iDreamPost
android-app
ios-app

వీడియో: ధోనీని కాపీ చేసిన బంగ్లాదేశ్ కీపర్.. అచ్చం మాహీలాగే..!

  • Published Mar 10, 2024 | 11:31 AM Updated Updated Mar 10, 2024 | 11:31 AM

క్రికెట్​లో ఎందరో గ్రేట్ వికెట్ కీపర్స్ ఉన్నారు. కానీ అందరిలో ప్రత్యేకంగా నిలుస్తాడు లెజెండ్ ఎంఎస్ ధోని. అయితే అలాంటోడ్ని మించేలా ఓ బంగ్లాదేశ్ ఆటగాడు కీపింగ్ చేశాడు.

క్రికెట్​లో ఎందరో గ్రేట్ వికెట్ కీపర్స్ ఉన్నారు. కానీ అందరిలో ప్రత్యేకంగా నిలుస్తాడు లెజెండ్ ఎంఎస్ ధోని. అయితే అలాంటోడ్ని మించేలా ఓ బంగ్లాదేశ్ ఆటగాడు కీపింగ్ చేశాడు.

  • Published Mar 10, 2024 | 11:31 AMUpdated Mar 10, 2024 | 11:31 AM
వీడియో: ధోనీని కాపీ చేసిన బంగ్లాదేశ్ కీపర్.. అచ్చం మాహీలాగే..!

క్రికెట్​లో అందరూ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ గురించే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అయితే అంతగా చర్చల్లోకి రాకున్నా మ్యాచ్​లో కీలక భాగంగా నిలిచే వాటిల్లో ఒకటిగా వికెట్ కీపింగ్​ను చెప్పొచ్చు. వికెట్ల వెనుక కాచుకొని క్యాచులు, స్టంపౌట్​లు, రనౌట్​లు చేయడమే గాక కెప్టెన్​తో పాటు బౌలర్లకు ఫీల్డింగ్ పొజిషన్స్ విషయంలో ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తుంటారు కీపర్లు. బ్యాటర్ల వీక్​నెస్​ను పసిగట్టడంలోనూ కీపర్లు ముందుంటారు. వరల్డ్ క్రికెట్​లో చాలా మంది గొప్ప కీపర్లు ఉన్నా అందరిలోనూ భారత లెజెండ్ ఎంఎస్ ధోని చాలా వైవిధ్యం. సంప్రదాయ శైలిలో కాకుండా నయా స్టైల్​లో కీపింగ్ చేస్తూ, డిఫరెంట్ రనౌట్స్, స్టంపౌట్స్​తో స్పెషల్​గా నిలిచాడు ధోని. వికెట్లకు దూరంగా ఉన్నా బాల్​ పట్టాడంటే కాళ్ల సందుల్లో నుంచి కూడా స్టంప్స్​ను పడేయడం అతడి ప్రత్యేకత. అలాంటోడ్ని మించిపోయాడో కీపర్. అతడే బంగ్లాదేశ్ ఆటగాడు లిటన్ దాస్.

ఫీల్డర్లు త్రోలు విసిరినా లేదా బ్యాట్స్​మన్​ కొట్టిన బాల్ పిచ్​కు సమీపంలోనే ఉన్నా దాన్ని అందుకొని ఎలాగైనా సరే వికెట్లకు విసురుతాడు ధోని. స్టంప్స్​కు వ్యతిరేక దిశలో ఉన్నా, వెనుక వైపు ఉన్నా కాళ్ల సందుల్లో నుంచి లేదా కాళ్ల పక్క నుంచి చూడకుండానే వికెట్లకు గురిచూసి కొట్టడం అతడి ప్రత్యేకత. అయితే బంగ్లా కీపర్ లిటన్ దాస్ అతడ్నే మించిపోయాడు. శ్రీలంకతో శనివారం రాత్రి జరిగిన 3వ టీ20 మ్యాచ్​లో అతడు అద్భుతం చేశాడు. రన్ తీసేందుకు ప్రయత్నించిన లంక బ్యాటర్ దసున్ శనకను సూపర్బ్​గా రనౌట్ చేశాడు. క్రీజుకు దగ్గర్లోనే ఉన్న శనక ఈజీగా లోపలకు వచ్చేస్తానని భావించాడు. కానీ త్రోను అందుకున్న దాస్.. ధోని మాదిరిగా చేతులను శరీరానికి వెనుక వైపు నుంచి తీసుకొచ్చి వికెట్లను గురిపెట్టాడు. శనక క్రీజులోకి వచ్చే లోపు బంతి వెళ్లి వికెట్లను గిరాటేసింది.

ఏం జరుగుతుందో అర్థం అయ్యే లోపే శనక ఔట్ అయిపోయాడు. దీంతో బంగ్లా ఆటగాళ్లు సంతోషంలో మునిగిపోయారు. ఊహించని విధంగా రనౌట్ చేసిన దాస్​ను మెచ్చుకున్నారు. లిటన్ రనౌట్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్.. అచ్చం ధోనీని దింపేశాడని అంటున్నారు. నెట్స్​లో విపరీతంగా ప్రాక్టీస్ చేయేడం, అదే టైమ్​లో ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, టైమింగ్ కుదిరితే తప్ప ఇలాంటి రనౌట్​ చేయడం సాధ్యం కాదని చెబుతున్నారు. ఇవన్నీ ఉండటంతో పాటు వికెట్లను పడగొట్టగలననే ధీమా కూడా ఉండాలని అంటున్నారు. ఇక, ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన లంక 20 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేజింగ్​కు దిగిన బంగ్లా 19.4 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్ అయింది. మరి.. లిటన్ దాస్ రనౌట్ మీద మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: జూనియర్ మలింగ హ్యాట్రిక్! ముంబై ఇండియన్స్ లో జోష్!