iDreamPost
android-app
ios-app

IND vs BAN: టీమిండియాతో సిరీస్​.. బంగ్లా టీమ్ ప్రకటన! గట్టిగానే సెట్ చేశారు..

  • Published Sep 12, 2024 | 2:30 PM Updated Updated Sep 12, 2024 | 2:30 PM

Bangladesh squad for Test series against India: టీమిండియాతో జరగబోయే టెస్ట్ సిరీస్ కు బంగ్లాదేశ్ 16 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.

Bangladesh squad for Test series against India: టీమిండియాతో జరగబోయే టెస్ట్ సిరీస్ కు బంగ్లాదేశ్ 16 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.

IND vs BAN: టీమిండియాతో సిరీస్​.. బంగ్లా టీమ్ ప్రకటన! గట్టిగానే సెట్ చేశారు..

టీమిండియా-బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇందుకోసం ఇప్పటికే  తొలి టెస్ట్ కు సంబంధించి టీమిండియా జట్టును ప్రకటించింది బీసీసీఐ. సుదీర్ఘ విరామం తర్వాత స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇక పాకిస్థాన్ పై టెస్ట్ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన విజయోత్సాహంతో ఉన్న బంగ్లాదేశ్ సైతం తమ జట్టును ప్రకటించింది. 16 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. దాదాపు పాక్ ను ఓడించిన టీమ్ తోనే బరిలోకి దిగబోతోంది. కాగా.. జట్టులో ఓ అన్ క్యాప్డ్ ప్లేయర్ కు అవకాశం దక్కింది.

భారత్ తో సెప్టెంబర్ 19 నుంచి ఆరంభం కాబోయే రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ కు బంగ్లాదేశ్ తమ జట్టును ప్రకటించింది. 16 మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో ఎక్కువ మంది పాకిస్థాన్ తో సిరీస్ లో పాల్గొన్న వారే ఉండటం గమనార్హం. గాయం కారణంగా స్టార్ పేసర్ షోరిఫుల్ ఇస్లాం జట్టుకు దూరమైయ్యాడు. తొలిసారి జాకర్ అలీని జట్టులోకి తీసుకుంది బంగ్లా. నలుగురు పేసర్లు, నలుగురు స్పిన్నర్లను టీమ్ లోకి తీసుకుని.. భారత్ కు గట్టిపోటీ ఇవ్వాలని భావిస్తోంది. మరీ ముఖ్యంగా స్పిన్ బలంతో టీమిండియాను దెబ్బతీయాలని భావిస్తోంది. బ్యాటింగ్ లో ఓపెనర్ షాద్ మన్, ముష్పికర్ రహీమ్, లిట్టన్ దాస్, మెహిదీ హసన్  మిర్జా లు అద్భుతంగా రాణిస్తున్నారు. బౌలింగ్ లో సీనియర్ షకీబ్ అల్ హీసన్ తో పాటుగా మీర్జా, హసన్ మహ్మద్, టస్కిన్ అహ్మద్ లు అదరగొడుతున్నారు. పాక్ ను చిత్తు చేసిన ఉత్సాహంతో టీమిండియాలోకి అడుగుపెడుతోంది బంగ్లా. మరి పటిష్టమైన భారత్ ను బంగ్లా ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.

భారత్ తో టెస్ట్ సిరీస్ కు ఎంపికైన బంగ్లాదేశ్ జట్టు ఇదే:

షాంటో(కెప్టెన్), షాద్ మన్ ఇస్లాం, జాకీర్ హసన్, మోమినుల్ హక్, మహ్మదుల్ హసన్ జాయ్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిట్టన్ దాస్, మెహందీ హసన్ మీర్జా, జాకీర్ అలీ, టస్కిన్ అహ్మద్, హసన్ మహమూద్, నహిద్ రానా, తైజుల్ ఇస్లాం, నయీమ్ హసన్, ఖలీద్ అహ్మద్.

ఇదికూడా చదవండి: Riyan Parag: వీడియో: రియాన్ పరాగ్ స్టన్నింగ్ సిక్స్.. ఇది పక్కా చూడాల్సిన షాట్!