భారత్​ను గెలికిన బంగ్లాదేశ్ కెప్టెన్! పాక్ అనుకున్నాడేమో.. వాయించి వదులుతారు!

PAK vs BAN, Najmul Hossain Shanto, Team India: సొంతగడ్డపై ఫేవరెట్​గా బరిలోకి దిగిన పాకిస్థాన్​ను బంగ్లాదేశ్ జట్టు చిత్తు చేసింది. వరుసగా రెండో టెస్టులో ఓడించి సిరీస్​ను క్లీన్​స్వీప్ చేసింది. అయితే గెలుపు జోష్​లో బంగ్లా కెప్టెన్ భారత్​కు వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

PAK vs BAN, Najmul Hossain Shanto, Team India: సొంతగడ్డపై ఫేవరెట్​గా బరిలోకి దిగిన పాకిస్థాన్​ను బంగ్లాదేశ్ జట్టు చిత్తు చేసింది. వరుసగా రెండో టెస్టులో ఓడించి సిరీస్​ను క్లీన్​స్వీప్ చేసింది. అయితే గెలుపు జోష్​లో బంగ్లా కెప్టెన్ భారత్​కు వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

సొంతగడ్డపై ఫేవరెట్​గా బరిలోకి దిగిన పాకిస్థాన్​ను బంగ్లాదేశ్ జట్టు చిత్తు చేసింది. వరుసగా రెండో టెస్టులో ఓడించి సిరీస్​ను క్లీన్​స్వీప్ చేసింది. పాక్ జట్టు విసిరిన 185 పరుగుల టార్గెట్​ను బంగ్లా అలవోకగా ఛేదించింది. ఒక దశలో 127 పరుగులకు 3 వికెట్లు కోల్పోవడంతో ఏదైనా మ్యాజిక్ జరుగుతుందేమోనని పాక్ భావించింది. కానీ బంగ్లా సీనియర్ ప్లేయర్లు ముష్ఫికర్ రహీమ్ (22 నాటౌట్), షకీబ్ అల్ హసన్ (21 నాటౌట్) ఆతిథ్య జట్టుకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఇంకో వికెట్ పడకుండా చూసుకున్నారు. ఒక్కో రన్ స్కోరు బోర్డు మీద చేరుస్తూ జట్టును కూల్​గా విజయతీరాలకు చేర్చారు. ఈ గెలుపుతో రెండు టెస్టుల సిరీస్​ను 2-0తో కైవసం చేసుకుంది బంగ్లాదేశ్. అయితే విజయం తర్వాత ఆ టీమ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ షంటో భారత్​కు వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

పాకిస్థాన్​ను చిత్తు చేశామనే జోష్​లో టీమిండియాకు హెచ్చరికలు జారీ చేశాడు బంగ్లా కెప్టెన్ షంటో. భారత్​తో సిరీస్​లోనూ తాము ఇలాగే ఆడతామని తెలిపాడు. పాక్​తో సిరీస్​లో రాణించిన మెహ్దీ హన్, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రాణిస్తే టీమిండియాను ఓటమి తప్పదన్నాడు. ‘భారత్​తో జరిగే తదుపరి సిరీస్ మాకు చాలా కీలకం. పాకిస్థాన్​పై గెలుపు మాలో నమ్మకాన్ని మరింత పెంచింది. ఈ సిరీస్​లో బాగా పెర్ఫార్మ్ చేసిన మెహ్దీ, షకీబ్, ముష్ఫికర్​లు భారత్​ మీద కూడా ఇరగదీస్తారని ఆశిస్తున్నా. ఆ సిరీస్​కు మేం పూర్తిగా సిద్ధంగా ఉన్నాం’ అని నజ్ముల్ షంటో చెప్పుకొచ్చాడు. టీమిండియాతో సిరీస్​కు రెడీగా ఉన్నామని చెప్పడం.. ఆ సిరీస్​లోనూ ఇదే రీతిలో ఆడతామని అనడంతో అతడి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్స్.. ఏంటి ఒక్క సిరీస్ విజయానికే ఇంత బిల్డప్ అవసరమా అని అంటున్నారు.

పాకిస్థాన్ అనుకున్నావా.. టీమిండియాతో పెట్టుకుంటే మామూలుగా ఉండదని, వాయించి వదిలిపెడతారని బంగ్లా కెప్టెన్​ షంటోకు వార్నింగ్ ఇస్తున్నారు నెటిజన్స్. బాల్ గింగిరాలు తిరిగే భారత స్పిన్ పిచెస్​పై నిలదొక్కుకొని పరుగులు చేయడం అంటే ఈజీ కాదని.. రోహిత్ సేన ముందు మీరు జూజూబీ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా లాంటి టాప్ టీమ్సే మెన్ ఇన్ బ్లూతో పెట్టుకోవని.. మీరెంత అంటూ సీరియస్ అవుతున్నారు. ఇక, భారత పర్యటనకు త్వరలో రానుంది బంగ్లా టీమ్. 2 టెస్టులతో పాటు 3 టీ20 మ్యాచ్​లు ఆడనుంది. సెప్టెంబర్ 19న చెన్నైలో జరిగే మొదటి టెస్టుతో ఈ టూర్ స్టార్ట్ కానుంది. చివరగా 2019లో భారత పర్యటనకు వచ్చిన బంగ్లా రెండు టెస్టుల సిరీస్​లో 0-2 తేడాతో వైట్​వాష్ అయింది. ఈసారి సిరీస్​ మొదలవడానికి ముందే భారత్​ను రెచ్చగొడుతున్నాడు బంగ్లా కెప్టెన్ షంటో.

Show comments