Nidhan
పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం పరువు మళ్లీ పోయింది. ప్రతి దానికి విరాట్ కోహ్లీతో కంపేర్ చేసుకునే బాబర్‌కు ఈ దెబ్బకు మైండ్ బ్లాంక్ అయింది.
పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం పరువు మళ్లీ పోయింది. ప్రతి దానికి విరాట్ కోహ్లీతో కంపేర్ చేసుకునే బాబర్‌కు ఈ దెబ్బకు మైండ్ బ్లాంక్ అయింది.
Nidhan
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం ఏదో ఒక విధంగా నిత్యం వార్తల్లో నిలుస్తాడు. గేమ్ కంటే కూడా తన యాక్షన్స్తోనే అతడు వైరల్ అవుతుంటాడు. చిన్న జట్ల మీద తన బ్యాట్ ప్రతాపం చూపించే బాబర్.. పెద్ద జట్లపై, అలాగే కీలక మ్యాచుల్లో చేతులెత్తేస్తుంటాడు. అయినా పాకిస్థాన్ అభిమానులు మాత్రం అతడికి బాగా హైప్ ఇస్తుంటారు. అంతేగాక ఏకంగా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో బాబర్‌ను కంపేర్ చేస్తుంటారు. అయితే ఫిట్నెస్, బ్యాటింగ్ స్కిల్స్, రికార్డ్స్.. ఇలా ఏ విధంగా చూసుకున్నా కోహ్లీ ముందు బాబర్ జూజూబీ అని క్రికెట్ అనలిస్టులు అంటుంటారు. అలాంటి బాబర్ మరోమారు పరువు పోగొట్టుకున్నాడు. అతడికి జరిగిన దాని గురించి తెలిస్తే.. ఒరేయ్ ఆజామూ ఇంతకంటే దారుణం ఉండదని ఎవరైనా అనాల్సిందే.
పాక్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం, వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్‌కు ఘోర అవమానం ఎదురైంది. ఇంగ్లండ్ ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్ అయిన ‘ది హండ్రెడ్’లో వరుసగా మూడోసారి వీళ్లిద్దరూ అన్‌సోల్డ్‌గా మిగిలిపోయారు. ది హండ్రెడ్ లీగ్-2024 సీజన్ డ్రాఫ్ట్‌లో బాబర్, రిజ్వాన్‌ను సొంతం చేసుకోవడానికి ఒక్కటంటే ఒక్క ఫ్రాంచైజీ కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. దీంతో వీళ్లు అమ్ముడుపోకుండా అలాగే మిగిలిపోయారు. ఈ ఇద్దరు పాక్ స్టార్లతో పాటు ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, ఇంగ్లండ్ బ్యాటర్ జేసన్ రాయ్, ఆసీస్ యంగ్ సెన్సేషన్ టిమ్ డేవిడ్ కూడా అన్‌సోల్డ్‌గా ఉండటం గమనార్హం. బాబర్, రిజ్వాన్‌ను ఎవరూ పట్టించుకోనప్పటికీ వాళ్ల సహచర ఆటగాళ్లు షాహీన్ ఆఫ్రిది, ఇమాద్ వసీం, నసీం షా మాత్రం డ్రాఫ్ట్‌లో అమ్ముడుపోవడం విశేషం. షాహిన్‌ను లక్ష పౌండ్లకు వెల్ష్ ఫైర్ ఫ్రాంచైజీ దక్కించుకుంది.
లాస్ట్ సీజన్లో కూడా షాహిన్ ఆఫ్రిదీ వెల్ష్ ఫైర్ ఫ్రాంచైజీకే ఆడాడు. ఇమాద్ వసీంను ట్రెంట్ రాకెట్స్ టీమ్ సొంతం చేసుకుంది. నసీం షాను బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ ఫ్రాంచైజీ దక్కించుకుంది. ది హండ్రెడ్ డ్రాఫ్ట్‌లో విండీస్ క్రికెటర్స్‌కు భారీ డిమాండ్ నెలకొంది. ఆండ్రీ రస్సెల్, నికోలస్ పూరన్, హెట్మెయిర్ లాంటి కరీబియన్ స్టార్లు ఫస్ట్ రౌండ్లోనే అమ్ముడుపోయారు. పూరన్‌ను నార్తర్న్ సూపర్ ఛార్జర్స్ సొంతం చేసుకుంది. రస్సెల్, హెట్‌మెయిర్‌ను లండన్ స్పిరిట్ దక్కించుకుంది. మరోవైపు విమెన్స్ ది హండ్రెడ్ లీగ్‌లో టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అన్‌సోల్డ్‌గా మిగిలిపోయింది. అయితే స్మృతి మంధాన, రిచా ఘోష్ మాత్రం డ్రాఫ్ట్‌లో సెలక్ట్ అయ్యారు. స్మృతిని సదరన్ బ్రేక్ సొంతం చేసుకుంది. రిచాను బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ దక్కించుకుంది. మరి.. బాబర్ ఇంకోసారి పరువు పోగొట్టుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: RCB బలం, బలహీనతలు! అమ్మాయిల నుంచి స్ఫూర్తి పొందుతారా?
Babar Azam, Mohammad Rizwan and Jason Roy remain unsold in ‘The Hundred’ draft. pic.twitter.com/XHjgUe53tn
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 21, 2024