Axar Patel: అక్క ఫోన్‌ చేసి.. ఆ విషయం చెప్పేసరికి వణికిపోయా: అక్షర్‌ పటేల్‌

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ అక్షర్‌ పటేల్‌ను తెగ కంగారు పెట్టిన ఒక విషయం గురించి తాజాగా వెల్లడించాడు. ఒక రకంగా చెప్పాలంటే.. ఆ విషయం విన్న సమయంలో అతను వణికిపోయాడంటా.. మరి అక్షర్‌ను అంతగా కంగారు పెట్టిన ఆ విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ అక్షర్‌ పటేల్‌ను తెగ కంగారు పెట్టిన ఒక విషయం గురించి తాజాగా వెల్లడించాడు. ఒక రకంగా చెప్పాలంటే.. ఆ విషయం విన్న సమయంలో అతను వణికిపోయాడంటా.. మరి అక్షర్‌ను అంతగా కంగారు పెట్టిన ఆ విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

అక్షర్‌ పటేల్‌ గాయం కారణం వన్డే వరల్డ్‌ కప్‌ 2023 ఆడే గోల్డెన్‌ ఛాన్స్‌ను మిస్‌ చేసుకున్న క్రికెటర్‌. వరల్డ్‌ కప్‌ కంటే ముందు జట్టులో ఉండి, మంచి ప్రదర్శనలు కనబర్చాడు. వరల్డ్‌ కప్‌ టీమ్‌ కోసం ప్లాన్స్‌లో ఉన్న ఆటగాడు. కానీ, సడెన్‌గా గాయం కారణంగా వరల్డ్‌ కప్‌కు దూరం అయ్యాడు. నేషనల్‌ టీమ్‌లో కెరీర్‌ అలా సాగుతుంటే.. ఐపీఎల్‌లో మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ ప్లేయర్‌గానే ఉన్నాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్నాడు. ఐపీఎల్‌ 2024 సీజన్‌ కోసం వెయిట్‌ చేస్తున్నాడు అక్షర్‌. ఈ క్రమంలో తన టీమ్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌కు గతేడాది జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై అక్షర్‌ స్పందించాడు.

పంత్‌కు ప్రమాదం జరిగిన గురించి, అలాగే తనకు ఆ విషయం ఎలా తెలిసిందో వివరిస్తూ.. అక్షర్‌ కాస్త ఎమోషన్‌ అయ్యాడు. పంత్‌కు ప్రమాదం టైమ్‌లో తాను ఎలా రియాక్ట్‌ అయ్యాడో అక్షర్‌ మాటాల్లోనే.. ‘ఆ రోజు ఉదయం ఏడు గంటల సమయంలో నాకు మా అక్క ఫోన్ చేసింది. రిషభ్ పంత్‌తో నువ్వు చివరిసారిగా ఎప్పుడూ మాట్లాడావు? అని ప్రశ్నించింది. ముందు రోజే మాట్లాడాలని ప్రయత్నించినా కుదరలేదని చెప్పాను. వెంటనే పంత్ అమ్మగారి ఫోన్ నంబర్ ఉంటే పంపించమని అడిగింది. ఎందుకు అని అడిగితే.. పంత్‌కు యాక్సిడెంట్‌ అయిందని చెప్పింది. ఆ మాట వినగానే నాకు వణుకు మొదలైంది. అదో షాకింగ్‌ ఘటన.’ అని అక్షర్ చెప్పుకొచ్చాడు.

ఏడాది క్రితం సరిగ్గా ఈ రోజుల్లోనే కొత్త ఏడాది తమ కుటుంబ సభ్యులకు స‌ర్‌ప్రైజ్ ఇద్దామని సమాచారం ఇవ్వకుండా ఢిల్లీ నుంచి సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ తన లగ్జరీ కారులో వెళ్లిన పంత్‌.. ఢిల్లీ-రూర్కీ హైవేపై ప్రమాదానికి గురయ్యాడు. చాలా వేగంగా దూసుకొచ్చిన కారు.. డివైడర్‌ను ఢీ కొట్టింది. దాంతో కారులో మంటలు అంటుకున్నాయి. అదృష్టవశాత్తు పంత్‌ ఎలాగోలా కారు నుంచి బయటికి వచ్చాడు. స్థానికులు రక్షించడంతో పంత్‌ ప్రాణాలతో బయటపడ్డాడు. కారు మంటల్లో కాలి బుడిదయిపోయింది. ఈ ప్రమాదం అనంతరం పంత్ మొకాలికి సర్జరీ జరిగింది. గాయాల నుంచి పూర్తిగా కోలుకుని.. తిరిగి గ్రౌండ్‌లోకి దిగేందుకు పంత్‌ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అయితే పంత్‌ గురించి ఢిల్లీ క్యాపిటల్స్‌ రూపొందించిన ఓ వీడియో అక్షర్‌ ఈ విధంగా ఎమోషనల్‌ అయ్యాడు. మరి పంత్‌కు జరిగిన ప్రమాదంతో పాటు అక్షర్‌ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments