SNP
BCCI, IPL 2024: క్రికెట్ అభిమానులను రెండున్నర నెలల పాటు అలరించే ఐపీఎల్ 17వ సీజన్ శుక్రవారం నుంచి అట్టహాసంగా ప్రారంభం కానుంది. అయితే.. ఈ సారి ఐపీఎల్‌లో బీసీసీఐ మూడు కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది. అవేంటో ఇప్పుడు చూద్దాం..
BCCI, IPL 2024: క్రికెట్ అభిమానులను రెండున్నర నెలల పాటు అలరించే ఐపీఎల్ 17వ సీజన్ శుక్రవారం నుంచి అట్టహాసంగా ప్రారంభం కానుంది. అయితే.. ఈ సారి ఐపీఎల్‌లో బీసీసీఐ మూడు కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది. అవేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
ఐపీఎల్ 2024 సీజన్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. శుక్రవారం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే తొలి మ్యాచ్‌తో ధనాధన్ క్రికెట్ టోర్నికి తెరలేవనుంది. దాదాపు రెండున్నర నెలల పాటు క్రికెట్ అభిమానులకు ఫుల్ వినోదాన్ని అందించే ఐపీఎల్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ లవర్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. ఈ సారి ఐపీఎల్‌లో బీసీసీఐ ఓ మూడు కొత్త రూల్స్‌ను ప్రవేశపెట్టింది. మరి ఆ రూల్స్ ఏంటి? ఎవరికి మేలు చేస్తాయి? ఎవరికి ఇబ్బంది పెట్టేలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
60 సెకన్ల రూల్ లేదు
వికెట్ కీపర్ స్టప్ అవుట్ చేసి.. అపీల్ చేస్తే ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేస్తారు. అయితే.. స్టంపింగ్ కంటే ముందు ఒక వేళ బాల బ్యాట్‌ను ఏమైనా తాకిందా అనే కోణంలో.. థర్డ్ అంపైర్ ముందుగా క్యాచ్‌ను చెక్ అవుట్‌ను చెక్ చేస్తాడు. ఆ రూల్ ఈ సారి ఐపీఎల్‌లో కూడా కొనసాగించనున్నారు. దీంతో పాటు ఐసీసీ తీసుకొచ్చిన స్టాప్ క్లాక్ రూల్‌ను ఈ ఐపీఎల్ సీజన్‌లో అమలు చేయొద్దని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. స్టాప్ క్లాక్ రూల్ ప్రకారం ఫీల్టింగ్ జట్టు 60 సెకన్ల లోపు నెక్ట్స్ ఓవర్ వేయాలి. అలా వేయకుంటే.. ఫీల్డింగ్ జట్టుకు అంపైర్లు రెండు సార్లు వార్నింగ్ ఇచ్చి మూడో సారి పరుగుల పెనాల్టీ విధిస్తాడు.
ఓవర్‌కి రెండు బౌన్సర్లు.. బ్యాటర్లకు కష్టమే!
ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఒక ఓవర్‌లో కేవలం ఒక్క బౌన్సర్‌ను అనుమతిస్తున్నారు. ఈ ఐపీఎల్ సీజన్ నుంచి ఒకే ఓవర్‌లో రెండు బౌన్సర్లకు ఓకే చెప్పారు. గత సీజన్ వరకు ఒక్క షార్ట్ బాల్ వేయడానికి మాత్రమే బౌలర్లకు అనుమతి ఉండేది. ఈ రూల్‌ను బీసీసీఐ ఇప్పటికే దేశవాళి క్రికెట్ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనే ప్రవేశపెట్టింది. ఓవర్‌కి రెండు బౌన్సర్లు అంటే బ్యాటర్లు కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది.
స్మార్ట్ రీప్లే సిస్టమ్
వేగంగా కచ్చితమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఈ సీజన్‌లో స్మార్ట్ రిప్లే సిస్టమ్ టెక్నాలజీ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ స్మార్ట్ రీప్లే సిస్టమ్ వల్ల టీవీ అంపైర్ నేరుగా హాక్ ఐ ఆపరేటర్స్ ద్వారా ఇన్‌పుట్స్ తీసుకుంటాడు. మైదానం చుట్టూ పెట్టే ఎనిమిది హైస్పీడ్ హాక్ ఐ కెమెరాల నుంచి బ్రాడ్ కాస్టర్ డైరెక్టర్‌తో సంబంధం లేకుండా రీప్లేలను టీవీ అంపైర్ పరిశీలించవచ్చు. దీని వల్ల థర్డ్ అంపైర్లు తమ నిర్ణయాన్ని కచ్చితంగా, వేగంగా ఇవ్వొచ్చు. ఈ రూల్స్‌తో ఐపీఎల్ మరింత మజాగా మారనుంది. మరి ఈ రూల్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
💛❤️ over the years!
The two teams meet again tomorrow 😎
Which is your favourite #CSKvRCB moment of all time?#TATAIPL pic.twitter.com/klZWM7g2ta
— IndianPremierLeague (@IPL) March 21, 2024