iDreamPost
android-app
ios-app

T20 World Cup: శ్రీలంకపై బంగ్లాదేశ్‌ విజయం.. భారత్‌-పాక్‌ను మించిపోతున్న రైవల్రీ?

  • Published Jun 08, 2024 | 10:09 AM Updated Updated Jun 08, 2024 | 10:09 AM

Bangladesh, Sri Lanka, BAN vs SL, T20 World Cup 2024: లంక జట్టును బంగ్లాదేశ్‌ ఓడించింది.. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో.. బంగ్లా విజయం సాధించింది. అయితే.. ఈ రెండు జట్ల మధ్య పోటీ.. ఇండియా, పాకిస్తాన్‌ను మించి పోతుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Bangladesh, Sri Lanka, BAN vs SL, T20 World Cup 2024: లంక జట్టును బంగ్లాదేశ్‌ ఓడించింది.. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో.. బంగ్లా విజయం సాధించింది. అయితే.. ఈ రెండు జట్ల మధ్య పోటీ.. ఇండియా, పాకిస్తాన్‌ను మించి పోతుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

  • Published Jun 08, 2024 | 10:09 AMUpdated Jun 08, 2024 | 10:09 AM
T20 World Cup: శ్రీలంకపై బంగ్లాదేశ్‌ విజయం.. భారత్‌-పాక్‌ను మించిపోతున్న రైవల్రీ?

టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో ఏం జరుగుతుందో కూడా అర్థం కానీ పరిస్థితి నెలకొంది. పాకిస్థాన్‌ను అమెరికా ఓడించింది, ‍న్యూజిలాండ్‌ను ఆఫ్ఘనిస్థాన్‌ ఓడించింది.. ఇప్పుడు శ్రీలంకను బంగ్లాదేశ్‌ మట్టికరిపించింది. పెద్ద టీమ్స్‌కు దడపుట్టిస్తూ.. చిన్న టీమ్స్‌ రెచ్చిపోయి ఆడుతున్నాయి. అమెరికాలోని డల్లాస్‌ వేదిక జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకపై బంగ్లదేశ్‌ 2 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో లంక ఓటమికి బ్యాటింగ్‌ ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. బంగ్లాదేశ్‌ బౌలింగ్‌ ఎటాక్‌ ముందు తలొంచిన శ్రీలంక కేవలం 124 పరుగుల స్వల్ప స్కోర్‌ చేసింది. ఓపెనర్‌ పథుమ్‌ నిస్సంకా ఒక్కడే 47 పరుగులతో రాణించాడు. మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలం అయ్యారు.

తక్కువ స్కోర్‌ను కాపాడుకునేందుకు లంక బౌలర్లు బాగానే కష్టపడినా.. లక్ష్యం మరీ చిన్నది అయిపోవడంతో.. పాపం బౌలర్లు కూడా మ్యాచ్‌ గెలిపించలేకపోయారు. బంగ్లాదేశ్‌ కూడా బ్యాటింగ్‌లో చాలా ఇబ్బంది పడినా.. చివరి ఎలాగోలా తడబడుతూ.. గట్టెక్కింది. అయితే.. శ్రీలంక, బంగ్లాదేశ్‌ జట్లు మధ్య రైవల్రీ.. ఇండియా-పాకిస్థాన్‌ రైవల్రీని మించి పోయేలా కనిపిస్తోంది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ అంటే శ్రీలంక ఆటగాళ్లు, లంకతో మ్యాచ్‌ అనగానే బంగ్లా ఆటగాళ్లు ప్రాణం పెట్టి ఆడుతున్నారు. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. ఓపెనర్‌ పథుమ్‌ నిస్సంకా 28 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్‌తో 47 పరుగులు చేశాడు. ధనంజయ డిసిల్వా 21 పరుగులు చేశాడు.

మిగతా బ్యాటర్లంతా విఫలం కావడంతో లంక తక్కువ స్కోర్‌కే అవుట్‌ అయింది. బంగ్లాదేశ్‌ బౌలర్లలో ముస్తఫీజుర్‌ 3, రిషాద్‌ హుస్సేన్‌ 3 వికెట్లతో రాణించారు. టస్కిన్‌ అహ్మద్‌ రెండు వికెట్లు తీశాడు. 125 పరుగులు స్వల్ప టార్గెట్‌తో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ ఆరంభంలో తడబడింది. 6 పరుగులకే ఓపెనర్లను కోల్పోయింది. కానీ, లిట్టన్‌ దాస్‌ 38 బంతుల్లో 36, తౌహిద్ 20 బంతుల్లో ఒక ఫోర్‌, 4 సిక్సులతో 40 పరుగులు చేసి రాణించారు. వీరిద్దరు మినహా మిగతా బ్యాటర్లంతా విఫలం య్యారు. చివర్లో మహ్మదుల్లా 13 బంతుల్లో 16 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. మొత్తానికి 19 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో నువాన్‌ తుషారా 4 వికెట్లతో రాణించినా.. లంకను గెలిపించలేకపోయాడు. మరి ఈ మ్యాచ్‌లో లంకపై బంగ్లాదేశ్‌ విజయం సాధించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.