iDreamPost

IPL 2024.. రిషబ్ పంత్ రీ ఎంట్రీపై NCA కీలక అప్డేట్!

మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ బ్యాటర్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది నేషనల్ క్రికెట్ అకాడమీ(NCA).

మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ బ్యాటర్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ కు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది నేషనల్ క్రికెట్ అకాడమీ(NCA).

IPL 2024.. రిషబ్ పంత్ రీ ఎంట్రీపై NCA కీలక అప్డేట్!

కారు ప్రమాదం నుంచి పూర్తిగా కోలుకున్నాడు టీమిండియా స్టార్ క్రికెటర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్. ఐపీఎల్ 2024 సీజన్ కోసం ప్రాక్టీస్ సైతం మెుదలుపెట్టాడు. భారీ షాట్లతో ప్రాక్టీస్ లో విరుచుకుపడిన వీడియో సైతం వైరల్ గా మారిన విషయం మనకు తెలిసిందే. దీంతో పంత్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. రీ ఎంట్రీకి అంతా సిద్ధంగా ఉన్న సమయంలో నేషనల్ క్రికెట్ అకాడమీ(NCA) కీలక అప్డేట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

రిషబ్ పంత్.. కారు ప్రమాదం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ కోసం కఠోరంగా శ్రమిస్తున్నాడు. ప్రస్తుతం గత కొన్ని రోజులుగా ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాక్టీస్ క్యాంప్ లో చమటోడుస్తున్నాడు. భారీ షాట్లతో విరుచుకుపడుతున్నాడు. అయితే పంత్ వికెట్ కీపింగ్ చేస్తాడా? చేయడా? అన్న విషయంపై మాత్రం ఇప్పటికీ..ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఢిల్లీ క్యాపిటల్స్. ఈ నేపథ్యంలో ఓ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే?

నేషనల్ క్రికెట్ అకాడమీ(NCA) రిషబ్ పంత్ ఫిట్ నెస్ పై ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వకపోవడంతో.. ఢిల్లీ క్యాపిటల్స్ అతడి పేరును టీమ్ లో చేర్చలేదు. అయితే పంత్ మాత్రం తన ప్రాక్టీస్ ను కొనసాగిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే ఎన్సీఏ నుంచి కీలక అప్డేట్ వచ్చినట్లు తెలుస్తోంది. రిషబ్ పంత్ కు నేషనల్ క్రికెట్ అకాడమీ నుంచి క్లియరెన్స్ వచ్చినట్లు సమాచారం. అతడు పూర్తిగా ఫిట్ నెస్ సాధించాడని అకాడమీ సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎన్సీఏ NOC ఇవ్వడంతో.. పంత్ ఐపీఎల్ ఆడేందుకు లైన్ క్లియర్ అవుతుంది. ఈ న్యూస్ ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్యాన్స్ కు సంతోషాన్ని ఇస్తోంది. ఇదిలా ఉండగా.. పంత్ వికెట్ కీపర్ గా అందుబాటులో ఉండడని, కేవలం కెప్టెన్, బ్యాటర్ గానే సేవలు అందిస్తాడని పలు నివేదికలు చెబుతున్నాయి. ప్రమాదం కారణంగా గతేడాది ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ ను నడిపించాడు డేవిడ్ వార్నర్.

ఇదికూడా చదవండి: IPL 2024.. KKR టీమ్ లోకి ప్రమాదకర ఆటగాడు! ఇక విధ్వంసమే..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి