు. దాంతో పాటుగా ఛాంపియన్స్ ట్రోఫీ, టీ20 వరల్డ్ కప్ లను కూడా అందించి, మూడు ఐసీసీ ట్రోఫీలను భారత్ ఖాతాలో వేసి చరిత్ర సృష్టించాడు. ఇదిలా ఉండగా.. తాజాగా ధోనిపై చీటింగ్ కేసు నమోదు అయ్యిందన్న వార్త అభిమానులను షాక్ కు గురిచేస్తోంది. రూ. 15 కోట్లు మోసం చేశాడు అంటూ ఓ వ్యక్తి ధోనిపై కేసు పెట్టాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనిపై చీటింగ్ కేసు నమోదు అయ్యింది. ఉత్తరప్రదేశ్ లోని అమేథికి చెందిన రాజేశ్ కుమార్ మౌర్య అనే వ్యక్తి ధోనిని తనను రూ. 15 కోట్ల మేర మోసం చేశాడు అంటూ బీసీసీఐకి ఫిర్యాదు చేశాడు. ఈమేరకు బీసీసీఐ ఎథిక్స్ కమిటి రూల్ 36 కింద ధోనిపై కేసు నమోదు చేసింది. దాంతో పాటుగా ఆగస్టు 30లోగా ఈ విషయంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
కాగా.. గతంలో ధోనిపేరుతో క్రికెట్ అకాడమీలు నడిపేందుకు ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్ మెంట్ 2021లో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఇందుకు సంబంధించి తనకు రావాల్సిన రూ. 15 కోట్లు ఆర్కా స్పోర్ట్స్ ఓనర్ సౌమ్యా దాస్ పై రాంచీ సివిల్ కోర్ట్ లో కేసు వేశాడు. ప్రస్తుతం ఆ కేసు కోర్టు విచారణలో ఉంది. ఈ నేపథ్యంలో ధోనినే తనను రూ. 15 కోట్లు ఇవ్వకుండా మోసం చేశాడని రాజేశ్ కుమార్ మౌర్య అనే వ్యక్తి బీసీసీఐని ఆశ్రయించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు ధోని ఐపీఎల్ 2025 సీజన్ ఆడతాడా? లేదా? అన్న చర్చ జోరుగా జరుగుతుంటే? తాజాగా చీటింగ్ కేసు నమోదు అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరి ఈ విషయంపై ధోని ఏ విధంగా స్పందిస్తాడో వేచిచూడాలి.