iDreamPost
android-app
ios-app

బాబర్ కి తలనొప్పిగా మారిన కోహ్లీ! ఫ్యాన్స్ చేతే తిట్టిస్తూ!

  • Author Soma Sekhar Published - 03:37 PM, Sat - 21 October 23

పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజాం. ఎప్పుడూ కోహ్లీతో పోల్చుకుంటూ.. విరాట్ కంటే నేనే గొప్ప అని విర్రవీగుతూ ఉండేవాడు. కానీ ప్రస్తుతం అతడి ఫ్యాన్స్ చేతే తిట్టించుకుంటున్నాడు. దానికి కారణం కోహ్లీ కావడం గమనార్హం.

పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజాం. ఎప్పుడూ కోహ్లీతో పోల్చుకుంటూ.. విరాట్ కంటే నేనే గొప్ప అని విర్రవీగుతూ ఉండేవాడు. కానీ ప్రస్తుతం అతడి ఫ్యాన్స్ చేతే తిట్టించుకుంటున్నాడు. దానికి కారణం కోహ్లీ కావడం గమనార్హం.

  • Author Soma Sekhar Published - 03:37 PM, Sat - 21 October 23
బాబర్ కి తలనొప్పిగా మారిన కోహ్లీ! ఫ్యాన్స్ చేతే తిట్టిస్తూ!

‘ఎదిగే కొద్ది ఒదిగుండాలి’.. ఇది పెద్దలు చెప్పిన మాట. అలా కాదని మన టైమ్ బాగున్నప్పుడు ఎదుటివారిని విమర్శిస్తే.. మన టైమ్ బాలేనప్పుడు మనల్ని ప్రేమించే వారే తిట్టిపోస్తారు. ప్రస్తుతం ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజాం. ఎప్పుడూ కోహ్లీతో పోల్చుకుంటూ.. విరాట్ కంటే నేనే గొప్ప అని విర్రవీగుతూ ఉండేవాడు బాబర్. కానీ ప్రస్తుతం అతడి ఫ్యాన్స్ చేతే తిట్టించుకుంటున్నాడు. దానికి కారణం విరాట్ కోహ్లీ కావడం గమనార్హం. అదేంటి? బాబర్ ను సొంత ఫ్యాన్స్ తిట్టడానికి మన విరాట్ ఎందుకు కారణం అవుతాడని మీకు అనుమానం రావొచ్చు. కానీ దానికీ కొన్ని లెక్కలు ఉన్నాయి. ఆ లెక్కలే బాబర్ కు తిట్లు తినిపిస్తున్నాయి. ఈ వరల్డ్ కప్ లో బాబర్ కు కోహ్లీ టెన్షన్ పట్టుకుంది. మరి ఆ లెక్కెంటో ఇప్పుడు చూద్దాం.

బాబర్ అజాం.. పాకిస్థాన్ జట్టులో నిలకడైన ఆటగాడిన మంచి గుర్తింపే తెచ్చుకున్నాడు. ఈ గుర్తింపు కాస్త తలకెక్కించుకున్న అతడు.. తనని తాను విరాట్ కోహ్లీతో పోల్చుకుంటూ.. అతడి కంటే ఎక్కువే అని స్టేట్ మెంట్లు కూడా ఇచ్చాడు. కట్ చేస్తే వరల్డ్ కప్ ప్రారంభం అయ్యింది. మ్యాచ్ లు గడుస్తున్న కొద్ది కోహ్లీ టెన్షన్ బాబర్ కు పట్టుకుంది. విరాట్ కోహ్లీ రాణిస్తే చాలు.. బాబర్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నార పాక్ ఫ్యాన్స్. దానికి కారణం మీ అందరికి తెలిసిందే. ఇన్ని రోజులు కోహ్లీతో పోల్చుకున్నావ్.. అతడేమో వరల్డ్ కప్ లో అద్భుతంగా రాణిస్తుంటే.. నువ్వేమో దారుణంగా విఫలం అవుతున్నావ్ అంటూ బాబర్ ను అతడి ఫ్యాన్సే తిడుతున్నారు. ఇక నుంచైనా కోహ్లీతో పోల్చుకోవడం, అతడి కంటే ఎక్కువ అని స్టేట్ మెంట్స్ ఇచ్చుకోవడం మానేయాలని సోషల్ మీడియా వేదికగా సూచనలు కూడా ఇస్తున్నారు.

దీంతో బాబర్ కు వరల్డ్ కప్ లో విజయాలతో పాటుగా కోహ్లీ రూపంలో మరో టెన్షన్ చేరింది. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ లో అద్భుతంగా రాణిస్తున్నాడు కింగ్ విరాట్. ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో ఓ సెంచరీతో 259 పరుగులు చేసి రోహిత్ తర్వాత అత్యధిక పరుగులు చేసిన టీమిండియా ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం విరాట్ ఫామ్ ను చూస్తే.. వరల్డ్ కప్ లో మరిన్ని మెరుపు ఇన్నింగ్స్ లు చూడటం ఖాయమని చెబుతున్నారు క్రీడా పండితులు. ఇక ఇదే టోర్నీలో బాబర్ ఘోరంగా విఫలం అవుతూ వస్తూ.. తన ఫ్యాన్స్ చేతనే తిట్టించుకుంటున్నాడు. అతడు ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో కేవలం 83 పరుగులు మాత్రమే చేసి.. అభిమానుల ఆగ్రహానికి గురౌతున్నాడు. ఇప్పటికైనా.. కోహ్లీ లాంటి ఆటగాడితో పోల్చుకోవడం, గొప్పలు చెప్పుకోవడం ఆపేయమంటూ.. బాబర్ కు సలహాలు కూడా ఇస్తున్నారు ఫ్యాన్స్. మరి బాబర్ కు వరల్డ్ కప్ లో కోహ్లీ కొత్త తలనొప్పిగా మారాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.