వరల్డ్ కప్ లో ఓటమి.. 17 ఏళ్ల కెరీర్ కు స్టార్ ఆల్ రౌండర్ వీడ్కోలు!

వరల్డ్ కప్ లో ఓటమి.. 17 ఏళ్ల కెరీర్ కు స్టార్ ఆల్ రౌండర్ వీడ్కోలు!

టీ20 వరల్డ్ కప్ 2024 తర్వాత రిటైర్మెంట్స్ ప్రకటించే ఆటగాళ్ల సంఖ్య పెరుగుతూనే వస్తోంది. తాజాగా వరల్డ్ కప్ లో తమ జట్టు ఓటమి చెందడంతో.. తన 17 ఏళ్ల క్రికెట్ కెరీర్ కు స్టార్ ఆల్ రౌండర్ గుడ్ బై చెప్పాడు.

టీ20 వరల్డ్ కప్ 2024 తర్వాత రిటైర్మెంట్స్ ప్రకటించే ఆటగాళ్ల సంఖ్య పెరుగుతూనే వస్తోంది. తాజాగా వరల్డ్ కప్ లో తమ జట్టు ఓటమి చెందడంతో.. తన 17 ఏళ్ల క్రికెట్ కెరీర్ కు స్టార్ ఆల్ రౌండర్ గుడ్ బై చెప్పాడు.

టీ20 వరల్డ్ కప్ గెలవడంతో.. ఘనంగా పొట్టి ఫార్మాట్ కు గుడ్ బై చెప్పారు టీమిండియా స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా. వీరితో పాటుగా వరల్డ్ కప్ లో ఓటమిని తట్టుకోలేక పలు దేశాల ప్లేయర్లు తమ క్రికెట్ కెరీర్లకు వీడ్కోలు పలుకుతూ వస్తున్నారు. న్యూజిలాండ్ వెటరన్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ కూడా పొట్టి ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ముగిసిన ప్రపంచ కప్ లో తమ టీమ్ ఓడిపోవడంతో.. తన 17 ఏళ్ల క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెప్పాడు ఓ స్టార్ ఆల్ రౌండర్. ఆ వివరాల్లోకి వెళితే..

టీ20 వరల్డ్ కప్ గెలవడంతో.. టీమిండియా సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా టీ20లకు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఇక వారి బాటలోనే మరికొందరు ఆటగాళ్లు నడుస్తున్నారు. తాజాగా జరిగిన టీ20 వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ ఓటమి తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు తెలిపాడు ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ మహ్మదుల్లా రియాద్. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా సూపర్ 8లో బంగ్లాదేశ్ ఆడిన మూడు మ్యాచ్ ల్లో కూడా ఓడిపోయి.. ఇంటిదారి పట్టింది. దాంతో మహ్మదుల్లా రియాద్ రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

2007లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ ద్వారా క్రికెట్ లోకి అడుగుపెట్టాడు మహ్మదుల్లా రియాద్. 17 ఏళ్లుగా బంగ్లాదేశ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించి.. 50 టెస్టుల్లో 2914, 232 వన్డేల్లో 5386, 138 టీ20ల్లో 2393 పరుగులు చేశాడు. అలాగే.. టెస్టుల్లో 43, వన్డేల్లో 82, టీ20ల్లో 40 వికెట్లు తీశాడు. మూడు ఫార్మాట్స్ లో కలిపి 10 వేలకు పైగా పరుగులు చేశాడు. దీంతో పాటుగా బంగ్లాదేశ్ సాధించిన ఎన్నో విజయాల్లో కీలక పాత్ర వహించాడు. టీ20లకు కెప్టెన్ గానూ వ్యవహరించిన అతడు 2018లో నిదహాస్ టోర్నీలో జట్టును ఫైనల్ కు చేర్చాడు. మరి వరల్డ్ కప్ ఓటమితో తన 17 ఏళ్ల క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెప్పిన ఈ స్టార్ ఆల్ రౌండర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: 

Show comments