SNP
Moin Khan, Azam Khan, Pakistan: పాకిస్థాన్ హల్క్ ఆజమ్ ఖాన్ గురించి చాలా మందికి తెలిసి ఉంటుంది. కానీ, వాళ్ల నాన్న ఇతని కంటే వరెస్ట్ ప్లేయర్ అనే విషయం చాలా మంది తెలియకపోవచ్చు. అతని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
Moin Khan, Azam Khan, Pakistan: పాకిస్థాన్ హల్క్ ఆజమ్ ఖాన్ గురించి చాలా మందికి తెలిసి ఉంటుంది. కానీ, వాళ్ల నాన్న ఇతని కంటే వరెస్ట్ ప్లేయర్ అనే విషయం చాలా మంది తెలియకపోవచ్చు. అతని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
SNP
పాకిస్థాన్ యువ క్రికెటర్ ఆజమ్ ఖాన్ ఈ మధ్య విపరీతమైన ట్రోలింగ్‌కి గురి అవుతున్నాడు. సులువైన క్యాచ్‌లు వదిలేయడం, బౌలర్లు వేసే బౌన్సర్లకు భయపడి వికెట్ సమర్పించుకోవడం లాంటి ఘటనతో టీ20 వరల్డ్ కప్ 2024 ప్రారంభంలోనే ఆజమ్ ఖాన్ ఒక రేంజ్ ట్రోలింగ్‌కు గురయ్యాడు. పాకిస్థాన్ హల్క్‌గా పేరు తెచ్చుకున్న ఈ భారీ కాయుడు.. టీ20 వరల్డ్ కప్ కంటే ముందు ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్టార్ బౌలర్ మార్క్ వుడ్ ఇన్నింగ్స్ 11వ ఓవర్‌లో సర్‌ప్రైజింగ్ బౌన్సర్‌కు ఆజమ్ ఖాన్ బిత్తరపోయాడు. ఊహించని బౌన్సర్‌తో షాక్ అయిన ఆజమ్ ఖాన్.. ఆ బాల్ నుంచి తప్పించుకోవడానికి ఒక్కసారిగా వెనక్కి జరిగాడు. ఆ సమయంలో బాల్ అతని గ్లౌజ్‌లకు తాకడం.. వికెట్ కీపర్ ఆ బాల్‌ను అద్భుతంగా అందుకోవడంతో.. ఆజమ్ ఖాన్ ఇన్నింగ్స్‌కు తెలపడింది. ఈ అవుట్‌పై అతనిపై ట్రోలింగ్ జరిగింది. ఆజమ్ ఖాన్‌ది చెత్త ఆట అంటూ క్రికెట్ అభిమానులు అంటున్నారు.. అయితే ఆ ఆజమ్ ఖాన్ తండ్రి ఇంకా చెత్త ప్లేయర్ అనే విషయం చాలా మందికి తెలిసి ఉండదు. 200లకి పైగా వన్డేలు ఆడి ఒక్క సెంచరీ కూడా లేని వరెస్ట్ బ్యాటర్‌గా పేరు తెచ్చకున్న పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మొయిన్ ఖాన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
మొయిన్ ఖాన్ 1990 నుంచి 2004 వరకు పాకిస్థాన్‌కు ప్రాతినిథ్యం వహించిన వికెట్ కీపర్ కమ్ బ్యాటర్. 1990 నవంబర్ 13న వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మొయిన్ ఖాన్.. 2004 అక్టోబర్ 20న శ్రీలంకతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌తో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. 14 ఏళ్ల తన సుదీర్ఘ కెరీర్‌లో మొయిన్ ఖాన్ 69 టెస్టులు, 219 వన్డేలు ఆడాడు. 219 వన్డేలు ఆడే మాటలు కాదు. అన్ని వన్డేలు ఆడిన ఆటగాళ్లు దిగ్గజ క్రికెటర్లుగా, లెజెండరీ ప్లేయర్లుగా రిటైర్ అవుతారు. కానీ, మొయిన్ ఖాన్ మాత్రం.. ఓ చెత్త క్రికెటర్‌గా క్రికెట్ చరిత్రలో నిలిచిపోయాడు. దొంగ క్యాచ్‌లు పడుతూ.. స్పోర్ట్స్ మెన్ స్పిరిట్‌కే మచ్చ తెచ్చిన ప్లేయర్‌గానూ మొయిన్ ఖాన్ చెత్త పేరును సంపాదించుకున్నాడు. అలాగే వన్డే కెరీర్‌లో ఒక్కటంటే ఒక్క సెంచరీ కూడా లేకుండా ఏకంగా 219 వన్డేలతో పాటు 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ ఎలా కొనసాగించాడో అప్పటికీ, ఇప్పటికీ ఎవరికీ అర్థం కానీ ప్రశ్న. 219 వన్డేల్లో 183 ఇన్నింగ్స్‌లు ఆడాడు. కేవలం 23 యావరేజ్‌తో 3266 పరుగులు మాత్రమే చేశాడు. అందులో కేవలం 12 హాఫ్ సెంచరీలు, సున్నా సెంచరీలు.
అత్యధిక వన్డేలు ఆడిన తక్కువ పరుగులతో పాటు ఒక్క సెంచరీ కూడా లేని ప్లేయర్ల లిస్ట్ చూసుకుంటే.. మొయిన్ ఖాన్ పేరు కనిపిస్తుంది. మరి కొంత మంది క్రికెటర్ల పేర్లు ఆ లిస్ట్‌లో ఉన్నా.. వాళ్లంతా దిగ్గజ బౌలర్లు. బౌలర్ల నుంచి సెంచరీలు ఆశించడం కరెక్ట్ కాదు. కానీ, ఒక వికెట్ కీపర్ కమ్ బ్యాటర్‌గా టీమ్‌లో 14 ఏళ్ల పాటు ఉండి 219 వన్డేలు ఆడిన ప్లేయర్ నుంచి కనీసం ఒక్క సెంచరీ అయినా ఆశించడం పెద్ద విశేషం కాదు. కానీ, 219 వన్డేలు ఆడిన మొయిన్ ఖాన్ ఖాతాలో ఒక్కటంటే ఒక్క సెంచరీ కూడా లేదు. వసీం అక్రమ్ 356 వన్డేలు ఆడినా.. అతను బౌలర్, అలాగే న్యూజిలాండ్ ఆటగాడు డానియల్ వెట్టోరి కూడా బౌలింగ్ ఆల్‌రౌండర్, శ్రీలంక పేసర్ చమింద వాస్ కూడా బౌలరే.
వీళ్లంతా వందల వన్డేలు ఆడి సెంచరీ చేయని వారే కానీ.. వాళ్లంతా క్వాలిటీ బ్యాటర్లు కాదు. అలాగే పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ హక్ సైతం 162 వన్డేలు ఆడిన ఒక్క సెంచరీ కూడా చేయలేదు. కానీ, అతను 43.40 యావరేజ్‌తో 5122 పరుగులు చేశాడు. అతని ఖాతాలో 42 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సెంచరీ లేకపోయినా.. మిస్బా పాకిస్థాన్ కోసం ఎన్నో మ్యాచ్ విన్నింగ్స్‌లు ఆడాడు. పైగా కెప్టెన్ పాకిస్థాన్‌ను అత్భుతంగా నడిపించాడు. కానీ, మొయిన్ ఖాన్ అలా కాదు.. టీమ్‌లో పాతుకుపోయి.. టీమ్‌కు భారంగా ఏళ్ల పాటు లాక్కొచ్చాడు. ఇప్పుడు అతని కొడుకు కూడా టీమ్‌లో చోటు అయితే దక్కించుకుంటున్నాడు కానీ, టీమ్ కోసం మాత్రం పెద్దగా చేసింది ఏం లేదు. మరి ఈ తండ్రి కొడుకులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Moin khan k pair k beech se ball jati thi aur aankhein band… iske muh k pass se ball gyi aur aankhein band… like father like son.. pic.twitter.com/ftR9LoLcUY
— Ujjwal Nigam (@dr_ujjwal) May 30, 2024
An absolute rocket from Mark Wood to dismiss Azam Khan. pic.twitter.com/8F3hpSoIwW
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 30, 2024