వరల్డ్ కప్ ఎఫెక్ట్.. బాబర్ అజాం సంచలన నిర్ణయం! 

  • Author Soma Sekhar Published - 08:42 PM, Wed - 15 November 23

పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాం సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వన్డే వరల్డ్ కప్ లో పాక్ జట్టు ఘోర ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నాడు.

పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాం సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వన్డే వరల్డ్ కప్ లో పాక్ జట్టు ఘోర ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నాడు.

  • Author Soma Sekhar Published - 08:42 PM, Wed - 15 November 23

ప్రపంచ కప్ 2023లో పాకిస్థాన్ ఘోరమైన ప్రదర్శనతో ఇంటిదారి పట్టిన సంగతి తెలిసిందే. పాక్ ఆటగాళ్లు మూకుమ్మడిగా విఫలం కావడంతో.. పాక్ వరల్డ్ కప్ లో అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో దాయది దేశంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. సొంత ఆటగాళ్లే పాక్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ విమర్శల నేపథ్యంలో ఇంజమామ్ ఉల్ హక్, మోర్నీ మోర్కెల్ తమ కోచ్ పదవులకు రాజీనామా చేసిన సంగతి మనకు తెలియనిది కాదు. తాజాగా వరల్డ్ కప్ లో దారుణ వైఫల్యం తర్వాత పాక్ కెప్టెన్ బాబర్ అజాం సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాం సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వన్డే వరల్డ్ కప్ లో పాక్ జట్టు ఘోర ప్రదర్శనకు నైతిక బాధ్యత వహిస్తూ.. అన్ని ఫార్మాట్ల క్రికెట్ కి కెప్టెన్ గా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు బాబర్. “నేను తీసుకున్న నిర్ణయం చాలా కఠినమైనదని తెలుసు. కానీ తప్పడం లేదు. మూడు ఫార్మాట్లలో పాకిస్తాన్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. అయితే నేను తప్పుకోవడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నాను. కెప్టెన్ గా ఎవరు వచ్చినా.. వారికి నా పూర్తి సహకారం ఉంటుంది. చివరిగా నాకు సారథిగా అవకాశం ఇచ్చిన పాక్ బోర్డ్ కు ధన్యవాదాలు” అంటూ రాసుకొచ్చాడు బాబర్. కాగా.. 2019లో బాబర్ కెప్టెన్ గా పగ్గాలు చేపట్టాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పాక్ కు ఎన్నో విజయాలు అందించాడు. ఇక బాబర్ కెప్టెన్సీలోనే పాక్ వన్డేల్లో నెంబర్ 1గా అవతరించింది.

Show comments