iDreamPost

గిల్ తరువాత మరో స్టార్‌కి డెంగ్యూ! పాక్ మ్యాచ్‌కు దూరం!

  • Author Soma Sekhar Published - 06:09 PM, Thu - 12 October 23
  • Author Soma Sekhar Published - 06:09 PM, Thu - 12 October 23
గిల్ తరువాత మరో స్టార్‌కి డెంగ్యూ! పాక్ మ్యాచ్‌కు దూరం!

టీమిండియా యువ ఓపెనర్ శుబ్ మన్ గిల్ డెంగ్యూ బారిన పడి వరల్డ్ కప్ లో తొలి రెండు మ్యాచ్ లకు దూరం అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతను ఇప్పుడిప్పుడే కోలుకుని ప్రాక్టీస్ మెుదలుపెట్టాడు. దీంతో టీమిండియా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా మరో టీమిండియా దిగ్గజం డెగ్యూ బారిన పడ్డాడు. దీంతో అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఇండియా-పాక్ మ్యాచ్ కు అతడు దూరం కానున్నాడు. అయితే ఒకరివెంట మరోకరు డెంగ్యూ బారిన పడుతుండటంతో.. దోమలు పగబట్టాయా అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

శుబ్ మన్ గిల్ డెంగ్యూ బారినపడి వరల్డ్ కప్ లో తొలి రెండు మ్యాచ్ లకు దూరం అయిన సంగతి తెలిసిందే. గిల్ ప్రస్తుతం రికవరీ అవుతూ.. ప్రాక్టీస్ కూడా మెుదలుపెట్టాడు. ఈ క్రమంలోనే మరో టీమిండియా దిగ్గజానికి డెంగ్యూ పాజిటీవ్ అని తేలింది. అయితే అతడు ఆటగాడు కాదు.. కామెంటేటర్. భారత ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే తాజాగా డెంగ్యూ బారినపడ్డారు. దీంతో అతడు అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 14న ఇండియా-పాక్ మ్యాచ్ కు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.

“దాయాదుల పోరుకు దూరం అవుతున్నందుకు బాధగా ఉంది. నేను డెంగ్యూ బారిన పడ్డాను. బలహీనతగా ఉండటం వల్ల ఈ మ్యాచ్ కు నేను రాలేకపోతున్నాను” అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చారు భోగ్లే. కాగా.. హర్ష భోగ్లే తనదైన కామెంటరీతో మ్యాచ్ ను ఉర్రూతలూగిస్తాడు. ఇక గిల్ డెంగ్యూ నుంచి కోలుకుని ప్రాక్టీస్ మెుదలుపెట్టాడు. దీంతో పాక్ తో జరిగే మ్యాచ్ కు అతడు అందుబాటులోకి వస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై అధికారిక సమాచారం లేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి