iDreamPost
android-app
ios-app

వీడియో: గల్లీ క్రికెటర్‌ ఆడుతున్న ఈ టీమిండియా దిగ్గజాన్ని గుర్తుపట్టారా?

  • Published Aug 11, 2024 | 5:07 PM Updated Updated Aug 11, 2024 | 5:07 PM

Rahul Dravid, NCA, Gully Cricket: టీమిండియా స్టార్‌ క్రికెటర్లు గల్లీ క్రికెట్‌ ఆడటం చాలా అరుదు. అందులోనూ కొంతమంది నామ్‌ అండ్‌ కంపోజ్డ్‌ క్రికెటర్లు అయితే.. వాటి జోలికి పోరు. కానీ, అలాంటి ఓ క్రికెటర్‌ తాజాగా గల్లీ క్రికెట్‌లో బౌలింగ్‌ వేస్తూ కనిపించారు. మరి ఆ క్రికెటర్‌ ఎవరో ఇప్పుడు చూద్దాం..

Rahul Dravid, NCA, Gully Cricket: టీమిండియా స్టార్‌ క్రికెటర్లు గల్లీ క్రికెట్‌ ఆడటం చాలా అరుదు. అందులోనూ కొంతమంది నామ్‌ అండ్‌ కంపోజ్డ్‌ క్రికెటర్లు అయితే.. వాటి జోలికి పోరు. కానీ, అలాంటి ఓ క్రికెటర్‌ తాజాగా గల్లీ క్రికెట్‌లో బౌలింగ్‌ వేస్తూ కనిపించారు. మరి ఆ క్రికెటర్‌ ఎవరో ఇప్పుడు చూద్దాం..

  • Published Aug 11, 2024 | 5:07 PMUpdated Aug 11, 2024 | 5:07 PM
వీడియో: గల్లీ క్రికెటర్‌ ఆడుతున్న ఈ టీమిండియా దిగ్గజాన్ని గుర్తుపట్టారా?

డౌన్‌ టూ ఎర్త్‌ ఉండే క్రికెటర్లలో ముందు వరుసలో ఉంటాడు టీమిండియా మాజీ కెప్టెన్‌, మాజీ హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌. ఆటగాడిగా, కెప్టెన్‌గా, హెడ్‌ కోచ్‌గా భారత క్రికెట్‌కు ఎంతో సేవ చేసినా.. కొన్ని సందర్భాల్లో చాలా సింప్లిసిటీ చూపిస్తూ ఉంటాడు. తాజాగా గల్లీ క్రికెట్‌ ఆడుతూ కనిపించాడు ఈ దిగ్గజ మాజీ క్రికెటర్‌. టీ20 వరల్డ్‌ కప్‌ 2024 తర్వాత టీమిండియా హెడ్‌ కోచ్‌గా తన పదవి కాలం ముగియడంతో కోచింగ్‌కు వీడ్కోలు చెప్పి.. ఇప్పుడు తన ఫ్రీటైమ్‌ను ఎంజాయ్‌ చేస్తున్నాడు ద్రవిడ్‌.

ఈ క్రమంలోనే తాజాగా బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో గ్రౌండ్‌ స్టాఫ్‌తో కలిసి ద్రవిడ్‌ సరదాగా క్రికెట్‌ ఆడాడు. పైగా బౌలింగ్‌ కూడా వేశాడు. రాహుల్‌ ద్రవిడ్‌ ఒక బ్యాటర్‌గా, వికెట్‌ కీపర్‌గా మాత్రమే మనకు తెలుసు.. ఎప్పుడో ఒకటీ రెండు మ్యాచ్‌ల్లో బౌలింగ్‌ వేశాడు. టెస్టుల్లో ఒక వికెట్‌, వన్డేల్లో నాలుగు వికెట్లు కూడా తీసుకున్నాడు. తాజాగా మరోసారి తన బౌలింగ్‌ ప్రతిభను ఎన్‌సీఏ గ్రౌండ్‌ స్టాఫ్‌ ముందు చూపించాడు. నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో భారత క్రికెటర్లు రిహ్యాబ్‌ అవుతున్నారు. ఈ క్రమంలో ద్రవిడ్‌ అక్కడికి వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Rahul Dravid

కాగా, టీమిండియా హెడ్‌ కోచ్‌గా రాహుల్‌కు అద్భుతమైన ట్రాక్‌ రికార్డ్‌ ఉంది. 2021లో టీమిండియా హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన ద్రవిడ్‌.. తన కోచింగ్‌లో టీమిండియాను నెక్ట్స్‌ లెవెల్‌కు తీసుకెళ్లాడు. అతని కోచింగ్‌లోనే టీమిండియా టీ20 వరల్డ్‌ కప్‌ 2022లో సెమీ ఫైనల్‌, డబ్ల్యూటీసీ 2023 ఫైనల్‌, వన్డే వరల్డ్‌ కప్‌ 2023 ఫైనల్‌ ఆడింది. అలాగే ఆసియా కప్‌ 2023, టీ20 వరల్డ్‌ కప్‌ 2024 గెలిచింది. టీమిండియా హెడ్‌ కోచ్‌ పదవికి టీ20 వరల్డ్‌ కప్‌ విజయంతో ద్రవిడ్‌ వీడ్కోల పలకడం విశేషం. మరి ద్రవిడ్‌ గల్లీ క్రికెట్‌ బౌలింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.