iDreamPost
android-app
ios-app

PAK vs BAN: పరువుపోగొట్టుకోవడమే పనిగా పెట్టుకున్న పాకిస్థాన్! బంగ్లా చేతిలో చిత్తు..

  • Published Aug 25, 2024 | 4:46 PM Updated Updated Aug 25, 2024 | 4:46 PM

రావల్పిండి వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో ఏకంగా 10 వికెట్ల తేడాతో పాకిస్థాన్ ను చిత్తు చేసింది బంగ్లాదేశ్. దాంతో దిగ్గజ జట్లకు సైతం సాధ్యం కాని ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

రావల్పిండి వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో ఏకంగా 10 వికెట్ల తేడాతో పాకిస్థాన్ ను చిత్తు చేసింది బంగ్లాదేశ్. దాంతో దిగ్గజ జట్లకు సైతం సాధ్యం కాని ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

PAK vs BAN: పరువుపోగొట్టుకోవడమే పనిగా పెట్టుకున్న పాకిస్థాన్! బంగ్లా చేతిలో చిత్తు..

రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ కోసం పాకిస్థాన్ లో అడుగుపెట్టిన బంగ్లాదేశ్ తొలి టెస్టులోనే చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. ఆస్ట్రేలియా, ఇండియా, ఇంగ్లండ్ లాంటి దిగ్గజ జట్లు సాధించలేని రికార్డును బంగ్లాదేశ్ తమ పేరిట సువర్ణాక్షరాలతో లిఖించుకుంది. రావల్పిండి వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో ఏకంగా 10 వికెట్ల తేడాతో పాక్ ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్ లో పూర్తి ఆధిపత్యం చెలాయించారు బంగ్లా ప్లేయర్లు.

పాకిస్థాన్ కు బంగ్లాదేశ్ ఊహించని షాకిచ్చింది. టెస్టుల్లో తొలిసారి పాక్ ను ఓడించి చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే దిగ్గజ జట్లు సైతం సాధించని రికార్డును బంగ్లాదేశ్ లిఖించింది. పాకిస్థాన్ గడ్డపై పాక్ ను 10 వికెట్ల తేడాతో ఓడించిన తొలి జట్టుగా బంగ్లా నిలిచింది. ఈ మ్యాచ్ లో బంగ్లాను తక్కువ అంచనా వేసిన పాక్ భారీ మూల్యమే చెల్లించుకుంది. ఇక మ్యాచ్ విషయానికి  వస్తే.. పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్ లో 448/6, రెండో ఇన్నింగ్స్ లో 146 రన్స్ కే ఆలౌట్ అయ్యింది. ఇక బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో 565 పరుగుల భారీ స్కోర్ సాధించింది.

Bangladesh record win!

ఇక పాక్ నిర్దేశించిన 30 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండా ఛేదించింది. హసన్ మిర్జా 4, షకీబ్ 3 వికెట్లతో పాక్ పతనాన్ని శాసించారు. 191 పరుగులతో భారీ సెంచరీ చేసిన ముష్పికర్ రహీమ్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ దక్కింది. రెండో ఇన్నింగ్స్ లో రిజ్వాన్ ఒక్కడే 51 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. కాగా.. గత కొంత కాలంగా పాకిస్థాన్ కు గడ్డు పరిస్థితులు ఎదురౌతున్నాయి. వన్డే వరల్డ్ కప్ నుంచి టీ20 వరల్డ్ కప్ వరకు ఏ టోర్నీలోనూ అద్బుతంగా ఆడినపాపానపోలేదు. దాంతో పాక్ పై తీవ్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. పరువుపోగొట్టుకోవడమే పనిగా పెట్టుకుంది పాక్ అంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నారు. మరి పాక్ ను చిత్తు చేసి సిరీస్ లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లిన బంగ్లాదేశ్ పై మీ అభిప్రాయాలను తెలియజేయండి.