కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన వార్నర్.. వరల్డ్ కప్ హిస్టరీలోనే..!

  • Author singhj Published - 03:43 PM, Sat - 28 October 23

వన్డే వరల్డ్ కప్​-2023లో ఆసీస్ స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ భీకర ఫామ్​లో ఉన్నాడు. వరుసగా విన్నింగ్ నాక్స్ ఆడుతూ ప్రత్యర్థులను భయపెడుతున్నాడు. ఈ క్రమంలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు వార్నర్.

వన్డే వరల్డ్ కప్​-2023లో ఆసీస్ స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ భీకర ఫామ్​లో ఉన్నాడు. వరుసగా విన్నింగ్ నాక్స్ ఆడుతూ ప్రత్యర్థులను భయపెడుతున్నాడు. ఈ క్రమంలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు వార్నర్.

  • Author singhj Published - 03:43 PM, Sat - 28 October 23

ఛాంపియన్ టీమ్స్​ను ఎప్పుడూ తక్కువ అంచనా వేయొద్దంటారు. కిందపడినా మళ్లీ బలంగా బౌన్స్ బ్యాక్ అవ్వడం వాటికి తెలుసు. అందుకే బడా టీమ్స్​తో పెట్టుకోవద్దంటారు. ఇప్పుడు ఆస్ట్రేలియా గేమ్​ను చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. వరల్డ్ కప్-2023లో ఆడిన తొలి రెండు మ్యాచుల్లోనూ కమిన్స్ సేన ఓడిపోవడంతో ఆ టీమ్ పనైపోయిందని అంతా అనుకున్నారు. కానీ కంగారూలు మాత్రం బలంగా కమ్‌బ్యాక్ ఇచ్చారు. వరుసగా హ్యాట్రిక్ విజయాలతో తాము ఎంత డేంజరస్ అనేది ప్రూవ్ చేశారు. భారీ టార్గెట్స్ పెడుతూ, ప్రత్యర్థులను తక్కువ స్కోర్లకే ఆలౌట్ చేస్తోంది ఆసీస్. దీంతో ఆ జట్టు నెట్​రన్​ రేట్ కూడా బెటర్ అయింది.

చిన్న టీమ్, పెద్ద టీమ్ అనేది లేకుండా ఎదురొచ్చిన ప్రతి టీమ్​పై భారీ విజయాలు నమోదు చేస్తోంది ఆస్ట్రేలియా. కనికరం అనేదే లేకుండా తమ అటాకింగ్ ఫార్ములానే మళ్లీ అమలు చేస్తోంది. ఇవాళ న్యూజిలాండ్​తో జరుగుతున్న మ్యాచ్​లోనూ ఇదే మంత్రాన్ని ఫాలో అవుతోంది కంగారూ టీమ్. కివీస్​తో జరుగుతున్న మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​కు దిగిన ఆసీస్ 49.2 ఓవర్లలో ఏకంగా 388 పరుగుల భారీ స్కోరు చేసింది. మంచి బౌలింగ్ అటాక్ కలిగిన న్యూజిలాండ్​పై ఇంత స్కోరు అంటే మామూలు విషయం కాదు. ఆసీస్ బ్యాటర్లలో డేవిడ్ వార్నర్ (81) సూపర్ ఫామ్​ను కంటిన్యూ చేస్తూ మరోసారి సత్తా చాటాడు. ఇంజ్యురీ తర్వాత కమ్​బ్యాక్ ఇస్తున్న మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ (109) సెంచరీతో చెలరేగాడు.

వార్నర్, హెడ్​తో పాటు మార్ష్ (36), మ్యాక్స్​వెల్ (41), ఇంగ్లిస్ (38), కమిన్స్ (37) కూడా రాణించారు. కివీస్ బౌలర్లలో బౌల్ట్, ఫిలిప్స్​ చెరో 3 వికెట్లు తీశారు. శాంట్నర్​కు 2 వికెట్లు దక్కాయి. ఛేజింగ్​కు దిగిన న్యూజిలాండ్​ దూకుడుగా ఆడుతోంది. ఆ టీమ్ ప్రస్తుతానికి 3 ఓవర్లలో వికెట్లేమీ కోల్పోకుండా 29 రన్స్ చేసింది. కాన్వే (17 నాటౌట్), యంగ్ (3) క్రీజులో ఉన్నారు. ఇక, ఈ మ్యాచ్​లో మరో హాఫ్ సెంచరీ బాదిన వార్నర్ వరల్డ్ కప్​లో ఆరు మ్యాచుల్లో కలిపి 413 రన్స్ పూర్తి చేసుకున్నాడు. అత్యధిక రన్స్ బాదిన బ్యాటర్ల లిస్టులో సెకండ్ ప్లేస్​లో ఉన్న వార్నర్.. కివీస్​తో మ్యాచ్​లో అరుదైన ఘనత సాధించాడు.

వన్డే వరల్డ్ కప్ హిస్టరీలో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్ల లిస్టులో నాలుగో స్థానానికి చేరుకున్నాడు వార్నర్. ఈ క్రమంలో భారత స్టార్ విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును డేవిడ్ భాయ్ బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో టీమిండియా లెజెండ్ సచిన్ టెండూల్కర్, ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్, శ్రీలంక గ్రేట్ కుమార సంగక్కర తర్వాతి స్థానాన్ని వార్నర్ ఆక్రమించాడు. కాగా, వరల్డ్ కప్స్​లో వార్నర్ 23 ఇన్నింగ్స్​ల్లో 1,405 రన్స్ చేయగా.. కోహ్లీ 31 ఇన్నింగ్స్​ల్లో 1,384 రన్స్ చేసి ఐదో ప్లేసులో ఉన్నాడు. మరి.. వార్నర్ బ్యాటింగ్​ దూకుడుపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments