విరాట్ కోహ్లీ.. ప్రస్తుతం వరల్డ్ క్రికెట్ లో రికార్డుల మీద రికార్డులు బద్దలు కొట్టేది ఎవరు అంటే వచ్చే సమాధానం. మరి అలాంటి రన్ మెషిన్ కే సాధ్యం కాని రికార్డును సాధించాడు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్. ఇప్పటికే ప్రపంచ క్రికెట్ లో పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్న బాబర్.. మరో ఘనతను సాధించాడు. అంతర్జాతీయ వన్డేల్లో ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు. ఈ జాబితాలో టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ 9వ స్థానంలో ఉండటం గమనార్హం. మరి ఇంతకీ బాబర్ సాధించిన ఆ రికార్డు ఏంటో ఇప్పుడు చూద్దాం.
బాబర్ అజామ్.. పాకిస్థాన్ క్రికెట్ పైనే కాకుండా వరల్డ్ క్రికెట్ పై తనదైన ముద్రను వేస్తున్నాడు. ఎన్నో విమర్శలకు, ట్రోల్స్ గురౌతున్నా కూడా తన ఫామ్ ను మాత్రం కొనసాగిస్తూనే ఉన్నాడు. తాజాగా ఆఫ్ఘానిస్థాన్ తో జరిగిన రెండో వన్డేలో 53 పరుగులతో రాణించాడు. ఇక ఇది అతడికి వందో ఇన్నింగ్స్ కావడం విశేషం. ఈ మ్యాచ్ లో 53 పరుగులు చేయడం ద్వారా ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు పాక్ సారథి. బాబర్ తన 100 వన్డే ఇన్నింగ్స్ లలో 5,142 పరుగులు సాధించాడు.
కాగా.. ఈ రికార్డు ఇప్పటి వరకు దక్షిణాఫ్రికా లెజెండ్ హసీం ఆమ్లా పేరిట ఉంది. అతడు తన 100 వన్డే ఇన్నింగ్స్ లలో 4,946 రన్స్ చేశాడు. తాజా మ్యాచ్ ద్వారా బాబర్ ఈ రికార్డ్ ను బ్రేక్ చేశాడు. కాగా ఈ రికార్డు సాధించిన తొలి క్రికెటర్ గా బాబర్ ఘనతకెక్కాడు. ఇక ఈ అరుదైన జాబితాలో బాబర్ తర్వాత వరుసగా హసీం ఆమ్లా, విండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్(4607), విండీస్ సారథి షై హోప్(4436), జో రూట్(4428) ఉన్నారు. ఇక ఈ లిస్ట్ లో విరాట్ కోహ్లీ 4230 పరుగులతో 9వ స్థానంలో ఉన్నాడు. అయితే విరాట్ సాధించిన రికార్డుల ముందు నీ రికార్డు ఎంత అంటూ బాబర్ ను సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.
Babar Azam at the top….!!!
– Most runs in ODI history in the first 100 innings. pic.twitter.com/GXZjR5ujAL
— Johns. (@CricCrazyJohns) August 24, 2023
ఇదికూడా చదవండి: కోహ్లీకి గట్టి వార్నింగ్ ఇచ్చిన బీసీసీఐ! ఏం తప్పు చేశాడంటే?