iDreamPost
android-app
ios-app

Naman Awards 2024: నమన్ అవార్డ్స్ ప్రకటించిన BCCI.. ఎవరెవరికి ఏ పురస్కారం వచ్చిందంటే..?

  • Published Jan 23, 2024 | 8:00 PM Updated Updated Jan 27, 2024 | 8:21 AM

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రతిష్టాత్మక నమన్ అవార్డులను ప్రదానం చేసింది. ఎవరెవరు ఏ పురస్కారాన్ని గెలుచుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రతిష్టాత్మక నమన్ అవార్డులను ప్రదానం చేసింది. ఎవరెవరు ఏ పురస్కారాన్ని గెలుచుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Jan 23, 2024 | 8:00 PMUpdated Jan 27, 2024 | 8:21 AM
Naman Awards 2024: నమన్ అవార్డ్స్ ప్రకటించిన BCCI.. ఎవరెవరికి ఏ పురస్కారం వచ్చిందంటే..?

అవార్డులు ఇచ్చే కిక్ మామూలుగా ఉండదు. ఒక ప్లేయర్​ కాన్ఫిడెన్స్​ను మరింత పెంచడానికి, అతడ్ని బాగా ఆడేలా ప్రోత్సహించడానికి పురస్కారాలు చాలా ఉపయోగపడతాయి. అందుకే ఇతర ఆటల్లోలాగే క్రికెట్​లోనూ అవార్డులు ప్రకటిస్తుంటారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రతి ఏటా క్రికెటర్లకు పురస్కారాలను ప్రదానం చేస్తుంది. కానీ కరోనా వల్ల నాలుగేళ్లుగా ఈ కార్యక్రమాన్ని పోస్ట్​పోన్ చేస్తూ వచ్చింది. అయితే ఎట్టకేలకు ఈసారి ఆ ప్రోగ్రామ్ నిర్వహించాలని ఫిక్స్ అయింది. పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోవడం ఈసారి నమన్ అవార్డ్స్ ఫంక్షన్​ను గ్రాండ్​గా జరిపేందుకు ప్లాన్ చేసింది. అందుకు హైదరాబాద్​ను వేదికగా ఎంచుకుంది. ఇంగ్లండ్​-భారత్ జట్ల మధ్య తొలి టెస్ట్​కు ఆతిథ్యం ఇస్తుండటంతో భాగ్యనగరంలోనే అవార్డుల ఫంక్షన్​ను ప్లాన్ చేసింది. మంగళవారం సాయంత్రం ఈ ప్రోగ్రామ్ గ్రాండ్​గా జరిగింది. ఈసారి ఎవరెవరు ఏ పురస్కారాలు దక్కించుకున్నారో ఇప్పుడు చూద్దాం..

2019-20 ఏడాదికి గానూ బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్ అవార్డును ఏస్ పేసర్ మహ్మద్ షమి దక్కించుకున్నాడు. ఆ తర్వాతి ఏడాదికి గానూ సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పురస్కారం సొంతం చేసుకున్నాడు. 2021-22 సంవత్సరానికి స్టార్ పేసర్ జస్​ప్రీత్ బుమ్రా, 2022-23కు యంగ్ ఓపెనర్ శుబ్​మన్ గిల్ పాలీ ఉమ్రిగర్ అవార్డును గెలుచుకున్నారు. స్టైలిష్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ 2021-22 ఏడాదికి గానూ బెస్ట్ ఇంటర్నేషనల్ డెబ్యూ అవార్డును దక్కించుకున్నాడు. భారత మాజీ కోచ్ రవిశాస్త్రి లైఫ్​టైమ్ అచీవ్​మెంట్ పురస్కారాన్ని సొంతం చేసుకున్నాడు. దీని మీద ఆయన స్పందిస్తూ.. తన కెరీర్​లో గొప్ప అచీవ్​మెంట్ అంటే గబ్బా టెస్ట్​లో ఆస్ట్రేలియాపై సాధించిన విజయమేనని చెప్పాడు. ఆ మ్యాచ్​లో రిషబ్ పంత్ కొట్టిన విన్నింగ్​ రన్​ కంటే పెద్ద మెడల్ ఇంకేదీ లేదన్నాడు.

స్టార్ క్రికెటర్లతో పాటు మరికొందరు కూడా నమన్ అవార్డులు అందుకున్నారు. 2021-22 సీజన్​కు గానూ రంజీ క్రికెట్​లో అత్యధిక పరుగులు చేసినందుకు సర్ఫరాజ్ ఖాన్ మాధవ్​రావ్ సింధియా అవార్డును దక్కించుకున్నాడు. 2022-23 సీజన్​లో బెస్ట్ స్కోరర్​గా నిలిచినందుకు గానూ మయాంక్ అగర్వాల్ ఇదే పురస్కారాన్ని సొంతం చేసుకున్నాడు. మహిళల క్రికెట్​లో 2020-21 ఏడాదికి బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెటర్​గా స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన ఎంపికైంది. అయితే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీలకు ఈసారి ఒక్క అవార్డు కూడా దక్కకపోవడం గమనార్హం. గతేడాది వీళ్లిద్దరూ సూపర్ ఫామ్​లో ఉన్నారు. ముఖ్యంగా కోహ్లీ అయితే బెస్ట్ వరల్డ్ కప్ ఆడాడు. అయినా అతడికి పురస్కారం రాలేదు. కానీ ఓవరాల్​గా చూసుకుంటే బీసీసీఐ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు గెలుచుకున్న వారిలో విరాట్ ముందున్నాడు. అతడు 5 సార్లు ఈ పురస్కారాన్ని సొంతం చేసుకున్నాడు. అతడి తర్వాత ప్లేసులో సచిన్ టెండూల్కర్ (2), రవిచంద్రన్ అశ్విన్ (2) ఉన్నారు.