iDreamPost
android-app
ios-app

ICC Banned: స్టార్ క్రికెటర్ పై రెండేళ్ల నిషేధం! ICC ప్రకటన..

  • Published Jan 16, 2024 | 10:24 PM Updated Updated Jan 16, 2024 | 10:24 PM

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఓ స్టార్ క్రికెటర్ కు షాకిచ్చింది. క్రికెట్ ఆడకుండా.. ఆ ప్లేయర్ పై రెండు సంవత్సరాలు నిషేధం విధించింది ఐసీసీ. మరి ఆ ఆటగాడు ఎవరు? ఎందుకు నిషేధం విధించింది? ఇప్పుడు తెలుసుకుందాం.

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఓ స్టార్ క్రికెటర్ కు షాకిచ్చింది. క్రికెట్ ఆడకుండా.. ఆ ప్లేయర్ పై రెండు సంవత్సరాలు నిషేధం విధించింది ఐసీసీ. మరి ఆ ఆటగాడు ఎవరు? ఎందుకు నిషేధం విధించింది? ఇప్పుడు తెలుసుకుందాం.

ICC Banned: స్టార్ క్రికెటర్ పై రెండేళ్ల నిషేధం! ICC ప్రకటన..

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఓ స్టార్ క్రికెటర్ కు షాకిచ్చింది. క్రికెట్ ఆడకుండా.. ఆ ప్లేయర్ పై రెండు సంవత్సరాలు నిషేధం విధించింది ఐసీసీ. ఇందుకు సంబంధించి ప్రకటనను కూడా విడుదల చేసింది. మరి ఐసీసీ నిషేధం విధించిన ఆ స్టార్ ప్లేయర్ ఎవరు? ఏం తప్పు చేశాడని అతడికి ఈ శిక్ష విధించారు? పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ బంగ్లాదేశ్ క్రికెటర్ అయిన నాసిర్ హొస్సేన్ కు భారీ షాకిచ్చింది. అతడిని రెండేళ్లు క్రికెట్ ఆడకుండా నిషేధం విధించింది. అవినీతి నిరోధక నియమావళిని ఉల్లంఘించినందుకు ఈ డెసిషన్ తీసుకుంది ఐసీసీ. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. అబుదాబి టీ10 లీగ్ 2020-21 సీజన్ లో పూణే డెవిల్స్ కు నాసిర్ హోస్సేన్ ప్రాతినిథ్యం వహించాడు. ఈ సీజన్ లో అతడు మరో ఏడుగురు ఆటగాళ్లతో కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డట్లు వారిపై ఆరోపణలు వచ్చాయి. దీంతో విచారణలో భాగంగా 2023 సెప్టెంబర్ లో వారిపై అభియోగాలను నమోదు చేసింది ఐసీసీ అవినీతి నిరోధక విభాగం.

ఈ క్రమంలోనే విచారణ చేపట్టగా.. నాసిర్ అవినీతికి పాల్పాడ్డాడని తేలింది. నాసిర్ ఖరీదైన ఐఫోన్ 12ను గిఫ్ట్ గా పొందాడని, ఆ ఫోన్ నుంచే బుకీలతో మాట్లాడాడని తేలింది. అదీకాక విచారణకు నాసిర్ సహకరించలేదని ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. స్పిన్ ఆల్ రౌండర్ అయిన నాసిర్ హోస్సేన్ బంగ్లా తరఫున 19 టెస్టులు, 65 వన్డేలు, 31 టీ20లు ఆడాడు. తాజాగా నిషేధం విధించబడటంతో.. మళ్లీ 2025 తర్వాతనే అతడు క్రికెట్ లోకి రీ ఎంట్రీ ఇవ్వడం సాధ్యపడుతుంది. ప్రస్తుతం 32 సంవత్సరాలు ఉన్న ఈ బంగ్లా క్రికెటర్ మళ్లీ క్రికెట్ లోకి ఎంట్రీ ఇవ్వడం అసాధ్యమనే చెప్పాలి. మరి ఐసీసీ బంగ్లా క్రికెటర్ పై నిషేధం విధించడం మీకేవిధంగా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.