iDreamPost
android-app
ios-app

రెండో టెస్ట్ లో ఆస్ట్రేలియా విజయం! ఇండియా నేర్చుకోవాల్సిన పాఠం ఇది!

  • Published Mar 11, 2024 | 2:55 PM Updated Updated Mar 11, 2024 | 2:55 PM

న్యూజిలాండ్ తో జరిగిన రెండో టెస్ట్ లో విజయం సాధించిన ఆస్ట్రేలియా నుంచి భారత జట్టు నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం ఉంది. ఆ పాఠం ఏంటి? వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోవడానికి ఇది కూడా ఓ కారణం అంటున్నారు క్రీడా పండితులు. పూర్తి వివరాల్లోకి వెళితే..

న్యూజిలాండ్ తో జరిగిన రెండో టెస్ట్ లో విజయం సాధించిన ఆస్ట్రేలియా నుంచి భారత జట్టు నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం ఉంది. ఆ పాఠం ఏంటి? వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోవడానికి ఇది కూడా ఓ కారణం అంటున్నారు క్రీడా పండితులు. పూర్తి వివరాల్లోకి వెళితే..

రెండో టెస్ట్ లో ఆస్ట్రేలియా విజయం! ఇండియా నేర్చుకోవాల్సిన పాఠం ఇది!

ఇంగ్లండ్ తో జరిగిన 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను టీమిండియా 4-1తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వరుసగా నాలుగు టెస్ట్ లో విజయం సాధించాం కాబట్టి.. టీమ్ లో ఏం లోపాలు లేవు అనుకుంటే, అది పెద్ద పొరపాటే అవుతుంది. అపజయాల నుంచే కాదు.. విజయాలు సాధించిన తర్వాత కూడా సింహావలోకనం చేసుకోవాలి. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే? మన టీమ్ లో ఏం లోపాలు ఉన్నాయి? వాటిని ఎలా సరిచేసుకోవాలి? అన్న విషయాలు మనకు తెలుస్తాయి. తాజాగా న్యూజిలాండ్ తో జరిగిన రెండో టెస్ట్ లో విజయం సాధించిన ఆస్ట్రేలియా నుంచి భారత జట్టు నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం ఉంది. ఆ పాఠం ఏంటి? ఓసారి పరిశీలిద్దాం పదండి.

ఓటమి నుంచే కాదు గెలుపు నుంచి కూడా పాఠాలు నేర్చుకున్నప్పుడే అత్యున్నత స్థాయిలో ఉండగలం. అయితే ఆ విజయం మనమే సాధించాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో ఏ జట్టైన సాధించొచ్చు. టీమిండియాకు ఇప్పుడు పాఠం నేర్చుకునే టైమ్ వచ్చింది. ఓవల్ వేదికగా జరిగిన రెండో టెస్ట్ లో న్యూజిలాండ్ పై ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా రెండు టెస్ట్ లకు గెలుచుకుని సిరీస్ ను కైవసం చేసుకుంది. ఇందులో ఏముంది గొప్ప? అన్న డౌట్ మీకు రావొచ్చు.. కానీ ఈ మ్యాచ్ జరిగిన తీరును క్షుణ్ణంగా పరిశీలిస్తే.. ఈ మ్యాచ్ లో ఆసీస్ గెలవడానికి, టీమిండియా వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోవడానికి కరాణం ఒక్కటే కనిపిస్తుంది.

ఈ టెస్ట్ లో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో 162, రెండో ఇన్నింగ్స్ లో 372 పరుగులు చేసింది. అనంతరం ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్ లో 256 పరుగులు చేసింది. తర్వాత 278 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 34 రన్స్ కే 4 కీలకమైన వికెట్లను కోల్పోయింది. స్టార్ బ్యాటర్లు అయిన స్టీవ్ స్మిత్, మార్నస్ లబూషేన్, ఉస్మాన్ ఖవాజా, కామెరూన్ గ్రీన్ పెవిలియన్ చేరారు. దీంతో పీకల్లోతు కష్టాల్లో పడింది ఆసీస్. అయితే ఇక్కడే కంగారూ బ్యాటర్లు తమ అనుభవాన్ని అంతా ఉపయోగించారు. తర్వాత వచ్చిన బ్యాటర్లు మిచెల్ మార్ష్(80), అలెక్స్ కేరీ(98*) అద్భుతమైన పోరాటం చేశారు. ఒత్తిడిలో సైతం బాధ్యాతయుతంగా పరిస్థితులను బట్టి జట్టుకు విజయాన్ని అందించారు.

34 రన్స్ కే 4 వికెట్లు కోల్పోయిన దశ నుంచి 278 పరుగులను ఛేదించింది అంటే.. ఆటగాళ్లు ఎంత పరిణితి చూపించారో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ గెలుపు నుంచి టీమిండియా గుణపాఠం నేర్చుకోవాలని క్రీడా పండితులు పేర్కొంటున్నారు. భారత జట్టులో ఆస్ట్రేలియా ప్లేయర్లు చూపిస్తున్న నిలకడ కొరవడింది. టీమ్ లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి ఎంతో మంది స్టార్లు ఉన్నాగానీ.. ఎవరి ఆట వారిదే. అసలు జట్టుకు ఏం కావాలో తెలుసుకోలేక కీలక మ్యాచ్ ల్లో చేతులెత్తేస్తున్నారు. గత వరల్డ్ కప్ 2023 ఫైనల్లో జరిగింది కూడా ఇదే. టీమిండియా నిర్దేశించిన 240 పరుగుల టార్గెట్ ను ఛేదించే క్రమంలో 47 రన్స్ కే 3 వికెట్లను కోల్పోయింది ఆసీస్.

కానీ ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుని టీమిండియాకు వరల్డ్ కప్ ను దూరం చేసింది. ఇలా క్లిష్టపరిస్థితుల నుంచి మ్యాచ్ ను ప్రత్యర్థి నుంచి లాగేసుకోవడం ఇదే మెుదటిసారి కాదు. గతంలో చాలాసార్లు ఆసీస్ బ్యాటర్లు ఇలాంటి విజయాలను సమష్టిగా టీమ్ కు అందించారు. ఇలాంటి సమష్టితత్వమే టీమిండియాలో లోపించింది. ఎవరికి వారే కాకుండా.. జట్టుకు ఏం కావాలో తెలుసుకుని ఆడినప్పుడే ప్రయోజనం ఉంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరి ఆస్ట్రేలియా సాధించిన ఈ విజయం నుంచి నిజంగానే టీమిండియా పాఠం నేర్చుకోవాలా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: IPL 2024.. రిషబ్ పంత్ రీ ఎంట్రీపై NCA కీలక అప్డేట్!