iDreamPost
android-app
ios-app

పరువుపోగొట్టుకున్న ఆసీస్.. జింబాబ్వేని తలపించేలా క్యాచ్ లు మిస్!

  • Author Soma Sekhar Published - 09:13 PM, Thu - 12 October 23
  • Author Soma Sekhar Published - 09:13 PM, Thu - 12 October 23
పరువుపోగొట్టుకున్న ఆసీస్.. జింబాబ్వేని తలపించేలా క్యాచ్ లు మిస్!

వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో సౌతాఫ్రికా 311 పరుగుల భారీ స్కోర్ చేసింది. అయితే సౌతాఫ్రికా భారీ స్కోర్ చేసింది అనడం కంటే.. ఆసీస్ భారీ స్కోర్ చేయడానికి ప్రత్యర్థికి సహకరించింది అనడం బెటర్. ఎందుకంటే? ఈ మ్యాచ్ లో ఆసీస్ ఫీల్డింగ్ ఎంత ఘోరంగా ఉందో చెప్పడానికి మాటలు కూడా చాలావు. వరల్డ్ కప్ లాంటి మెగాటోర్నీల్లో పసికూన జింబాబ్వే ఫీల్డింగ్ ను తలపించేలా క్యాచ్ లను డ్రాప్ చేసింది. సునాయసంగా పట్టే క్యాచ్ లను కూడా మిస్ చేసి.. చెత్త రికార్డును మూటగట్టుకుంది కంగారూ టీమ్. ఈ మ్యాచ్ లో ఏకంగా 6 క్యాచ్ లను జారవిడిచి పరువుపోగొట్టుకుంది. దీంతో సౌతాఫ్రికా భారీ టార్గెట్ ను ఆసీస్ ముందుంచింది.

సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా టీమ్ చెత్తరికార్డును నమోదు చేసింది. ఈ మ్యాచ్ లో ఏకంగా ఆరు క్యాచ్ లను జారవిడిచి పరువుపోగొట్టుకుంది. ఎన్నో సంవత్సరాలుగా ఫీల్డింగ్ లో తోపుటీమ్ అనిపించుకుంటూ వస్తున్న కంగారూ జట్టు.. ఈ మ్యాచ్ లో మాత్రం తేలిపోయింది. 2018 నుంచి వన్డే మ్యాచ్ ల్లో ఒకే మ్యాచ్ లో ఎక్కువ క్యాచ్ లు మిస్ చేసిన జట్టుగా ఆసీస్ నిలిచింది. గతంలో 2022లో ఇంగ్లాండ్ పై కూడా ఇలాగే క్యాచ్ లు మిస్ చేసింది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 49వ ఓవర్ లో ఏకంగా రెండు క్యాచ్ లను జారవిడిచారు ఆసీస్ ఆటగాళ్లు. అందులో ఒకటి మిల్లర్ ఇచ్చిన క్యాచ్ అయితే.. రెండోది జాన్సెన్ ఇచ్చిన క్యాచ్. మిల్లర్ క్యాచ్ ను స్టార్క్ జారవిడిస్తే.. జాన్సెన్ క్యాచ్ ను స్టార్ ఆల్ రౌండర్ స్టోయినిస్ మిస్ చేశాడు. ఈ క్యాచ్ లే కాకుండా.. మరో నాలుగు క్యాచ్ లు డ్రాప్ చేశారు ఆసీస్ ప్లేయర్లు.

ఈ మ్యాచ్ లో వీరి ఫీల్డింగ్ చూస్తే.. పసికూన జింబాబ్వే జట్టు గుర్తుకురాక మానదు. వారిని తలపించేలా మిస్ ఫీల్డ్ చేశారు ఆసీస్ ప్లేయర్లు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 311 పరుగుల భారీ స్కోర్ సాధించింది. జట్టులో క్వింటన్ డికాక్ వరసగా రెండో సెంచరీతో దుమ్మురేపాడు. అతడు 106 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 109 పరుగులు చేయగా.. మార్క్రమ్ 56 పరుగులతో రాణించాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, మాక్స్ వెల్ తలా రెండు వికెట్లు తీశారు. అనంతరం 312 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ కు ఆదిలోనే షాకిచ్చాడు మార్కో జాన్సన్. మిచెల్ మార్ష్(7)ను తక్కువ పరుగులకే పెవిలియన్ కు చేర్చాడు. ఆ తర్వాతి ఓవర్ లోనే వార్నర్(13)ను ఎంగిడి బోల్తాకొట్టించాడు. దీంతో 27 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది ఆసీస్ టీమ్. మరి ఆస్ట్రేలియా ఫూర్ ఫీల్డింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.