Raj Mohan Reddy
క్రికెట్‌లో ఒక్కో ప్లేయర్ ఒక్కోలా సెలబ్రేట్ చేసుకుంటాడు. వికెట్లు తీసినప్పుడు లేదా సెంచరీ చేసినప్పుడు ఆటగాళ్ల రియాక్షన్స్ వైరల్ అవుతుంటాయి. కానీ ఇది మాత్రం వాటన్నింటికీ విభిన్నం అనే చెప్పాలి.
క్రికెట్‌లో ఒక్కో ప్లేయర్ ఒక్కోలా సెలబ్రేట్ చేసుకుంటాడు. వికెట్లు తీసినప్పుడు లేదా సెంచరీ చేసినప్పుడు ఆటగాళ్ల రియాక్షన్స్ వైరల్ అవుతుంటాయి. కానీ ఇది మాత్రం వాటన్నింటికీ విభిన్నం అనే చెప్పాలి.
Raj Mohan Reddy
క్రికెట్‌లో ప్లేయర్ల రియాక్షన్స్ బాగా వైరల్ అవుతుంటాయి. గెలుపు కోసం అహర్నిషలు కష్టపడే ఆటగాళ్లు దాన్ని రుచి చూసినప్పుడు చిన్న పిల్లల్లా మారిపోయి సెలబ్రేషన్స్ చేసుకుంటారు. ఎగురుతూ, గంతులేస్తూ సంబురాల్లో మునిగిపోతారు. గేమ్‌లో ఎమోషన్స్ చూపించడం కామన్. గెలిచినప్పుడే కాదు.. ఓడినప్పుడు కూడా ఆటగాళ్ల రియాక్షన్స్ వైరల్ అవుతుంటాయి. కన్నీళ్లు పెట్టుకుంటూ తమ బాధను చూపిస్తుంటారు. అయితే ఈ ఎమోషన్స్ చూపించడం, సెలబ్రేషన్స్ చేసుకోవడం అనేది ఒక్కోసారి శృతి మించుతుంది. దీని వల్ల ఇతరులకు ఇబ్బంది కలిగిన దాఖలాలు అనేకం ఉన్నాయి. తాజాగా ఓ మ్యాచ్‌లో బ్యాటర్ విన్నింగ్ సెలబ్రేషన్స్‌లో భాగంగా అంపైర్‌ను కొట్టడం చర్చనీయాంశంగా మారింది. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
వికెట్లు తీసినప్పుడు బౌలర్లు, సెంచరీ చేసినప్పుడు బ్యాటర్లు సెలబ్రేట్ చేసుకోవడం మామూలే. గెలిచినప్పుడు టీమ్ ప్లేయర్లంతా కలసి ఆ మూమెంట్స్‌ను ఎంజాయ్ చేస్తూ సెలబ్రేషన్స్‌లో మునిగిపోతారు. తాజాగా ఓ జట్టు ఇలాగే గ్రౌండ్‌లో సందడి చేసింది. విన్నింగ్ షాట్ కొట్టిన బ్యాటర్ సంతోషం పట్టలేక బ్యాట్ విసిరేశాడు. ‘సై’ సినిమాలో భిక్షు యాదవ్ మాదిరిగా డిఫరెంట్ స్టైల్‌లో సెలబ్రేట్ చేసుకున్నాడు. నాన్ స్ట్రయికింగ్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్ ఆనందంతో డగౌట్ వైపు పరుగులు తీశాడు. కానీ విన్నింగ్ షాట్ కొట్టిన బ్యాటర్ మాత్రం పిచ్ మీదే ఉండి గట్టిగా అరుస్తూ కాళ్లు అటూ ఇటూ అంటూ వెరైటీగా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ క్రమంలో అతడు విసిరిన బ్యాట్ కాస్తా వెళ్లి నాన్‌స్ట్రయికింగ్ ఎండ్‌లో ఉన్న అంపైర్ మీద పడింది.
బ్యాట్ వచ్చి కాళ్లకు తగలడంతో అంపైర్ కుర్రో మొర్రో అంటూ అరిచాడు. నీ సెలబ్రేషన్ నా చావుకొచ్చింది రా అంటూ బ్యాటర్ వైపు సీరియస్‌గా చూశాడు. అయితే బ్యాటర్ మాత్రం అది పట్టించుకోకుండా సెలబ్రేషన్స్‌లో మునిగిపోయాడు. ఆ తర్వాత అతడి టీమ్‌మేట్స్ అందరూ పిచ్ వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చారు. బ్యాటర్‌ను హగ్ చేసుకొని ఎంజాయ్ చేశారు. ఆ టైమ్‌లో అంపైర్ కుంటుతూ కనిపించాడు. ఈ ఘటన ఎక్కడ, ఏ మ్యాచ్‌లో జరిగిందనే వివరాలు తెలియదు. దీనికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. దీన్ని చూసిన నెటిజన్స్ ఇదేం సెలబ్రేషన్ రా నాయనా.. క్రికెట్‌లో ఎప్పుడూ ఇలాంటిది చూడలేదంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. అంపైర్‌కు కనీసం సారీ కూడా చెప్పలేదు.. దారుణం భయ్యా అని అంటున్నారు. సెలబ్రేషన్ చేసుకోవడంలో తప్పు లేదు గానీ దాని వల్ల ఇతరులకు ఇబ్బంది కలిగించడం కరెక్ట్ కాదని చెబుతున్నారు.
The celebration 🤯pic.twitter.com/RNSHBYn1H0
— CricTracker (@Cricketracker) August 1, 2024