Nidhan
Bangladesh Humiliate Pakistan: బంగ్లాదేశ్ జట్టు అన్నంత పని చేసింది. తమ ప్రతాపం చూపిస్తామంటూ పాకిస్థాన్ పర్యటనకు ముందు చెప్పిన ఆ టీమ్.. ఆతిథ్య జట్టును మరోమారు చిత్తు చేసింది.
Bangladesh Humiliate Pakistan: బంగ్లాదేశ్ జట్టు అన్నంత పని చేసింది. తమ ప్రతాపం చూపిస్తామంటూ పాకిస్థాన్ పర్యటనకు ముందు చెప్పిన ఆ టీమ్.. ఆతిథ్య జట్టును మరోమారు చిత్తు చేసింది.
Nidhan
బంగ్లాదేశ్ జట్టు అన్నంత పని చేసింది. తమ ప్రతాపం చూపిస్తామంటూ పాకిస్థాన్ పర్యటనకు ముందు చెప్పిన ఆ టీమ్.. ఆతిథ్య జట్టును మరోమారు చిత్తు చేసింది. రెండో టెస్టులో పాకిస్థాన్‌ను 6 వికెట్ల తేడాతో చిత్తు చేసింది బంగ్లాదేశ్. ఆ టీమ్ విసిరిన 185 పరుగుల టార్గెట్‌ను 4 వికెట్లు కోల్పోయి ఛేజ్ చేసేసింది. వరుసగా రెండో టెస్టులో విజయం సాధించిన బంగ్లా.. ఈ సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. తొలి టెస్టులో ఓడి తీవ్రంగా విమర్శలపాలైన ఆతిథ్య జట్టు.. ఇప్పుడు వైట్‌వాష్ అవడంతో మరిన్ని ట్రోల్స్‌ను ఎదుర్కోక తప్పదు. ఇక, సెకండ్ టెస్ట్‌లో బంగ్లాకు ఛేజింగ్ అంత ఈజీ కాలేదు. ఒక దశలో 127 పరుగులకు 3 వికెట్లు కోల్పోయిందా టీమ్.
పాక్ బౌలర్లు మహ్మద్ అలీ, అబ్రార్ అహ్మద్‌లు బంగ్లా బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. అయితే ఛేదించాల్సిన స్కోరు పెద్దగా లేకపోవడం, చేతిలో వికెట్లు ఉండటం, మంచి బ్యాటర్లు అందుబాటులో ఉండటంతో ఆ టీమ్ టెన్షన్ పడలేదు. ఓపెనర్ జాకీర్ హసన్ (40)తో పాటు నజ్ముల్ హొస్సేన్ షంటో (38) రాణించారు. 127/3తో ఉన్న టైమ్‌లో ఏదైనా మ్యాజిక్ జరుగుతుందేమోనని పాక్ ఆశించింది. కానీ బంగ్లా సీనియర్ ప్లేయర్లు ముష్ఫికుర్ రహీమ్ (22 నాటౌట్), షకీబ్ అల్ హసన్ (21 నాటౌట్) వాళ్లకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఇద్దరూ ఒక్కో రన్ తీస్తూ నిదానంగా టీమ్‌ను విజయతీరాలకు చేర్చారు. ఈ గెలుపుతో బంగ్లా ప్లేయర్లు సంబురాల్లో మునిగిపోగా.. మరో అవమానకర ఓటమి ఎదురవడంతో పాక్ ప్లేయర్లు నిరాశలో కూరుకుపోయారు.
గత కొన్నేళ్లుగా చెత్తాటతో పరువు తీసుకుంటున్న పాకిస్థాన్‌కు బంగ్లాదేశ్ చేతుల్లో వైట్‌వాష్ బిగ్ షాక్ అనే చెప్పాలి. ఆ టీమ్ సొంతగడ్డపై గెలుపు రుచి చూసి 1,303 రోజులు అవుతోంది. గత రెండున్నరేళ్ల కాలంలో సొంతగడ్డపై ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ చేతుల్లో టెస్ట్ సిరీస్‌లో ఓటమి పాలైంది. ఇంగ్లండ్ మీద టీ20 సిరీస్, న్యూజిలాండ్ చేతుల్లో వన్డే సిరీస్‌ను కోల్పోయింది. అలాగే వన్డే వరల్డ్ కప్‌లో ఆఫ్ఘానిస్థాన్ చేతుల్లో ఓడిపోయింది. టీ20 ప్రపంచ కప్‌లో పసికూన యూఎస్ఏ చేతుల్లో మట్టికరిచింది. ఒకప్పుడు దూకుడైన ఆటతీరుతో అపోజిషన్ టీమ్స్‌ను భయపెట్టిన పాక్.. ఇప్పుడు సొంతగడ్డపై బంగ్లా చేతుల్లో వైట్‌వాష్ అయింది. దీన్ని బట్టే ఆ టీమ్ ఆటతీరు పాతాళానికి పడిపోయిందని అర్థం చేసుకోవచ్చు. ఈ సిచ్యువేషన్ నుంచి ఆ జట్టు ఎలా బౌన్స్ బ్యాక్ అవుతుందో చూడాలి.
The banglawash of Bangladesh against Pakistan in Pakistan. pic.twitter.com/BCCyJRSCx5
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 3, 2024