Somesekhar
టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను 5 రికార్డులు ఊరిస్తున్నాయి. రెండో టెస్ట్ లో అశ్విన్ చెలరేగితే ఈ ఐదు రికార్డులు బద్దలు అవ్వడం ఖాయం. మరి అశ్విన్ ను ఊరిస్తున్న ఆ 5 రికార్డులు ఏంటో ఇప్పుడు చూద్దాం.
టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను 5 రికార్డులు ఊరిస్తున్నాయి. రెండో టెస్ట్ లో అశ్విన్ చెలరేగితే ఈ ఐదు రికార్డులు బద్దలు అవ్వడం ఖాయం. మరి అశ్విన్ ను ఊరిస్తున్న ఆ 5 రికార్డులు ఏంటో ఇప్పుడు చూద్దాం.
Somesekhar
విశాఖపట్నం వేదికగా ఇండియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య శుక్రవారం(ఫిబ్రవరి 2) నుంచి రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. ఇందుకోసం ఇరు జట్లు సన్నద్దం అయ్యాయి. తమ తమ ప్లాన్స్ తో బరిలోకి దిగబోతున్నాయి. అయితే ఇరు జట్లు కూడా నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని చూస్తున్నాయి. ఇక ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను సమయం చేయాలని టీమిండియా భావిస్తుండగా.. ఇంగ్లాండ్ ఈ పోరులో కూడా విజయం సాధించి, సిరీస్ లో మరింత ముందుకు దూసుకెళ్లాలని ఆరాటపడుతోంది. ఇదిలా ఉండగా.. టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను 5 రికార్డులు ఊరిస్తున్నాయి. రెండో టెస్ట్ లో అశ్విన్ చెలరేగితే ఈ ఐదు రికార్డులు బద్దలు అవ్వడం ఖాయం. మరి అశ్విన్ ను ఊరిస్తున్న ఆ 5 రికార్డులు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఇంగ్లాండ్ తో జరగనున్న రెండో టెస్ట్ కు ముందు టీమిండియాకు షాకుల మీద షాకులు తగిలాయి. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలు గాయాల పాలైన సంగతి తెలిసిందే. అయితే రాహుల్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉండగా.. జడేజా మాత్రం గాయం పెద్దది కావడంతో ఈ మ్యాచ్ కు దూరం అయ్యాడు. దీంతో సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ పై మరింత భారం పడింది. టీమిండియా స్పిన్ దళానికి అశ్విన్ సారథ్యం వహించనున్నాడు. ప్రస్తుతం టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు ఈ వెటరన్ బౌలర్. దీంతో అశ్విన్ పై ఒత్తిడి మరింత పెరిగిందనే చెప్పాలి.
ఈ క్రమంలోనే స్టార్ స్పిన్నర్ అశ్విన్ ముందు 5 రికార్డులు ఉన్నాయి. విశాఖ వేదికగా జరిగే టెస్ట్ లో ఈ రికార్డులు బద్దలు అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. తొలి టెస్ట్ లో 6 వికెట్లు పడగొట్టి పలు ఘనతలను తన ఖాతాలో వేసుకున్న అశ్విన్ మరో ఐదు రికార్డులను తన పేరిట లిఖించుకోవడానికి సిద్దమైయ్యాడు. ఇంతకీ ఆ రికార్డులు ఏంటంటే? ఇంగ్లాండ్ పై అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన ఇడియన్ బౌలర్ గా అవతరించడానికి అశ్విన్ మరో 3 వికెట్ల దూరంలో ఉన్నాడు. అతడు ఇప్పటి వరకు ఇంగ్లాండ్ పై 20 టెస్ట్ లు ఆడి 93 వికెట్లు పడగొట్టాడు. 23 టెస్టుల్లో 95 వికెట్లతో టీమిండియా మాజీ ఆటగాడు భగవత్ చంద్రశేఖర్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మరో 3 వికెట్లు తీస్తే.. ఈ రికార్డు బద్దలు అవుతుంది.
ఇక టెస్ట్ క్రికెట్ లో 500 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన రెండో ఇండియన్ బౌలర్ గా, ఓవరాల్ గా తొమ్మిదో బౌలర్ గా అవతరించడానికి కేవలం 4 వికెట్ల దూరంలోనే ఉన్నాడు. ఇప్పటి వరకు 96 టెస్ట్ ల్లో 496 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ లో 4 వికెట్లు తీస్తే.. అత్యంత వేగంగా 500 వికెట్లు తీసిన తొలి ఇండియన్ బౌలర్ గా, ఓవరాల్ గా రెండో ఫాస్టెస్ట్ బౌలర్ గా ఘతనకెక్కుతాడు. ఈ ఘనతలతో పాటుగా ఈ మ్యాచ్ లో 7 వికెట్లు తీస్తే.. భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్టుల్లో 100 వికెట్లు తీసిన తొలి భారతీయ బౌలర్ గా చరిత్ర సృష్టిస్తాడు.
ఈ లిస్ట్ లో ఇంగ్లాండ్ ప్లేయర్ జేమ్స్ అండర్సన్ 139 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక భారత గడ్డపై అత్యధిక వికెట్లు తీసిన తొలి బౌలర్ గా అవతరించడానికి అశ్విన్ కు ఎనిమిది వికెట్లు అవసరం. ఈ లిస్ట్ లో కూబ్లే 350 వికెట్లతో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. కాగా.. చివరిదైన ఐదో రికార్డు ఏంటంటే? అశ్విన్ ఇప్పటి వరకు 34 సార్లు ఐదు వికెట్లు తీశాడు. భారత్ తరఫున 35 సార్లు ఐదు వికెట్లు తీసి తొలి స్థానంలో ఉన్నాడు అనిల్ కుంబ్లే. ఈ టెస్ట్ లో అశ్విన్ ఈ రికార్డును కూడా బద్దలు కొట్టే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ మ్యాచ్ లో అశ్విన్ ఈ రికార్డులను బద్దలు కొడతాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.